Indian Railways: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వేస్, బోలెడు వింతలు, విశేషాలను కలిగి ఉంది. కొన్ని ప్రయాణాలు ప్యాసెంజర్లకు మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి అందాల నడుమ తీసుకెళ్తూ ఆహ్లాదాన్ని పంచుతాయి. మంచు పర్వతాలు మొదలుకొని ఎడారుల వరకు ఎన్నో అనుభూతులను కలిగిస్తాయి. ప్రయాణీలకు మర్చిపోలేని ఆహ్లాదాన్ని పంచే కొన్ని రైల్వే ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కల్కా-సిమ్లా రైల్వే
భారత్ లోని అత్యంత అందమైన రైల్వే ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్ లో క్వీన్ కల్క నుంచి సిమ్లా వరకు ఉన్న టాయ్ ట్రైన్ జర్నీ ఒకటి. ఈ మార్గంలో నడుస్తున్న రైళ్లు చిన్నతనంలో ఆడుకునే రైళ్లలా ఉంటాయి. 96 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రైలు మార్గం 1903లో ప్రారంభమైంది. మొత్తం 102 టన్నెల్స్, 82 బ్రిడ్జిల మీదుగా వెళ్తుంది. అంతేకాదు, 96 కి.మీ దూరాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ రైలుకు చోటు దక్కించుకుంది.
ఎర్నాకులం-త్రివేండ్రం
కేరళలోని కప్పిల్ లో కొబ్బరి తోటల మధ్య సాగే ఈ ప్రయాణం కనుల విందుగా ఉంటుంది. ఎర్నాకులం – కొల్లం – త్రివేండ్రం వరకు ప్రకృతి అందాల నడుమ కొనసాగే ఈ ప్రయాణం ప్రయాణీకుల జీవితాల్లో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. కనువిందు చేసే బ్యాక్ వాటర్స్ పక్క నుంచి వెళ్తూ, ఆహ్లాదాన్ని పంచుతుంది.
దూద్ సాగర్ జలపాతం
గోవాలోని దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ మీదుగా వెళ్లే రైలు ప్రయాణం ప్రయాణీకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. దూద్ సాగర్ జలపాతం సుమారు వెయ్యి అడుగుల మీది నుంచి కిందపడుతుంటే, దాని పక్క నుంచే రైలు వెళ్తుంది. జలపాతం నుంచి ఎగిరిపడే నీటి బిందువులు ప్రయాణీకులకు తాగుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
బనిహాల్- బద్ గాం
జమ్ము కశ్మీర్ లో బనిహాల్ నుంచి బద్ గాం వరకు కొనసాగే ఈ రైలు ప్రయాణం జీవితంలో మర్చిపోలేం. మంచు పర్వతాల గుండా కొనసాగే ఈ ప్రయాణాయం భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. బారాముల్లా-బానిహాల్ రూట్ లో ఎప్పుడూ మంచు కురుస్తూ ఉంటుంది. మంచులోదూసుకెళ్లే రైలు ప్రయాణీకులకు అద్భుతమైన ఆహ్లాదాన్ని అందిస్తుంది.
నీలగిరి మౌంటైన్ రైల్వే
భారతీయ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రైల్వే లైన్ నీలగిరి మౌంటైన్ రైల్వే. ఇది తమిళనాడులోని మెట్టుపాళ్యం నుంచి ఊటీ వరకు ఉంటుంది. నీలగిరి మౌంటైన్ రైల్వే 46 కిలో మీటర్ల మేర ప్రయాణిస్తుంది. 1908లో నిర్మించబడిన ఈ సింగిల్ ట్రాక్ రైలు నీలగిరి పర్వత శ్రేణిలో దాదాపు 16 టన్నెల్స్, 250 బ్రిడ్జిల మీదుగా వెళ్తుంది. 208 మలుపులతో అడవులు, ప్రకృతి రమణీయ నడుమ ఈ ప్రయాణం కొనసాగుతుంది.
కచ్-రాన్
భారత దేశంలోని అద్భుతమైన రైలు ప్రయాణాల్లో గుజరాత్‌లోని కచ్- రాన్ ప్రయాణం ఒకటి. తెల్లటి ఇసుక ఎడారి మీదుగా సాగే రైలు ప్రయాణం ప్రయాణీకులకు అద్భుతమైన ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గుజరాత్ నమో భారత్ ర్యాపిడ్ రైలు ఈ ప్రాంతం గుండా వెళ్తూ ప్రయాణీకులకు అద్భుత అనుభవాన్ని కలిగిస్తుంది.
Read Also: దేశంలో రైల్వే లైన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే.. కారణాలు ఏంటో తెలుసా?