EPAPER

Best 160cc Bikes: బెస్ట్ 160 సీసీ బైకులు.. మైలేజీలో తిరుగులేదు!

Best 160cc Bikes: బెస్ట్ 160 సీసీ బైకులు.. మైలేజీలో తిరుగులేదు!

Best 160cc Bikes: దేశంలో కార్ల కంటే బైక్‌ల వినియోగమే అధికంగా ఉంటుంది. ప్రజలు కార్లు లేదా బైక్ కొనాలంటే దాని పవర్ కంటే మైలేజీకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మైలేజీ విషయంలో బైకులే ముందుంటాయి. మనం కొత్త బైక్, కారు కొనాలన్నా ముందుగా చూసేది దాని ధర, మైలేజీ. ఈ విభాగంలో మార్కెట్‌లో అనేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు  160cc సెగ్మెంట్‌లో పవర్, మైలేజీని అందించే టాప్ 3 బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.


Bajaj Pulsar N160
ఇందులో 164.82cc ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 16PS పవర్, 14.65Nm పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. టెస్టింగ్ సమయంలో ఈ బైక్ అధికంగా 51.6kmpl మైలేజీని అందించింది. ఇది సెగ్మెంట్‌లో అత్యుత్తమమైనది. అంటే 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌పై 720km కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉంటుంది.

Also Read: కొత్త బైకుల సందడి.. అదరగొడుతున్న లుక్.. లాంచ్ డేట్లు ఇవే!


ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది రైడ్ కనెక్ట్ యాప్‌తో బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. 2024 పల్సర్ ఎన్160 ధర రూ. 1,30,560 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. అందులో బ్లాక్, రెడ్, బ్లూ ఉన్నాయి.

Hero Xtreme 160R 4V
ఈ బైక్ స్టాండర్డ్, కనెక్టెడ్, ప్రో అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1,27,300, కనెక్ట్ చేయబడిన వేరియంట్ ధర రూ. 1,32,800,  ప్రో ధర రూ. 1,36,500 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). బైక్ ఇంజన్ 16.6bhp పవర్, 14.6Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. 163cc, 4-వాల్వ్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V సుమారుగా 45kmpl మైలేజీని అందిస్తోంది. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది.

హీరో మోటోకార్ప్ ఇటీవలే ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్‌ను అప్‌డేట్ చేసింది. దీంతో బైక్ లుక్‌లో చాలా మంచి మార్పులు వచ్చాయి. అలానే బైక్ మరింత పవర్ ఫుల్‌గా తయారైంది. అదే సమయంలో ఎక్స్‌ట్రీమ్ 160R 4V భారతదేశంలోని అత్యుత్తమ మైలేజ్ 160cc బైక్‌లలో ఒకటి.

TVS Apache RTR 160 4V
ఈ బైక్ లుక్ చాలా అట్రాక్ట్‌గా ఉంటుంది. దీనిలో కొత్త హెడ్‌లైట్‌ను చూడొచ్చు. కంపెనీ స్మార్ట్-కనెక్ట్ (SmartXonnect) వాహన టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా రెయిన్, అర్బన్, స్పోర్ట్ అనే 3 రైడ్ మోడ్ ఆప్షన్‌లు ఉన్నాయి. బైక్ 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ 157.9 cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 8,600 rpm వద్ద 15.42 bhp పవర్, 7,250 rpm మోడ్‌లలో 7,250 rpm వద్ద 14.14 Nm పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది.

Also Read: ఈవీల క్రేజ్.. హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. లాంచ్ ఎప్పుడంటే?

స్పోర్ట్స్ మోడ్‌లో ఈ కొత్త TVS Apache RTR 160 4V బైక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ 9,250 rpm వద్ద 17.3 bhp పవర్, 7250 rpm వద్ద 14.73 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉంది. ఇది 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Related News

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

×