Big Stories

Elon Musk : మనిషి మెదడులో చిప్… కంప్యూటర్ తో లింక్

Elon Musk : అప్పటిదాకా నీరసంగా ఉంటాడు. ఇంతలో అతడి మెదడులో ఏదో చిప్ అమర్చగానే ఒక్కసారిగా విజ్రుంభిస్తాడు. మానవాతీత శక్తులేవో ఆవహించినట్లు శత్రువులపై విరుచుకుపడతాడు. ఇలాంటి సీన్లు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తాయి. ఇక నుంచి నిజజీవితంలోనూ కనిపించే అవకాశం ఉందంటున్నారు వ్యాపార దిగ్గజం, న్యూరాలింక్ ప్రాజెక్టు అధినేత ఎలాన్ మస్క్. ఎలక్ట్రిక్ కార్లు, స్పేస్ టూరిజం, ట్విట్టర్ వంటివాటికి అధిపతి అయిన ఎలాన్ మస్క్… న్యూరాలింక్ ప్రాజెక్టును కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్రుత్రిమ మేథస్సు-ఏఐ అంటే మస్క్ కు నచ్చదు. అది మనిషి కంటే తెలివి మీరిపోతుందనేది మస్క్ భావన. అందుకే ఆ పరిస్థితి రాకుండా మనిషి మెదడులో చిప్ అమర్చి… అతడికి మానవాతీత శక్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
మెదడులో చిప్ అమర్చి దానిని కంప్యూటర్ తో లింక్ చేయనున్నారు. ఆ టెక్నాలజీ పేరే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ ఫేస్-బీసీఐ. మరో ఆరు నెలల్లో మెదడులో చిప్ అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది న్యూరాలింక్ సంస్థ. బ్రెయిన్ లో చిన్నపాటి చిప్ అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను కూడా రూపొందించింది ఈ సంస్థ. అయితే దీనికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్.డి.ఏ. అనుమతి అవసరం. ఇప్పటికే ఆ సంస్థతో చర్చలు జరిపిన ఎలాన్ మస్క్… అనుమతి తీసుకోడానికి అవసరమైన పత్రాలను రెడీ చేసే పనిలో పడ్డారు.
మెదడుతోపాటు శరీరంలోని ఇతర భాగాల్లో చిప్ లు అమర్చడంపైనా అధ్యయనం చేస్తోంది న్యూరాలింక్ సంస్థ. ఒక్కో వ్యక్తి శరీరంలో 10 చిప్ లు అమర్చే వీలుందుంటున్నారు న్యూరాలింక్ సంస్థ శాస్త్రవేత్తలు. ఈ చిప్ లు అనారోగ్యంతో ఉన్న మనుషులకు సహాయం చేస్తాయని చెప్పారు. పక్షవాతంతో బాధపడుతున్నవారికి చచ్చుబడిన కాళ్లు, చేతులు కదిలించడం ఈ చిప్ ల వల్ల సాధ్యమవుతుందంటున్నారు. ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇక కంటిచూపు లేనివారికి సహాచం చేసేందుకు మరో చిప్ ని రూపొందిస్తున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఎంతోమందికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. మెదడులో చిప్ లు అమర్చే విషయంలో ఇప్పటికే పందులు, కోతులపై ప్రయోగం చేసి విజయం సాధించారు. మరో ఆరు నెలల్లో మనిషిపై చేపట్టబోయే ప్రయోగంలోనూ విజయం సాధిస్తామని ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News