EPAPER

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

Railway Employees Diwali Bonus| రైల్వే శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దీపావళి కానుకగా రైల్వే ఉద్యోగులందరికీ భారీ బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో కొన్ని పథకాలకు అనుమతి లభించింది. కేబినెట్ మీటింగ్ లో రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ గా రూ.2029 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే శాఖ పనితీరు లాభదాయకంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


రైల్వేశాఖలో పనిచేసే మొత్తం 11,72, 240 ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది. ఈ ప్రాడక్టవిటీ లింక్డ్ బోనస్ గా ఒక్కో ఉద్యోగికి 78 రోజుల వేతనం లభిస్తుంది. రైల్వే శాఖలోని వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ట్రాక్ మెనెటెయినర్స్, లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్స్(గార్డ్స్), సూపర్ వైజర్స్, స్టేషన్ మాస్టర్స్, టెక్నిషియన్స్, టెక్నిషియన్ హెల్పర్స్, పాయింట్స్ మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ ఎక్స్‌సి సిబ్బంది లాంటి పదవుల్లో ఉన్నవారందరికీ ఈ బోనస్ అందుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్టో అధికారిక ప్రకటన జారీ చేశారు.

Also Read:  ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..


”రైల్వే ఉద్యోగుల పనితీరు మెచ్చుకుంటూ ప్రాడక్టవిటీ లింక్డ్ బోనస్‌‌గా 78 రోజుల వేతనాన్ని కేంద్ర కేబినెట్ మంజూరు చేసింది. ఈ వేతం 11,72,240 మంది ఉద్యోగులకు లభిస్తుంది.” అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రాడక్టవిటీ లింక్డ్ రివార్డ్ స్కీమ్ లో మార్పులు చేసిన కేంద్ర కేబినెట్
రైల్వే ఉద్యోగులకు బోనస్ మంజూరు చేస్తూనే అదనంగా కేంద్ర కేబినెట్ ప్రాడక్టవిటీ లింక్డ్ రివార్డ్ (పిఎల్ఆర్) స్కీమ్ లో మార్పులు చేసింది. ఈ మార్పులు ప్రధాన సీ పోర్టులో పనిచేసే ఉద్యోగులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ రివార్డ్ స్కీమ్ లో 2020-21 సంవత్సరం నుంచి 2025-26 వరకు ఉద్యోగుల పనితీరుని పరిశీలించి వారికి బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా 20,704 ఉద్యోగులకు లాభం చేకూరుతుంది. పోర్ట్ ఆపరేషన్స్ లో మరింత వృద్ది సాధించేందుకు ప్రోత్సాహకంగా ఉద్యోగులకు రూ.200 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

దేశంలోని అన్ని సముద్ర పోర్టుల పనితీరుని ప్రతీ సంవత్సరం పరిశీలించి లాభదాయకంగా ఉన్న పోర్టులకు, మెరుగైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులకు ప్రోత్సాహకంగా బోనస్ లభిస్తుంది. భవిష్యత్తులో అన్ని పోర్టుల మధ్య ఇది పోటీతత్వం పెంపొందిస్తుందని కేబినెట్ తెలిపింది. పోర్టుల్లో పనిచేసే మొత్తం 20,704 ఉద్యోగులకు కనీసం నెల వేతనం రూ.7000 గా నిర్ధారించి దానిపై బోనస్ ఇవ్వబడుతుంది.

2023-2024 సంవత్సరానికి గాను రైల్వే శాఖ పనితీరు
కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం.. 2023-24 సంవత్సరానికి గాను రైల్వే శాఖ ఉద్యోగులు 1588 మిలియన్ టన్నుల కార్గో ని లోడ్ చేశారు. 6.7 బిలియన్ రైల్వే ప్రయాణికులకు సేవలు అందించారు. ఇది ఒక రికార్డ్ అని రైల్వే మంత్రి అన్నారు. రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో జరిగిన అభివృద్ధి, నూతన టెక్నాలజీ, రైల్వే ఉద్యోగుల నిబద్ధత, లాంటి ఎన్నో అంశాలు ఈ రికార్డ్ సాధించడంలో తొడ్పడ్డాయిన తెలిపారు.

ఇటీవల ఏడవ పే కమిషన్ ఆధారంగా ప్రాడక్టవిటీ లింక్డ్ బోనస్ ప్రకటించాలని దేశంలోని పలు రైల్వే యూనియన్లు డిమాండ్ చేస్తూ.. సోషల్ మీడియా కాంపెయిన్ ప్రారంభించాయి. ఇప్పటివరకే ప్రభుత్వం ఆరవ పే కమీషన్ ఆధారంగా ప్రభుత్వ బోనస్ ఇస్తోంది.

Related News

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

VIKAL Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

IRCTC Special Discounts: రైళ్లలో ఈ ప్రయాణీకులకు ఏకంగా 75 శాతానికి పైగా టికెట్ ధర తగ్గింపు, ఎందుకో తెలుసా?

IRCTC Tatkal Ticket Bookings: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే ఈజీగా టికెట్ కన్ఫామ్ కావడం ఖాయం!

Best Schemes for Girl Child: ఇంత పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం – ఆడ బిడ్డకు భవిష్యత్‌కు భరోసా ఈ ప్రభుత్వ పథకాలు

Big Stories

×