EPAPER

Pulsar NS400 : పల్సర్ నుంచి NS400.. సీసీ చూస్తే వేరే లెవల్!

Pulsar NS400 : పల్సర్ నుంచి NS400.. సీసీ చూస్తే వేరే లెవల్!
Pulsar NS400
Pulsar NS400

Pulsar NS400 : బజాజ్ పల్సర్‌కు దేశంగా ఫుల్ డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో ఈ బైకులపై ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కంపెనీ కూడా కాలానికి అనుగుణంగా పల్సర్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. అధునాతన ఫీచర్లు, టెక్నాలజీని తీసుకొస్తుంది. పల్సర్ NS వేరియంట్లకు ఎక్కడలేని హైప్ ఉంది. అయితే పల్సర్ NS400 గురించి గత కొన్నేళ్లుగా అనేక వార్తలు వస్తున్నాయి. కంపెనీ మొదటిసారిగా NS400ని భారతీయ మార్కెట్ ప్రవేశపెట్టనుంది. మే 3 ఈ బైక్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.


2024 బజాజ్ పల్సర్ NS400

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ పల్సర్ NS400ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంసబంధించిర కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది. దాని ప్రకారం.. ఈ బైక్ పెరిమీటర్ ఫ్రేమ్‌పై వస్తుంది. ఇందులో ముందు వైపున అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్ ఉంటుంది. అలానే వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్‌ను పొందుతుంది. బ్రేకింగ్ కోసం రెండు డిస్క్‌లు ఉంటాయి.  బ్రేకింగ్, పవర్ ‌ఫుల్ సస్పెన్షన్ హార్డ్‌వేర్ పల్సర్ N250 పల్సర్ NS400తో షేర్ చేయబడుతుందని తెలిపింది.


Also Read : కిర్రాక్ లుక్‌తో స్టైలిష్ ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ N250 కొత్త వెర్షన్!

NS400 ఫీచర్లు

ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను నియంత్రించడానికి కొత్త స్విచ్ గేర్ అందుబాటులో ఉంటుంది. ఇది కొత్త పల్సర్‌తో కూడా భాగస్వామ్యం చేయబడుతుంది.  ఇది బజాజ్ రైడ్ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చే సరికొత్త డిజిటల్ యూనిట్. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ నోటిఫికేషన్‌లను, కాల్ మేనేజ్‌మెంట్‌ను కూడా చూపిస్తుంది.

Also Read : రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ చూస్తే రచ్చే!

ఇంజిన్

ప్రస్తుతానికి రాబోయే NS400 కోసం బజాజ్ ఏ ఇంజన్ ఉపయోగిస్తుందో సంస్థ ధృవీకరించలేదు. ఇది డొమినార్ 400కి శక్తినిచ్చే 373 సిసి ఇంజిన్ యూనిట్‌ను కలిగి ఉండొచ్చు. అంతేకాకుండా దీని ముందు వెర్షన్ 390 డ్యూక్ నుండి వచ్చే అవకాశం ఉంది. అదనంగా బజాజ్ బ్రాండ్ కొత్త  390 డ్యూక్‌ ఉన్న 399 cc ఇంజిన్‌ను తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×