EPAPER

BMW CE 04 Launch Date: బిఎండబ్లూ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మామూలుగా లేవు.. మైలేజ్ ఎంతంటే..?

BMW CE 04 Launch Date: బిఎండబ్లూ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మామూలుగా లేవు.. మైలేజ్ ఎంతంటే..?

BMW Launching CE 04 Electric Bike on July 24: ప్రముఖ వాహన తయారీ సంస్థ BMW Motorrad ఇండియా దేశీయ మార్కెట్‌లో కొత్త కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు మరో వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. BMW CE 04 పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానుంది. ఇందులో భాగంగానే BMW Motorrad ఇండియా తన కొత్త స్కూటర్‌ కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.


ఇది జూలై 24న దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా అధికారికంగా భారత మార్కెట్లోకి రానుంది. ఈ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీ సామర్థ్యంతో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా మరింత డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని అంటున్నారు. ఈ సరికొత్త BMW CE 04 స్కూటర్ పట్ల ఆసక్తి ఉన్న కస్టమర్‌లు సమీపంలోని BMW Motorrad డీలర్‌షిప్‌ను సంప్రదించడం ద్వారా మరింత సమాచారం పొందగలుగుతారు.

Also Read: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్‌ లాంచ్.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు..!


BMW CE 04 ఇ-స్కూటర్‌లో లిక్విడ్ కూల్డ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను అమర్చారు. ఈ మోటార్ 19.72bhp కనిష్ట పవర్ రేటింగ్‌ను కలిగి ఉంది. కాగా ఈ స్కూటర్ 4,900rpm వద్ద 41.4 bhp గరిష్ట శక్తిని, అలాగే 1,500rpm వద్ద 61Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ EV గంటకు 120km గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ రోడ్, రైన్, ఎకో వంటి మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

కాగా ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 130 కిమీ మైలేజీని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని బ్యాటరీ ప్యాక్ 0% నుండి 100% వరకు పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటల 20 నిమిషాలు పడుతుంది. అలాగే 0% నుండి 80% వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. అయితే ఇది కాకుండా ఫాస్ట్ ఛార్జర్ డివైజ్‌తో 0% నుండి 100% వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 1.40 గంట సమయం పడుతుంది. అలాగే 0% నుండి 80% వరకు ఛార్జ్ చేయడానికి 1.05 గంటల సమయం పడుతుంది.

Also Read: Middle Class Budget Bikes: మిడిల్ క్లాస్ బైక్స్.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ.. ఇలాంటివే కదా మనకు కావాల్సింది..!

BMW CE 04 స్కూటర్ పూర్తి LED లైటింగ్, క్రీజ్‌లతో అందించబడింది. అలాగే BMW CE 04 10.25-అంగుళాల TFT కలర్ స్క్రీన్‌ను నావిగేషన్ అండ్ కనెక్టివిటీతో పాటు పెర్ఫార్మెన్స్ డేటా, రేంజ్, ఛార్జింగ్ టైమ్‌ను కలిగి ఉంటుంది. అదనపు ఫీచర్లలో ఎలక్ట్రానిక్ రివర్స్ ఫంక్షన్, ABS, ట్రాక్షన్ కంట్రోల్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. BMW CE 04 హార్డ్‌వేర్ వారీగా.. బాడీవర్క్‌కి దిగువన ఒక సింగిల్-సైడ్ స్వింగ్‌ఆర్మ్, వెనుకవైపు డైరెక్ట్ హింగ్డ్ సస్పెన్షన్ స్ట్రట్, ముందువైపు సింగిల్-బ్రిడ్జ్ టెలిస్కోపిక్ ఫోర్క్‌ని కలిగి ఉంటుంది. కాగా కంపెనీ CE 04తో పాటు BMW గ్రూప్ ఇండియా 5 సిరీస్ LWB, మినీ కూపర్ S, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ వాహనాలను జూలై 24న విడుదల చేయనుంది.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×