EPAPER

Zongshen ES5: ఎలక్ట్రిక్ హైబ్రిడ్ స్కూటర్.. 300 కిమీ రేంజ్.. నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

Zongshen ES5: ఎలక్ట్రిక్ హైబ్రిడ్ స్కూటర్.. 300 కిమీ రేంజ్.. నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

Zongshen ES5: చైనీస్ ఈవీల తయారీ సంస్థ Zongshen తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. Zongshen ES5 పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఇది కంపెనీ 300 కిలోమీటర్ల రేంజ్‌తో వచ్చిన  హైబ్రిడ్ స్కూటర్. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 60V 31Ah లిథియం బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ 70 కిలోమీటర్లు. ఇది హైబ్రిడ్ స్కూటర్ కాబట్టి, ఇది 100 కి.మీకి 1.5L ఫ్యూయల్ వినియోగిస్తుంది.


Zongshen ES5 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది సెన్లాన్ ఎలక్ట్రిక్ బ్రాండ్ క్రింద విడుదల చేసిన హైబ్రిడ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త జనరేషన్. దీని ఎలక్ట్రిక్ రేంజ్ 70 కిలోమీటర్లు. కంపెనీ దీనిని 1.5L ఇంధన ట్యాంక్ కూడా అందించింది. దీని ద్వారా స్కూటర్‌ను 300 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఇంధనంతో పాటు బ్యాటరీ పవర్ కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు.

Also Read: కొత్త బైకుల సందడి.. అదరగొడుతున్న లుక్.. లాంచ్ డేట్లు ఇవే!


1.5 లీటర్ల ఫ్యూయల్‌తో 100 కిలోమీటర్లు వెళుతుంది. అయితే ఇది పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా వస్తుంది. ఇందులో 60V 31Ah లిథియం బ్యాటరీ అందుబాటులో ఉంది. మూడు బ్యాటరీ సెటప్‌తో ఎలక్ట్రిక్ బైక్‌ను 180 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తోంది.దీని ప్రత్యేకత ఏమిటంటే డ్రైవింగ్‌లో కూడా దీన్ని ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా పార్క్ చేసినప్పుడు కూడా ఛార్జ్ చేయవచ్చు.

ఈ EV తక్కువ దూరాలకు విద్యుత్‌ని కూడా ఉపయోగించగలదు. ఎక్కువ దూరాలకు విద్యుత్ ఉత్పత్తి మోడ్‌లో కూడా నడుస్తుంది. సాధారణ ఛార్జ్ చేయడానికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో ఛార్జింగ్ స్టేషన్‌లో 2200W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటే, AC ఛార్జింగ్ స్టేషన్‌లో దీనిని 40 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. దీనికి C-REEV పవర్ మోడ్ అందుబాటులో ఉంటుంది. దీని కారణంగా ఇది నిరంతర పవర్ ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటుంది.

Also Read: బెస్ట్ 160 సీసీ బైకులు.. మైలేజీలో తిరుగులేదు!

C-REEV పవర్ మోడ్‌కు మరింత కన్వర్షియల్ బ్యాటరీ స్ట్రెక్చర్ అవసరం ఉంది. దీని రన్నింగ్ కాస్ట్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది కాకుండా ఇది గరిష్టంగా 1000W ఎక్స్‌టర్నల్ డస్చార్జ్ అందిస్తోంది. దీని సహాయంతో ఇది పెద్ద మొబైల్ విద్యుత్ సరఫరా మూలంగా ఉపయోగపడుతుంది. దీని లాంచ్ తేదిని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అలాగే ధర కూడా ప్రకటించలేదు.

Tags

Related News

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

×