Big Stories

Idli Vada ATM : ఏటిఎం ఇడ్లి.. నిమిషంలో 12 ఇడ్లీలు రెడీ..

Idli Vada ATM : టెక్నాలజీ పెరగడంతో అనేక రకాల ఏటీఎంలు మార్కెట్లోకి వచ్చాయి. కొత్తగా ఇడ్లి ఏటీఎంను బెంగళూరులో స్టార్ట్ చేశారు. 24 గంటలు పనిచేసే ఈ ఎటిఎం నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లిలను డ్రా చేసుకోవచ్చు. కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలను సప్లై చేస్తుంది ఈ ఇడ్లీ ఎటిఎం మెషిన్. శరన్ హీరేమత్, సురేష్ చంద్రశేఖర్ కలిసి ఈ ఇడ్లి ఏటీఎంను రూపొందించారు. వీరిద్దరికి చెందిన పేషంట్ రోబోటిక్ సంస్థ ఈ ఇడ్లీ ఏటీఎంను తయారు చేసింది.

- Advertisement -

ఇడ్లీ కావాలనుకున్నవారు మెచ్చిన దగ్గరికి వెళ్లి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయాలి. పేమెంట్ చేసిన తరువాత 55 సెకండ్లకు మీకు ఇడ్లీతో పాటు చెట్ని పార్సెల్ చేసి మెషిన్ మీకు అక్కడే పార్సెల్ డెలివరీ చేస్తుంది. వేడి వేడిగా, ఫ్రెష్ గా మీరు మీకు కావలసినన్ని ఇడ్లీలను తినవచ్చు.

- Advertisement -

తనకు ఎదురైనా చేదు అనుభవమే ఈ ఇడ్లి ఎటిఎం తయారు చేయడానికి కారణం అని చెప్పారు. 2016లో ఒక రోజు రాత్రి తన కూతురుకి అర్జెంటుగా ఇడ్లీ కావలసివచ్చినప్పుడు ఎక్కడ దొరకలేదని చెప్పారు. ఆటోమేటిక్ గా ఇడ్లీలు అందించే మెషిన్ ఉంటె ఇలాంటి సమస్య ఉండేది కాదని అనిపించి అప్పుడే దీన్ని తయారు చేయడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం బెంగళూరులో రెండు ఇడ్లీ ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాల్లో ఈ ఏటీఎంలను ప్రెవేశ పెట్టబోతున్నట్లు చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News