Big Stories

Loan Apps Security Tips : రుణం తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే..

Loan Apps Security Tips : గతంలో కొందరు అడగ్గానే అప్పు ఇచ్చి వడ్డీల వడ్డీలు తీసుకొని ఆర్ధికంగా పిండేసేవారు. ఇప్పుడు వారి స్థానంలో లోన్ యాప్‌లు వచ్చాయి. కొన్ని లోన్ యాప్స్ నెలకు 40 శాతం వడ్డీతో కూడ రుణాలు ఇస్తున్నాయి. అత్యవసర సమయంలో డబ్బు అవసరం ఉన్నవారు ఈ లోన్‌యాప్స్‌లో లోన్ తీసుకొని బలైపోతున్నారు. లోన్ యాప్ లేదా ఏ ఫైనాన్స్ సంస్థ నుంచైనా లోన్ తీసుకొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

మీరు రుణం తీసుకోబోయే లోన్ యాప్ ఆర్బీఐ గుర్తింపు పొందిందా లేదా చెక్ చేసుకోవాలి. ఆర్బీఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆ సంస్థకు సంబంధించిన వివరాలను తనిఖీ చేసుకోవాలి. రుణుం తీసుకునే వారి పూర్తి వివరాలను ఆయా సంస్థలు తీసుకున్నట్లే, మనము కూడా సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోవాలి.

- Advertisement -

ఏ దృవీకరణ పత్రాలు లేకుండానే లోన్ ఇవ్వడానికి కొన్ని సంస్థలు రెడీగా ఉంటాయి. వీటిపట్ల మీరు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. సాలరీ స్లిప్పులు, ఆధాయ ధృవీకరణ పత్రాలు, క్రెడిట్ స్కోర్, ఇవేవీ లేకుండానే లోన్ ఇస్తున్నాయంటే మిమ్మల్ని ఇల్లీగల్‌గా భవిష్యత్తులో హరాస్మెంట్ చేస్తాయని గుర్తించాలి.

ఎవరైనా మీకు ఫోన్ చేసి.. మేము రుణ సంస్థల నుంచి కాల్ చేస్తున్నాము.. మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నంబర్లు అడిగితే చెప్పకంటి. మీరు ఎటువంటి ఓటీపీని కూడా వారితో షేర్ చేయవద్దు. మీ బ్యంక్‌కు సంబంధించిన క్రెడిట్ కార్డు, ప్యాన్ లాంటి ఏ వివరాలను కూడా మీరు ఆన్‌లైన్‌లో ఎవ్వరికీ చెప్పవద్దు. అలా గనక చేస్తే మీ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం దోచుకెళ్లే ప్రమాదం ఉంది.

రుణం ఇచ్చే సంస్థలకు సొంత వెబ్‌సైట్ ఉండాలి లేదంటే అది ఫ్రాడ్ సంస్థ అని మీరు నిర్ధారణకు రావాలి. క్రిడిట్ స్కోరు లేకున్నా మీకు రుణం ఇస్తామని మీకు పదే పదే ఫోన్ కాల్స్ చేస్తే ఆ నంబర్లను బ్లాక్ చేయండి. వాటికి సంబంధించిన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. లోన్ ఇవ్వకముండే మీరు ఏ సంస్థకు కూడా ఒక్క రూపాయి చెల్లించినవసరం లేదు, చెల్లించవద్దు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News