EPAPER

Free Petrol: ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకోవాలా? సింపుల్ గా ఈ రెండు ట్రిక్స్ ఫాలో అయిపోండి!

Free Petrol: ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకోవాలా? సింపుల్ గా ఈ రెండు ట్రిక్స్ ఫాలో అయిపోండి!

Free Petrol Tricks: నిత్యం మన వాహనాలకు ఫ్యూయెల్ కొట్టిస్తాం. ప్రయాణాన్ని బట్టి పెట్రోల్ పోయించుకుంటారు. బంక్ లో డబ్బులు చెల్లిస్తాం. ఒక్కోసారి డబ్బులు చెల్లించకుండా పెట్రోల్ పోయించుకుంటే ఎంత బాగుంటుంది? అని ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ ఊహను నిజం చేసుకోవచ్చు కూడా. అదేంటి.. ఫ్రీగా పెట్రోల్ ఎందుకు పోస్తారని లోచిస్తున్నారా? ఈ రెండు ట్రిక్స్ ప్లే చేస్తే ఉచితంగా పెట్రోల్ పోయించుకునే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


ఫ్రీగా పెట్రోల్ పొందే అవకాశం కేవలం HP పెట్రోల్ బంక్స్ మాత్రమే కల్పిస్తున్నాయి. రెండు పద్దతుల ద్వారా HP పెట్రోల్ బంక్ లో ప్రీగా ప్యూయెల్ పోయించుకోవచ్చు. అందులో ఒకటి HP పే ఉపయోగించి ఉచితంగా పెట్రోల్ పొందవచ్చు. మరొకటి HP పవర్ కార్డ్ ద్వారా ఫ్రీ పెట్రోల్ తీసుకోవచ్చు. HP పేతో పోల్చితే HP పవర్ కార్డ్ ద్వారా ఎక్కువ పెట్రోల్ పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ వాటిని ఎలా ఉపయోగించాలంటే..

1.HP పే


HP కంపెనీకి చెందిన HP పేని ఉపయోగించి ఫ్రీగా పెట్రోల్ కొట్టించుకోవచ్చు. యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి  HP పే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఈ వ్యాలెట్ లో మీరు రూ. 100 యాడ్ చేస్తే 3 పాయింట్స్ వస్తాయి. అదే రూ. 100తో పెట్రోల్ కొట్టిస్తే ఇంకో పాయింట్ వస్తుంది. మొత్తంగా రూ. 100కు 4 పాయింట్లు వస్తాయి. ఇలా మీరు వెళ్లిన ప్రతిసారి మినిమం రూ. 100 నుంచి రూ. 150 కొట్టించుకుంటే నెలకు సుమారు రూ. 4 వేల నుంచి రూ. 4.5 ఖర్చు అవుతుంది. 160 పాయింట్లు వస్తాయి. ఏడాదికి 1920 పాయింట్లు వస్తాయి. 4 పాయింట్లు రూ.1కి సమానం. ఆ పాయింట్స్ ను క్యాష్ లోకి మార్చితే రూ. 480 అవుతాయి. మీరు HP పెట్రోల్ బంక్ కు వెళ్లి HP పే ద్వారా పే చేస్తానంటే వాళ్లే సపరేట్ క్యూఆర్ కోడ్ ఇస్తారు. దాన్నియూజ్ చేసి మీ వ్యాలెట్ లో ఉన్న పాయింట్స్ తో ఏడాదికి 4 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్ పొందే అవకాశం ఉంటుంది.

2.HP పవర్ కార్డ్

ఇక ఇదే కంపెనీకి చెందిన HP వపర్ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి HP పే ద్వారా డబ్బులు పే చేసి ఫ్యూయెల్ ను కొట్టిస్తే పెద్ద మొత్తంలోరిటర్న్స్ వస్తాయి. ప్రతి పేమెంట్ మీద 6.5 రిటర్న్ లభిస్తుంది. వెళ్లి HP పే ద్వారా ఏడాదికి 4 లీటర్లు ఫ్రీ ఫ్యూయెల్ లభిస్తే,  HP పవర్ కార్డును ఉపయోగించి ఏడాదికి 26 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు రూపే కార్డు కాట్టి UPIకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డు కోసం ఫ్రీ పెట్రోల్ IDFC పవర్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఈ రెండు పద్దతుల ద్వారా ఎక్కువ ఫ్యూయెల్ కొట్టించుకునే వారికి పెద్ద మొత్తంలో ఉచితంగా పెట్రోల్ పొందే అవకాశం లభిస్తుంది. సో, మీరూ ఫ్రీ పెట్రోల్ కోసం ట్రై చేయండి.

Read Also: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

Related News

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

Fact Check: మీ IRCTC ఐడీతో వేరే వాళ్లకు టికెట్స్ బుక్ చెయ్యొచ్చా? అసలు విషయం చెప్పిన రైల్వేశాఖ

Bengaluru Air Taxis: బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు, 5 నిమిషాల్లో గమ్యానికి, మరి హైదరాబాద్‌లో?

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Vande Bharat Sleeper Train: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

Big Stories

×