EPAPER
Kirrak Couples Episode 1

Bigg Boss: పోటీ లేదు.. టీఆర్పీ రేటింగ్ రాదు.. ఆ తప్పే రిపీట్ కానుందా..?

Bigg Boss: పోటీ లేదు.. టీఆర్పీ రేటింగ్ రాదు.. ఆ తప్పే రిపీట్ కానుందా..?

Bigg Boss.. బిగ్ బ్రదర్.. పాశ్చాత్య దేశానికి చెందిన ఈ రియాల్టీ గేమ్ షో ఇండియన్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అటు బాలీవుడ్ లో తొలిసారి బిగ్ బాస్ (Bigg Boss) పేరిట ప్రయోగం చేశారు. మొదటి ప్రయోగం తోనే భారీగా సక్సెస్ అవడంతో.. అన్ని భాషల ఇండస్ట్రీలు ఫాలో అవడం మొదలుపెట్టాయి. అలా తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో కూడా బిగ్ బాస్ గేమ్ షోలు ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్ చేస్తున్నాయని చెప్పవచ్చు. హిందీలో ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకోగా.. తెలుగులో కూడా 7 సీజన్లు పూర్తి చేసుకుంది ఈ షో.


ఎన్టీఆర్ హోస్ట్ గా సక్సెస్..

తెలుగులో 2017లో తొలిసారి తెలుగు బిగ్ బాస్ అంటూ తెరపైకి వచ్చిన ఈ రియాల్టీ షో కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) హోస్ట్ గా వ్యవహరించారు. దాదాపు అందులో భారీ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలే కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. ఈ సీజన్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు.. టిఆర్పి రేటింగ్ లో కూడా నెంబర్ వన్ గా నిలిచింది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన తొలి సీజన్ కి ఏకంగా 14.13 టీఆర్పి రేటింగ్ లభించింది. అయితే ఆ తరువాత రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సమయంలో 15.05 టిఆర్పి రేటింగ్ వచ్చింది కానీ హోస్ట్ గా ఎన్టీఆర్ రేంజ్ లో నాని హోస్ట్ గా సక్సెస్ అవ్వలేదు. దాంతో మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం మొదలుపెట్టారు.


బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఆ సీజన్ కే చెత్త రికార్డు..

బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అత్యంత చెత్త రేటింగ్ సొంతం చేసుకున్న సీజన్ ఏదైనా ఉంది అంటే అది ఆరవ సీజన్ మాత్రమే అని చెప్పాలి. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఆరవ సీజన్ కేవలం 8.17 టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుని అత్యంత చెత్త సీజన్ గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత సీజన్ 7 ఉల్టా ఫుల్టా అంటూ కొత్త మార్పులు తీసుకొచ్చారు. కనీ విని ఎరుగని రీతిలో కంటెస్టెంట్స్ తో భిన్న విభిన్నమైన టాస్కులు ఆడించి, ప్రేక్షకులలో ఆసక్తి పెంచేశారు. పైగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అందరిని అట్రాక్ట్ చేశాడు. దీనికి తోడు గత ఏడాది ఐపీఎల్, క్రికెట్ మ్యాచ్లతో పాటు సీరియల్ ఎఫెక్ట్ కూడా బాగా పడింది. అయినా సరే అన్నింటిని తట్టుకొని 21.7 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది అంటే ఈ సీజన్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

పోటీ లేకపోయినా.. సీజన్ సక్సెస్ అవ్వడం కష్టమే..

Bigg Boss: No competition.. No TRP rating.. Will that mistake be repeated..?
Bigg Boss: No competition.. No TRP rating.. Will that mistake be repeated..?

ఇక అదే రేంజిలో బిగ్ బాస్ సీజన్ 8 ను కూడా సక్సెస్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇన్ఫినిటీ అని లిమిట్ లెస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో రేటింగ్ రావట్లేదు. సాధారణంగా శనివారం, ఆదివారం ఎపిసోడ్లకు భారీగా టిఆర్పి రేటింగ్ వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఎపిసోడ్ కి ముందు వచ్చిన ప్రోమో వల్ల ఎపిసోడ్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఆడియన్స్. నాగార్జున ఫైర్ మోడ్ లో ఉంటాడని ప్రోమో చూపించిన తర్వాత అందరూ అనుకున్నారు. కానీ ప్రోమోలో చూపించినంత ఎపిసోడ్ లో అయితే ఏమీ లేదు. శనివారం ఎపిసోడ్ కి టిఆర్పి రేటింగ్ బాగా పెరుగుతుందని అనుకున్నారు. కానీ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. దీంతో బిగ్ బాస్ చూడాలన్న ఉత్సాహం కూడా తగ్గిపోయిందని చెప్పవచ్చు. పైగా గత సీజన్ లాగా ఐపీఎల్ లాంటి పోటీ లేదు.. సీరియల్ ఎఫెక్ట్ అంతకంటే లేదు. టిఆర్పీ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రేక్షకులు చాలా తెలివైన వారు. వారి అంచనాలను వీరు అందుకోవడంలో విఫలం అయ్యారని మరొకసారి నిరూపణ అయింది. ఏది ఏమైనా టిఆర్పి స్టంట్స్ చేయడం మానుకుంటే కచ్చితంగా సీజన్ సక్సెస్ అయ్యేదేమో.. మొత్తానికి అయితే ఈ సీజన్ కూడా బోల్తాపడేలా కనిపిస్తోందని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

iphone 16 Delivery in 10 minutes : పది నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే..

Electric Car Under Rs 5 Lakh: ఇండియాలో చీపెస్ట్ బ్యాటరీ కార్.. ధర రూ.5 లక్షల కంటే తక్కువే!

Big fat Indian weddings: ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్.. కేవలం రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్

India’s First Bullet Train BEML: గంటకు 250కిమి వేగంతో దూసుకోపోయే బుల్లెట్ ట్రైన్.. ఇండియాలో ఇదే ఫస్ట్!

Longest Train Services: దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏకబిగిన ఎన్ని వేల కిలో మీటర్లు ప్రయాణిస్తాయో తెలుసా?

Navyug Express Train: కాశ్మీర్ to కన్యాకుమారి- దేశంలో ఎక్కువ రాష్ట్రాలు దాటే రైలు ఇదే, ఎన్ని గంటలు జర్నీ చేస్తుందో తెలుసా?

Big Stories

×