EPAPER

Budget 2024-25| కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?

Budget 2024-25| కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?

Budget 2024-25: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2024-25 మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో 2024లో ఇంటెరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ లోక్ సభ ఎన్నికల దృష్ట్యా.. ఆ బడ్జెట్ పూర్తి స్థాయిలో లేదు. కానీ జూలై 23న కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రకటిస్తుంది. దేశంలో అదాయపన్ను చెల్లించే ప్రతీ వ్యక్తి ఈ బడ్జెట్‌లో తాను చెల్లించే ఆదాయపు పన్నులో ఏమైనా ఉపశమనం కలుగుతుందా? అని ఆశపడతాడు. ఇంటెరిమ్ బడ్జెట్ లో ఆదాయపు పన్ను విషయంలో పెద్దగా మార్పులు లేవు. కానీ ఈ బడ్జెట్ లో ఉండే అవకాశాలున్నాయి.


గత సంవత్సరమే ఆర్థిక మంత్రి సీతారామన్.. సంవత్సరానికి ఏడు లక్షలు ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నామని చెప్పారు. కానీ అది ఇంకా అమలు కాలేదు. అయితే దాంతో పాటే.. ఆమె బడ్జెట్ 2023 లో కొత్త టాక్స్ స్లాబ్ ప్రవేశ పెట్టారు. కానీ పాత టాక్స్ స్లాబ్ కూడా అమలు లో ఉంది. అదాయపు పన్ను చెల్లించే వ్యక్తికి ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పన్ను పాత టాక్స్ స్లాబ్ ప్రకారం లేదా కొత్త టాక్స్ స్లాబ్ ప్రకారం చెల్లించవచ్చు.

Also Read: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్.. వీటి మైలేజ్ అదుర్స్!


నిజానికి 2020లో కేంద్ర ప్రభుత్వం కొత్త టాక్స్ స్లాబ్ ప్రవేశ పెట్టింది.. కానీ దానిపై విమర్శులు రావడంతో.. గత సంవత్సరం అందులో మార్పులు చేశారు. ఇప్పుడు మొత్తం అయిదు టాక్స్ స్లాబ్ లున్నాయి. పైగా టాక్స్ చెల్లించే కనిష్ఠ లిమిట్ కూడా పెంచి.. మూడు లక్షలుగా చేశారు.

పాత ఇన్ కమ్ టాక్స్ స్లాబ్ వివరాలు (old tax regime):
(వార్షిక ఆదాయం — టాక్స్ పర్సెంట్)
2.5 లక్షల ఆదాయం ఉన్నవారు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు
2.5 నుంచి 5 లక్షల ఆదాయం ఉన్నవారు 5 శాతం టాక్స్ చెల్లించాలి
5 నుంచి 10 లక్షల ఆదాయం ఉన్నవారు 20 శాతం టాక్స్ చెల్లించాలి
10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు 30 శాతం టాక్స్ చెల్లించాలి

బడ్జెట్ 2023-24లో ప్రవేశ పెట్టిన కొత్త టాక్స్ స్లాబ్ ఇదే(New Tax Regime):
(వార్షిక ఆదాయం — టాక్స్ పర్సెంట్)
0 నుంచి 3 లక్షల ఆదాయం ఉన్నవారికి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
3 నుంచి 6 లక్షల ఆదాయం ఉన్నవారు 5 శాతం టాక్స్ చెల్లించాలి
6 నుంచి 9 లక్షల ఆదాయం ఉన్నవారు 10 శాతం టాక్స్ చెల్లించాలి
9 నుంచి 12 లక్షల ఆదాయం ఉన్నవారు 15 శాతం టాక్స్ చెల్లించాలి
12 నుంచి 15 లక్షల ఆదాయం ఉన్నవారు 20 శాతం టాక్స్ చెల్లించాలి
15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు 30 శాతం టాక్స్ చెల్లించాలి

ఈ కొత్త టాక్స్ స్లాబ్ లు 1961 ఇన్ కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 115-BAC ప్రకారం.. సరళీకృతమైన టాక్స్ విధానం, తక్కువ టాక్స్ రేట్ ఉన్నట్లు రూపొందించారు. ఇందులో సెక్షన్ 80 ప్రకారమే చాలావరకు రాయితీలున్నాయి.

ఈ రెండు టాక్స్ స్లాబ్ లు దేశంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ శాఖ అమలు పరుస్తోంది.

పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్ లో ఏది ఎంచుకోవాలి? అనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. దీనికి సమాధానం.. మీ మొత్తం వార్షిక ఆదాయాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మీ వార్షిక ఆదాయం, మీ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్, అందులో పొందే రాయితీలను పరిశీలించాకే మీకు ఏ టాక్స్ స్లాబ్ లాభదాయకంగా ఉంటుందో ఎంచుకోండి. ఉన్న రెండు టాక్స్ స్లాబ్స్ లో కొత్త టాక్స్ స్లాబ్ లో ఆదాయ పరిమితి పెంచారు కాబట్టి.. కొత్త టాక్స్ స్లాబ్ వైపు ఉద్యోగస్తులు మక్కువ చూపించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇతర ఆదాయ వనరులుంటే ఒక టాక్స్ కన్సల్టెంట్‌ని సంప్రదించడం మంచిది.

ఇప్పుడు కొత్త బడ్జెట్ లో ఆదాయ పన్నులో నుంచి 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి మినహాయింపు ఉండే అవకాశం ఉంది.

ప్రజలు నుంచి వచ్చే పన్నుల నుంచే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వస్తుంది. కానీ పన్ను వసూలు చేయడంతో పాటు ప్రభుత్వం.. పౌరులకు పన్ను నుంచి మినహాయింపులు పొందే నియమాలు కూడా విధించింది. ఆ నియమాలను పాటిస్తూ.. మీ విలువైన కష్టార్జితాన్ని పన్ను చెల్లింపుల్లో మినహాయింపు పొందండి. ఇన్ కమ్ టాక్స్ సెక్షన్ 80C ప్రకారం.. మీరు లక్షన్నర పెట్టుబడి పెడితే మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్ లో 50 వేలు ఇన్వెస్ట్ మెంట్ చేస్తే.. సెక్షన్ 80CCD ప్రకారం.. మీకు పన్ను ఆదాయపు పన్ను నుంచి మొత్తం 50 వేలు మినహాయింపు లభిస్తుంది. ఇలాంటి మరిన్ని సదుపాయాలను మీ టాక్స్ కన్సెల్టెంట్‌ని అడిగి తెలుసుకోండి.

 

 

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×