EPAPER

Best Electric Scooters for working women: ఉద్యోగం చేసే మహిళలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్.. ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ..!

Best Electric Scooters for working women: ఉద్యోగం చేసే మహిళలకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్.. ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ..!

Best Electric Scooters for working women: ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వివిధ ఐటీ, టెక్ విభాగాల్లో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది మహిళలు రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు టూ వీలర్ వాహనాలే ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇంటి దగ్గర ఉంటూ తమ పిల్లల్ని స్కూల్‌కు డ్రాప్ చేయడానికి లేదా ఇతర పనుల కోసం ఎక్కువగా వీటినే ఉపయోగిస్తున్నారు. అందులోనూ పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీని కారణంగానే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగిపోయింది. మరి మీరు కూడా అత్యంత తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే స్కూటర్‌ను కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో బజాజ్ చేతక్ 2901, ఓలా S1X, హీరో విడా మోడళ్లను చూడవచ్చు.


Bajaj Chetak 2901: ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో బజాజ్ కంపెనీకి ఫుల్ డిమాండ్ ఉంది. అందులోనూ బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీని ధర కూడా తక్కువే. ఇది మార్కెట్‌లో కేవలం రూ. 95,998 ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఇందులో 2.88 KWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు.

దీనికి ఒకసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కి.మీ. ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లు అందించబడ్డాయి. ఇది కాకుండా అదనపు టెక్ ప్యాక్ సౌకర్యం కూడా ఇందులో అందుబాటులో ఉంది. అలాగే హిల్ హోల్డ్, కాల్, మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మి హోమ్ వంటి ఫీచర్‌లను పొందుతారు. ఇది రెడ్, సైబర్ వైట్, లైమ్ ఎల్లో కలర్స్‌ ఆప్షన్లలో లభిస్తుంది.


 Also Read: రూ.60 వేలకే హీరో బైక్.. 65 కిమీ మైలేజ్.. 11 రంగుల్లో కొనుగోలు చేయవచ్చు!

Ola S1 X+: Ola S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉంది. ఇది అనేక వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2 KWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీని ధర చాలా తక్కువ అని చెప్పాలి. కేవలం రూ.74,999 ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది. దీనికి ఫుల్‌గా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 91 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అలాగే ఈ మోడల్ కాకుండా కొత్త Ola S1 మోడల్ 3 kWh బ్యాటరీ వేరియంట్‌కు పూర్తిగా ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్లు నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఇది కాకుండా 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన Ola S1X మోడల్ రూ.97,499 ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది.

Hero Vida: హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇది రూ. 1.20 లక్షల నుండి రూ. 1.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధర మధ్య ఉంటుంది. ఇది V1 ప్లస్, V1 ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. V1 ప్లస్ మోడల్‌లో 3.44 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్లు నడుస్తుంది. అలాగే Vida V1 Pro వేరియంట్ 3.94 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జింగ్ పై 110 కిమీ మైలేజ్ ఇస్తుంది. రెండు మోడళ్ల గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఇది పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్‌లను అందిస్తుంది. ఈ స్కూటర్ రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఉత్తమమైనది.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×