Big Stories

UPI Payment precautions : యుపిఐ ప్రెమెంట్స్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

UPI Payment precautions : ఇప్పుడు ఎక్కడ చూసినా దాదాపు అందరూ యుపిఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. దానికోసం మీ దగ్గర ఎలాంటి చార్జీలను యుపిఐ తీసుకోదు. నడుస్తుంది డిజిటల్ యుగం కనుక చెల్లింపులు అన్ని డిజిటల్ గానే కొనసాగుతున్నాయి. ఒక నెలలోనే యుపిఐ లావాదేవీలు 10 లక్షల కోట్లు దాటింది. ప్రతీ నెల ఈ లెక్క పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.

- Advertisement -

అయితే లావాదేవీలు ఎలాగైతే పెరుగుతూ ఉన్నాయో ప్రెమెంట్స్ క్రైములు కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలు అన్నీ తెలిసిన వారు కూడా సైబర్ క్రైమ్ వలలో చిక్కిపోతున్నారు. ఫోన్ ఓపెన్ చేయగానే ఎన్నో లింకులు మన ఫోన్ స్క్రీన్ పై పాప్ అప్ అవుతూ ఉంటాయి. పొరపాటున కొన్ని సార్లు అనుకోకుండా మనం ఆ లింకులపై క్లిక్ చేసి సమస్యను కొనితెచ్చుకుంటాం.

- Advertisement -

యుపిఐ పేమెంట్ లావాదేవీలను సురక్షితంగా చేయాలనుకుంటే మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఏదయినా ప్రెమెంట్స్ ను రిసీవ్ చేసుకునేప్పుడు మీరు యూపీ పిన్ ను నమోదు చేయనవరసం లేదు. మీకు తెలియని యుపిఐ పేమెంట్ లింక్స్ పైన క్లిక్ చేయవద్దు. మీ యుపిఐ పిన్ ను సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పవద్దు. యుపిఐ ప్రెమెంట్స్ ఎవరికయితే చేస్తున్నారో వారి వివరాలను ముందుగానే ధ్రువీకరణ చేసుకోవాలి. మీ యుపిఐ పిన్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడం వాళ్ళ మీ యుపిఐని హ్యాక్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News