EPAPER

Gold Rate Today: అయ్య బాబోయ్.. తులం బంగారం లక్ష రూపాయలు

Gold Rate Today: అయ్య బాబోయ్.. తులం బంగారం లక్ష రూపాయలు

Gold Rate Today: ఏంటీ.. తులం బంగారం రూ.లక్షా.. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా.? అవును అతి త్వరలోనే పసిడి ధర అక్షరాల రూ.లక్ష చేరుకుంటుందని మార్కెట్ల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు భారీగా బంగారం పెరగటానికి కారణాలు ఏంటి?


మధ్య ప్రాశ్చంలో పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలోనే  పసిడి ధరలు పెరుగుతున్నాయని బిలియన్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా క్రూడ్ ఆయిల్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. పిరిస్థితి ఇంకా కొనసాగితే ఇండియా, చైనా ఇతర దేశాల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లు కుంటుపడే అవకాశం కనిపిస్తుంది. దీని ఫలితంగా స్టాక్ మార్కెట్లు సైతం అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తలో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక భవిష్యత్తులో బంగారం(Gold) కొనాలంటే.. అంబానీ అయ్యిండాలేమో అనేలా కనిపిస్తోంది. 2004 లో పసిడి ధర(Gold Rate) 6, 300 ఉండేది. కానీ ఇప్పుడు 79 వేలకు చేరింది. ప్రపంచంలో ఎన్ని సంక్షోభాలు వచ్చిన బంగారంలోన పెట్టుబడులు పెట్టేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక రానున్నది దీపావళి పండుగ. అందులోను కార్తీక మాసం, పూజలు, వ్రతాలు చేస్తూ మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. దీంతో పాటు వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకేముంది పసిడి ధరలు కొండెక్కి కూర్చుంటాయి.


Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

బడ్జెట్ పుణ్యమా అని మధ్యలో తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు మళ్లీ పుంజుకోవడం, దేశీయంగా పండగ గిరాకీ పెరగడమే ఇందుకు కారణం అని బిలియన్ మార్కెట్లు చెబుతున్నాయి. దీపావళి పర్వదినం(deepavali) సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా కొనుగోలు జరుగుతాయి. ధంతేరస్ రోజు బంగారం ఖచ్చితంగా కొనుగోలు చెయ్యాలనే సాంప్రదాయం గత కొన్నాళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో బంగారానికి(Gold) ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ధరలు భారీగా పెరగడం కొనుగోలుపై ప్రతికూల ప్రభావం చూపించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనేందుకు ప్రజలు మొగ్గుచూపిన పరిమితంగా ఉండొచ్చు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

తెలంగాణలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర((Gold Rate) రూ. 73,000 ఉంది.

విజయవాడలో కూడా 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate)  రూ.79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 790 తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73, 150 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 పెరిగింది.

 

Related News

Indian Railways: ఈ రైల్వే స్టేషన్ పేరేంటి ఇంత పొడవుంది.. దేశంలోనే లాంగెస్ట్ నేమ్.. మరి షార్టెస్ట్?

Jio Cinema Shut Down: ‘జియో సినిమా’ క్లోజ్? ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం!

Indian Railway New Rules: రైల్లో పెద్ద పెద్దగా మ్యూజిక్ ప్లే చేస్తున్నారా? అయితే, ఈ శిక్ష తప్పదు

Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Free Petrol: ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకోవాలా? సింపుల్ గా ఈ రెండు ట్రిక్స్ ఫాలో అయిపోండి!

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

Big Stories

×