Big Stories

Investment On Gold : బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఇన్వెస్ట్‌మెంట్‌గా గోల్డ్ ఆప్షన్ ఎలా ఉంటుంది?

Investment On Gold : బంగారం బంగారమే. ఒక నమ్మకమైన పెట్టుబడి. అందుకేగా.. బంగారం ధరలు పెరుగుతున్నా.. ఇప్పటికీ గోల్డ్ షాపుల్లో రష్ తగ్గడం లేదు. పెళ్లి, పేరంటం, ఫంక్షన్ల పేరు చెప్పి ఎంతో కొంత బంగారం కొని పెట్టుకుంటారు. ఇదంతా ఇన్వెస్ట్ మెంట్ కిందే లెక్క. ప్రతి ఏడాది బంగారం ధరలు పెరుగుతుండడంతో.. కొన్న వారికి లాభాలను ఇస్తోందే తప్ప.. ఇప్పటి వరకు నష్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగని.. బంగారంలోనే పెట్టుబడి పెట్టాలా? అలా ఇన్వెస్ట్ చేయడం మంచిదేనంటారా. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ దీనికి వేరే ఆప్షన్ చెబుతున్నారు.

- Advertisement -

బంగారం ధర పెరుగుతోంది కదా అని మొత్తంగా బంగారంలోనే ఇన్వెస్ట్ చేయడం రాంగ్ మెథడ్. సపోజ్ నెలకు పది వేల రూపాయల చొప్పున పదేళ్ల పాటు పెట్టుబడి పెడితే బాగుంటుంది కదా అని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. బంగారం ధర పెరగడమే గానీ తగ్గడం లేదన్న కారణంతో ఇలా ఆలోచిస్తుంటారు. ఇందులో తప్పు లేదు. కాని, అది అంత మంచి పద్దతి కాదంటారు ఆర్థిక నిపుణులు. సరే.. ఒకేసారి పది వేల రూపాయలు పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయొద్దు. మరి ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి?

- Advertisement -

బంగారం ధర ఎంత పెరుగుతున్నా సరే.. ఇన్వెస్ట్ చేయాలనుకున్న పదివేలలో 2వేల రూపాయలు మాత్రమే పెట్టాలంటున్నారు. అది కూడా డైరెక్టుగా బంగారం కొనడం కరెక్ట్ కాదు. గోల్డ్ ఫండ్స్ ఎంచుకోవడం మంచిది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లోనూ గోల్డ్ ఫండ్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పైగా హెచ్చుతగ్గుల నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌కు రక్షణ ఉంటుంది. అదే బంగారం కొంటే భవిష్యత్తులో తరుగు లాంటి వల్ల నష్టం ఉంటుంది. గోల్డ్ ఫండ్స్‌లో ఈ నష్టం ఉండదు. రూ.2వేలు బంగారంలో పెట్టి మిగతా 8వేల రూపాయలను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అందులోనూ హైబ్రిడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ఇంకా మంచిదని సలహా ఇస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News