EPAPER

Citroen Basalt: సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ లాంచ్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

Citroen Basalt: సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ లాంచ్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

Citroen Basalt: సిట్రోయెన్ ఇండియా ప్రొడక్షన్ స్పెక్ సిట్రోయెన్ బసాల్ట్ కూపే SUVని ఆవిష్కరించింది. బసాల్ట్ మార్చి 2024లో ఉత్పత్తికి దగ్గరగా ఉండే కాన్సెప్ట్‌గా ప్రివ్యూ అందుబాటులోకి వచ్చింది. ప్రొడక్షన్ మోడల్ ఎక్స్‌టీరియర్లో ఎటువంటి మార్పులు లేవు. బసాల్ట్ కాంపాక్ట్ SUV మార్కెట్లోకి రానుంది. అయితే ఇది రాబోయే టాటా కర్వ్‌తో నేరుగా పోటీపడుతుంది. ఆగస్ట్ 7న కర్వ్ లాంచ్ అవుతుంది. ఈ క్రమంలో బసాల్ట్ కొలతలు, ఫీచర్లు, ఇంజన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. కంపెనీ ఇంకా దాని ధర వివరాలను వెల్లడించలేదు. అయితే కొన్ని లీక్స్ ప్రకారం దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 13 లక్షలుగా ఉండొచ్చు.


డైమెన్షన్ బసాల్ట్ డిజైన్, స్టైలింగ్ కాన్సెప్ట్‌లో కనిపించే మోడల్‌ను పోలి ఉంటుంది. కాన్సెప్ట్‌తో పోలిస్తే ప్రొడక్షన్ మోడల్ చిన్నది. ఇందులో 16 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. ఇందులో కాన్సెప్ట్‌లో కనిపించే టైర్లలా మందంగా లేని విభిన్న టైర్లను అమర్చారు. బాడీ క్లాడింగ్‌లో మరో చిన్న మార్పు ఉంటుంది. అయితే ప్రొడక్షన్ మోడల్‌కు క్లాడింగ్ మాట్టే ఫినిషింగ్ ఉంటుంది. బసాల్ట్ వీల్‌బేస్ 2,651mm. ఇది C3 ఎయిర్‌క్రాస్ వీల్‌బేస్ కంటే 20mm చిన్నదిగా చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ.

Also Read: BSNL 5G: హైదరాబాద్‌లో BSNL 5G ట్రయల్ రన్.. టెన్షన్‌లో జియో, ఎయిర్‌టెల్


దీని డిజైన్ C3 ఎయిర్‌క్రాస్‌తో సమానంగా ఉంటుంది. దానితో దాని అండర్‌పిన్నింగ్‌లను కూడా కలిగి ఉంటుంది. బసాల్ట్ ఒక కర్వ్ ఉండే రూఫ్‌లైన్‌ను పొందుతుంది. ఇంటర్నల్ స్పాయిలర్ లిప్‌తో హై డెక్ లిడ్‌లోకి ఫ్లో అవుతుంది. LED యూనిట్‌ల వలె కనిపించే విధంగా రూపొందించిన టెయిల్-లైట్‌లు వాస్తవానికి ట్రెడిషనల్ బల్బులను కలిగి ఉంటాయి. కలర్స్‌లో సిట్రోయెన్ 5 సింగిల్-టోన్ పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, గార్నెట్ రెడ్, కాస్మో బ్లూ కలర్స్‌లో వస్తుంది. అవన్నీ బ్లాక్ కలర్స్ పైకప్పుతో వైట్, రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి.

బసాల్ట్ ఇంటీరియర్‌లో దాని డ్యాష్‌బోర్డ్ డిజైన్, లేఅవుట్, ఫీచర్లు 10.25 అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఇందులో 7.0-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే కూడా ఉంది. బ్యాక్ సీట్లకు అండర్ థై సపోర్ట్ ఉంది. బూట్ స్పేస్ విషయానికొస్తే బసాల్ట్ 470 లీటర్లు కలిగి ఉందని సిట్రోయెన్ చెబుతోంది. బసాల్ట్‌లోని ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో 15-వాట్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ ఉన్నాయి. బసాల్ట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ లేదు. దీనిని టాటా తన కర్వ్ SUVలో అందించనుంది.

Also Read: Hydrogen Bike: మతిపోగొడుతున్న కొత్త టెక్నాలజీ.. త్వరలో హైడ్రోజన్‌తో నడిచే బైక్!

బసాల్ట్ రెండు ఇంజన్‌లతో అందుబాటులో ఉంటుంది. మొదటిది నాచురల్ ఎక్స్‌పెక్ట్  1.2-లీటర్ పెట్రోల్ 81 bhp పవర్, 115 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది మొదట C3 హ్యాచ్‌బ్యాక్‌‌లో తీసుకొచ్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది బసాల్ట్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. రెండు గేర్‌బాక్స్‌ల పవర్ అవుట్‌పుట్ 108 bhp ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ 195 ఎన్ఎమ్ టార్క్, ఆటోమేటిక్ వెర్షన్ 210 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. 1.2 లీటర్ వెర్షన్ ARAI ధృవీకరించబడిన మైలేజ్ 18 kmpl, టర్బో పెట్రోల్ మాన్యువల్ 19.5 kmpl, టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ 18.7 kmpl ఉంటుంది.

Related News

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Big Stories

×