EPAPER

Gold Rates : పెళ్ళిళ్ల సీజన్ మొదలైంది.. మరి బంగారం ధరల మాటేంటి ?

Gold Rates : పెళ్ళిళ్ల సీజన్ మొదలైంది.. మరి బంగారం ధరల మాటేంటి ?

Gold Rates in Hyderabad Today : శ్రావణమాసం వచ్చిందంటే.. పెళ్ళిళ్ల సీజన్ మొదలైనట్లే. ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. కొన్నివేల జంటలు ఒక్కటవుతాయి. మరి పెళ్లి అంటే.. ఆషామాషీ కాదు కదా. చాలా పనులుంటాయి. చాలా షాపింగ్ చేయాలి. అందులోనూ.. పెండ్లికొడుకు, పెండ్లి కూతురితో పాటు.. తోబుట్టువులు, చుట్టాలంతా బంగారం కొనాలి. బోలెడు ఖర్చు ఉంది. పెళ్ళిళ్లు మాత్రమే కాదు.. వరలక్ష్మీ వ్రతానికి కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తారు.


ప్రతిసంవత్సరం పెళ్ళిళ్ల సీజన్ మొదలయ్యే సరికి బంగారం ధరలు పెరుగుతాయి. అందుకే ధరలు తగ్గినప్పుడే బంగారం కొని దాచుకుంటారు. కానీ ఈసారి కాస్త సీన్ రివర్స్ అయినట్లే కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర పై రూ.400 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.440 తగ్గింది. నిన్న ఏకంగా రూ.800 నుంచి రూ.870 వరకూ తగ్గింది. బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం.

ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.69,270 గా ఉంది.


Also Read : భలే మంచి చౌక బేరము.. గోల్డ్ ప్రియులకు కలిసొచ్చే కాలం

ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో.. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర ఆ రోజునే రూ.3000 పడిపోయింది. గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.

జులై 29న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.69,160 ఉంది. ఆ తర్వాతి రోజున రూ.200 తగ్గింది. మళ్లీ జులై 31న రూ.800 మేర పెరిగి 10 గ్రాముల ధర రూ.64,000కి .. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.69,820కి చేరింది. ఆగస్టు 1న రూ.500-రూ.540, ఆగస్టు 2న రూ.300-రూ.330 మేర పెరిగింది. ఆగస్టు 3న రూ.100 తగ్గి.. 10 గ్రాముల ధర రూ.64,700, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.70,690గా ఉంది.

ఆగస్టు 4,5 తేదీల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆగస్టు 6న రూ.800 నుంచి రూ.870 మేర ధర తగ్గింది. ఈ రోజు కూడా రూ.400 నుంచి రూ.440కి తగ్గడంతో 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.69,270కి దిగివచ్చింది. బంగారం కొనాలనుకునేవారికి ఇంతకన్నా మంచి సమయం ఉండదు. మగువలకు ఇదే మంచి ఛాన్స్.

Related News

SUVs Discount In September : వామ్మో వాయ్యో.. ఒకేసారి పది కార్లపై భారీ డిస్కౌంట్లు, రూ.3 లక్షలకు పైగా పొందొచ్చు!

Saving Schemes: అబ్బాయిలకూ పొదుపు పథకాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? ఇలా దాచిపెడితే డబ్బే డబ్బు

Pradhan Mantri Mudra Yojana: బిజినెస్ పెడుతున్నారా? ప్రభుత్వం లోన్ ఇస్తుందిగా.. ఇలా చేస్తే రూ.10 లక్షలు రుణం!

Monthly One Lakh Income Post Retirement: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..

Top 5 Fastest Trains In India: భారతదేశంలోని టాప్ 5 వేగవంతమైన రైళ్లు.. స్పీడ్‌లోనే కాదు, లగ్జరీలోనూ తోపే!

Train ticket booking: ప్రయాణికులకు అలర్ట్.. సంక్రాంతి పండక్కి 4 నెలల ముందే రైలు టికెట్ల బుకింగ్

Tatkal Confirm Ticket: తత్కాల్ రైలు టికెట్ బుక్ చేసుకోవడం సమస్యగా ఉందా?.. కన్‌ఫర్మ్ టికెట్స్ కోసం ఈ యాప్ ఉందిగా!..

Big Stories

×