Big Stories

Mutual Funds : మార్కెట్లోకి వచ్చిన రెండు మ్యూచువల్ ఫండ్స్.. ఇన్వెస్ట్ చేయొచ్చా?

Mutual Funds

- Advertisement -

Mutual Funds : స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యే వారికి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. వీటిలో పెట్టుబడి పెడితే ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ మన తరపున రిస్క్ తీసుకుంటారు. ఎంతైనా అక్కడ ఉండేది ఆర్థిక నిపుణులు కాబట్టి నష్ట భయం తక్కువ. అలాగని.. కనిపించిన ప్రతి మ్యూచువల్ ఫండ్ మంచిదని చెప్పలేం. తెలిసిన వారి సలహాలు తీసుకున్నా, బాగా స్టడీ చేసిన తరువాతే ఇన్వెస్ట్‌మెంట్‌కు దిగాలి. ప్రస్తుతం మార్కెట్లోకి మరో రెండు మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. ఒకటి కొటక్ మహీంద్రా నుంచి, మరొకటి యూటీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి.

- Advertisement -

మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేయడంలో కోటక్‌ మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పెట్టుబడిదారులకు మినిమం రిటర్న్స్ అందించింది ఈ కంపెనీ. ప్రస్తుతం మార్కెట్ కండీషన్స్‌ని దృష్టిలో పెట్టుకుని కొటక్ మహీంద్రా.. నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఈ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్‌ను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓపెన్‌ ఎండ్‌ స్కీంగా వస్తున్న ఈ ఎన్ఎఫ్ఓ… మే 25న సబ్‌స్క్రిప్షన్‌ కోసం ఓపెన్‌ అయ్యింది. ఈ స్కీమ్ జూన్‌ 8న ముగుస్తుంది.

ఇక యూటీఐ కంపెనీ కూడా ఎస్ అండ్ పీ బీఎస్ఈ హౌసింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ స్టార్ట్ చేసింది. ఇదొక ఓపెన్‌ – ఎండ్‌ స్కీం.  ఎస్ అండ్ పీ బీఎస్ఈ హౌసింగ్‌ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ బేస్డ్‌గా పనిచేస్తుందిది. ఆల్రడీ.. మే 23నే ఈ ఫండ్‌ ఆఫర్‌ సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది. జూన్‌ 5వ తేదీన ఫండ్ ముగుస్తుంది. ఇందులో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ రూ.5వేలు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంద్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ ద్వారా అయితే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 500 రూపాయలు. ఈ స్కీమ్‌లో భాగంగా ఎస్ అండ్ పీ బీఎస్ఈ హౌసింగ్‌ ఇండెక్స్‌ పరిధిలోని సెక్యూరిటీలలో 95 నుంచి 100 శాతం వరకు, డెట్‌ లేదా మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో 5శాతం వరకు పెట్టుబడి పెడుతుంది.

ReplyForward
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News