EPAPER

Cheapest Automatic Cars: బడ్జెట్ కార్లు.. అట్రాక్ట్ చేస్తున్న AMT ఫీచర్.. ధర వివరాలు ఇవే!

Cheapest Automatic Cars: బడ్జెట్ కార్లు.. అట్రాక్ట్ చేస్తున్న AMT ఫీచర్.. ధర వివరాలు ఇవే!

Cheapest Automatic Cars: ఆటోమొబైల్ మార్కెట్‌లో కొన్ని సంవత్సరాల క్రితం ఆటోమెటిక్ కార్ల ధరలు ఆకాశాన్ని అంటేవి. సామాన్లులకు అందుబాటులో ఉండేవి కాదు. కానీ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్ల ఎంట్రీతో ఈ సెగ్మెంట్ కార్లు బడ్జెట్ ధరలో కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఏఎమ్‌టీ టెక్నాలజీ బడ్జెట్‌లో లభిస్తుంది. క్లచ్, బ్రేక్ తరచూ యూజ్ చేయడం వల్ల పాదాలు దెబ్బతింటాయి. దీని కారణంగా ఏమ్‌టీని తీసుకొచ్చారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్‌లో చౌకైన బడ్జెట్‌లో ఉండే ఏఎమ్‌టీ కార్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.


Maruti K10 AMT
మారుతి సుజుకి ఆల్టో K10 ఒక ఫ్యామిలీ కారు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఆల్టో కె10 ధర రూ. 3.99 లక్షలు కాగా, దాని ఏఎమ్‌టి వేరియంట్ ధర రూ. 5.56 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు 25కిమీల మైలేజీని అందిస్తుంది. ఈ కారు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 2 స్టార్ రేటింగ్‌ను పొందింది. భద్రత కోసం కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ ఫెసిలిటీ ఉంది.

Also Read: Best Second Hand Electric Scooter: ఈవీల హవా.. సెకండ్ హ్యాండ్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్.. ఇలా కొనండి!


Maruti Suzuki S-PressoAMT
మారుతి సుజుకి మైక్రో SUV S-ప్రెస్సో మంచి ఆటోమేటిక్ కారు. ఈ కారులో మీకు మంచి స్పేస్ లభిస్తుంది. స్థానికంగా వెళ్లినా లేదా ఎక్కువ దూరం వెళ్లినా.. ఈ కారు చాలా కంఫర్ట్ ఇస్తోంది. ఇంజన్ గురించి మాట్లాడితే ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ ఆటోమేటిక్ (AGS) గేర్‌బాక్స్‌తో వస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు ఇది బెస్ట్ కారు. దీని ధర రూ.5.71 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

Renault Kwid AMT
రెనాల్ట్ క్విడ్ దాని సెగ్మెంట్లో అత్యంత స్టైలిష్ కారు. దీన్ని కస్టమర్లు చాలా ఇష్టపడతున్నారు. దీని డిజైన్ స్పోర్టీగా ఉంది. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. రెనాల్ట్ క్విడ్ ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ. 5.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.  ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ ఉంటుంది.

Maruti Suzuki Wagon R AMT
మారుతీ వ్యాగన్ఆర్ దేశంలో అత్యంత ఫుమస్ హ్యాచ్‌బ్యాక్ కారు. ప్రతి నెలా 15 వేలకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మాన్యువల్‌తో పాటు, AMT ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. అధిక ట్రాఫిక్‌లో ఈ కారును సులభంగా నడపవచ్చు. ఇంజన్ గురించి చెప్పాలంటే కారులో 1.0-లీటర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. కారులో 5-స్పీడ్ MT/ఆటోమేటిక్ గేర్‌బాక్స్  ఉంది. వ్యాగన్ఆర్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Tata Tiago AMT
ఆటోమేటిక్ కార్ల జాబితాలో టాటా టియాగో కూడా ఉంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 5-స్పీడ్ MT/ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో లభిస్తుంది. ఈ కారులో స్పేస్ బాగుంది. కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ ఉన్నాయి. దీని ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.94 లక్షలు.

Also Read: Flipkart GOAT Sale 2024: కొత్త సేల్ స్టార్ అయింది.. ఈ ఫోన్లపై ఫుల్ డిస్కౌంట్స్!

Maruti Celerio AMT
మారుతి సెలెరియో ఒక హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని AMT ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.28 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 242 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారులో 998 cc ఇంజన్ కలదు. ఇది 65.71 Bhp పవర్ రిలీజ్ చేస్తుంది. ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×