EPAPER

Organic Produce Sale: ఆర్గానిక్ ఉత్పత్తులు.. ఇలా అమ్మితే లాభసాటి..

Organic Produce Sale: ఆర్గానిక్ ఉత్పత్తులు.. ఇలా అమ్మితే లాభసాటి..
Organic Produce Sale

Organic Produce Sale (india today news):


సేంద్రియ వ్యవసాయంపై రైతులు మక్కువ పెంచుకుంటున్నారు. ఆరోగ్య పరిరక్షణలో రసాయన రహిత ఆహారం, ఉత్పత్తులకు ఉన్న ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అందుకే రసాయన ఎరువులు, పురుగుల మందులు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఆహారోత్పత్తులకు అంత క్రేజ్.

పెద్ద రైతులే కాకుండా.. చిన్న రైతులు కూడా సేంద్రియ సాగు చేపడుతున్నారు. దీనిపై ఆసక్తి ఉన్న కొందరైతే తమకు అందుబాటులో ఉన్న కొద్ది పాటి స్టలంలోనో లేకుంటే మిద్దపైనో కూరగాయలను సైతం రసాయన రహితంగా పండిస్తున్నారు.


దేశంలోనే అత్యధికంగా 44.3 లక్షల మంది సేంద్రియ రైతులు ఉన్నట్టు 2022-2023 ఆర్థిక సర్వే గణాంకాలు చెబుతున్నాయి. ఇక 2.6 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో సేంద్రియ సాగు జరుగుతోంది. సాధారణంగా సేంద్రియ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆదాయం గణనీయంగా ఉంటుంది. అయితే రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులను విక్రయించేందుకు సంప్రదాయ హోల్ సేల్ మార్కెట్లపైనే ఆధారపడుతున్నారు.

సేంద్రియ సాగును మరింత లాభసాటిగా మార్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. అయితే వినియోగదారుల విశ్వసనీయతను చూరగొనడమే మనం చేయాల్సిన మొదటి పని. విక్రయ మార్గాల్లో ఒకదానిని ఎంచుకుని వినియోగదారులకు చేరువైతే చాలు..

స్థానిక రైతుల మార్కెట్లు

వారం వారం లేదంటే నెలవారీగా రైతుల మార్కెట్లను నిర్వహించడం చూస్తుంటాం. దేశంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఇలాంటి రైతు మార్కెట్లు కనిపిస్తూనే ఉంటాయి. ఆ సమీపంలోని రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేది ఈ రైతు మార్కెట్ల ద్వారానే. పర్యావరణం, ఆరోగ్యంపై అవగాహన ఉన్న వారిని ఇలాంటి మార్కెట్లు అధికంగా ఆకట్టుకుంటాయి. ధర కాస్త ఎక్కువైనా సరే.. సేంద్రియ ఉత్పత్తుల కోసమే ప్రజలు చూస్తున్నారు.

ఎందరో రైతులు ఇలాంటి మార్కెట్ల ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనగలుగుతున్నారు. తద్వారా వినియోగదారుల పరిధిని పెంచుకుంటున్నారు. ఎంబీఏచదివిన మహారాష్ట్ర రైతు ఒకరు దేశంలోని రైతుల నుంచి సేంద్రియ
తాజా ఉత్పత్తులు, కిరాణా మరియు ఇతర ఉత్పత్తులను సోర్స్ చేసి, వాటిని ఆన్‌లైన్‌లో ‘ది ఫార్మర్’ బ్రాండ్ క్రింద విక్రయిస్తుండటం విశేషం.

ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు/ సొంత వెబ్‌సైట్

సేంద్రీయ ఉత్పత్తులను రైతులు నేరుగా వినియోగదారులకు విక్రయంచే మరో ప్రత్యామ్నాయ మార్గం ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, మార్కెట్‌ప్లేస్‌లు. వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా సేంద్రియ ఉత్పత్తులు దేశంలో ఏ మూలన ఉన్నవారికైనా సులువుగా చేర్చొచ్చు. అధిక లాభాల ఆర్జనకు ఇదో మార్గం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద ప్లాట్‌ఫారమ్‌లు కాకుండా, ఆర్గ్‌పిక్, ది ఫార్మర్ తదితర ఆర్గానిక్ ఫుడ్‌ మార్కెట్ ప్లేసులు అనేకం ఉన్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌ సోలన్‌కు చెందిన మన్‌దీప్ వర్మ తాను సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కివీని తన వెబ్‌సైట్ స్వస్తిక్ ఫామ్స్ ద్వారా నేరుగా నియోగదారులకు చేర్చగలుగుతున్నాడు. విక్రయిస్తున్నాడు. తోట నుంచే నేరుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చండీగఢ్, ఇతర ప్రాంతాల్లోని వినియోగదారులకు సరఫరా చేస్తుండటం గమనార్హం.

కమ్యూనిటీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్

సేంద్రీయ రైతులు అందరూ కలిసి ఒక కమ్యూనిటీగా ఏర్పడొచ్చు. తమ తాజా ఉత్పత్తులను నేరుగా పొలం నుంచే విక్రయించొచ్చు. క్రమం తప్పకుండా పంట కొనే వినియోగదారులకు, రైతులకు మధ్య సంబంధాలు మరింత దృఢంగా మారతాయి. పంట ఉత్పత్తులకు సరైన ధర కూడా లభిస్తుంది. కేరళకు చెందిన దాదాపు 30 మంది వరి ఇలాగే కమ్యూనిటీగా ఏర్పడి తమ ఉత్పత్తులను అమ్మకానికి పెడుతున్నారు. దీంతో ప్రపంచంలో నలుమూలలా ఉండే బయ్యర్లతో రైతులు సంబంధాలు నెరపగలుగుతున్నారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెడితే చాలు.. కేరళ నుంచి నేరుగా వినియోగదారుల గుమ్మం వద్దకే బియ్యం బస్తాలు చేరుతున్నాయి.

సోషల్ మీడియా/ డిజిటల్ మార్కెటింగ్

ఇప్పుడు సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యం గురించి వివరించి చెప్పనక్కర్లేదు. మీ పంట ఉత్పత్తుల వివరాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్, ఎక్స్ వంటి వేదికల ద్వారా పంచుకుంటే చాలు. క్షణాల్లో ప్రపంచమంతటా తెలిసిపోతుంది. ఆసక్తి ఉన్న వారు వెంటనే ఆయా ఉత్పత్తుల కోసం సంప్రదిస్తారు. కాకపోతే రైతులు సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణ, సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది.

రెస్టారెంట్లు, కేఫ్‌లు

ఆర్గానిక్ ఉత్పత్తులను మాత్రమే వినియోగించే కొన్ని రెస్టారెంట్లు, కేఫ్ లు ఉంటాయి. తొలుత అలాంటివాటిని గుర్తించి.. సంప్రదించాలి. రవాణా ఖర్చులను తగ్గించి, నేరుగా సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి వీలు కల్పించే ఉత్తమ మార్గం ఇది. రాజస్థాన్‌ పిలానీకి చెందిన సేంద్రియ రైతు తాను పండించిన ఖర్జూరం, పుచ్చకాయలు, ఆలివ్‌లను ఉత్తర భారతదేశంలోని కొన్ని టాప్ ఫైవ్-స్టార్ హోటళ్లకు నేరుగా సరఫరా చేస్తున్నాడు. ఆ మేరకు హోటళ్లతో టై-అప్‌ పెట్టుకున్నాడు.

సేంద్రియ ఆహార దుకాణాలు/కో-ఆప్‌లు

సమీప ప్రాంతంలోని ఆర్గానిక్ ఫుడ్ స్టోర్లు, సహకార సంస్థలను సంప్రదించడం మరో ప్రత్యామ్నాయం. చెన్నైలోని వేర్ ఆర్గానిక్, ఉజావు ఆర్గానిక్ వంటి దుకాణాలు రైతుల నుండి తాజా పండ్లు, కూరగాయలు, ఉత్పత్తులను సేకరిస్తాయి. అలాంటి వారికి నేరుగా మన పంట ఉత్పత్తులను విక్రయించకోవచ్చు. కొన్ని దుకాణాలే నేరుగా పొలం నుంచే కొనుగోలు చేస్తాయి. మీపై రవాణా ఖర్చు భారం కూడా పడకుండా చూస్తాయి.

సంస్థలకు ప్రత్యక్ష విక్రయాలు

పాఠశాలలు, ఆస్పత్రులు, కార్పొరేట్ ఫలహారశాలలు, ఆరోగ్యకర ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చే ఇతర సంస్థలకు సేంద్రి ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఫుడ్ ఈవెంట్‌లు, వర్క్‌షాప్‌లు,ఫెస్టివల్స్‌లో పాల్గొనడం ద్వారా మన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రచారం కల్పించే వీలుంది. సృజనాత్మక మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించడం ద్వారా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను లాభసాటిగామార్చుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. అయితే అలాంటి సమర్థవంతమైన మార్కెట్ మార్గాలను గుర్తించి, వాటిని అనుసరించే ప్రయత్నం చేయడమే రైతులు చేయాల్సింది.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×