EPAPER

2024 Yamaha FascinoS: యమహ మజాకా.. దొంగిలించారో దొరికిపోతారు.. అలాంటిలాంటి స్కూటర్ కాదిది..!

2024 Yamaha FascinoS: యమహ మజాకా.. దొంగిలించారో దొరికిపోతారు.. అలాంటిలాంటి స్కూటర్ కాదిది..!

2024 Yamaha Fascino S with Find My Scooter Function: యమహా మోటార్ 2024 తాజాగా తన మోడల్‌లోని ‘యమహా ఫాసినో S’ (Yamaha Fascino S) స్కూటర్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త ‘S’ వేరియంట్ మూడు కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అలాగే ప్రత్యేకమైన కొత్త ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది మ్యాట్ రెడ్, మ్యాట్ బ్లాక్, టాప్-ఎండ్ డ్యూయల్ టోన్ డార్క్ మ్యాట్ బ్లూతో విడుదలైంది. ఇందులో సరికొత్త ఫీచర్ ఏంటనే విషయానికొస్తే.. ఇది ఇప్పుడు ‘ఫైండ్ మై స్కూటర్’ ఫీచర్‌తో వస్తుంది. దీనిని ‘ఆన్సర్ బ్యాక్’ అని పిలుస్తారు.


మొబైల్‌లో ‘Yamaha Scooter Answer Back’ యాప్‌లోని బటన్‌ను నొక్కడం ద్వారా.. స్కూటర్ సైడ్ ఇండికేటర్‌లు, హారన్ దాదాపు రెండు సెకన్ల పాటు యాక్టివేట్ చేయబడుతుంది. దీని ద్వారా రద్దీగా ఉండే ప్రదేశాలలో కనుగొనడం సులభం చేస్తుంది. ఈ యాప్ Google Play Store, App Storeలో అందుబాటులో ఉంది. ఇది యమహా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఉపయోగించబడుతుంది. ఈ స్కూటర్ 125సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో 8.04 బిహెచ్‌పి, 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 5.2 లీటర్ల ఇంధన ట్యాంక్ కెపాసిటీ, 99 కిలోల కర్బ్ వెయిట్ కలిగి ఉంది.

Fascino 125 S.. 12, 10 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్‌పై నడుస్తుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్‌తో అమర్చబడి ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఇందులో బ్రేకింగ్ సిస్టమ్‌లో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. అత్యంత సరసమైన వేరియంట్‌లో రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో డ్రమ్ వేరియంట్ రూ.79,900, డిస్క్ వేరియంట్ రూ. 91,130గా ఉంది. 2024 Yamaha Fascino S.. సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125, హోండా యాక్టివా 125, TVS జూపిటర్ 125, హీరో డెస్టిని 125 నుండి పోటీని ఎదుర్కొంటుంది.


Also Read: చిన్న చిన్న ఉద్యోగస్తుల కోసమే ఈ ఛాన్స్.. రూ. 10,000 లకే కొత్త స్కూటర్‌ను కొనేయండిలా..?

దీని ధర విషయానికొస్తే.. మాట్ రెడ్, మ్యాట్ బ్లాక్ కలర్ వేరియంట్ రూ.93,730 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. మరోవైపు డార్క్ మాట్ బ్లూ ధర రూ.94,530 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం ఇది సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, TVS జూపిటర్ 125, యమహా రే ZR 125 మరియు హీరో డెస్టినీ 125 Xtec వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది.

Tags

Related News

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

Fact Check: మీ IRCTC ఐడీతో వేరే వాళ్లకు టికెట్స్ బుక్ చెయ్యొచ్చా? అసలు విషయం చెప్పిన రైల్వేశాఖ

Bengaluru Air Taxis: బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు, 5 నిమిషాల్లో గమ్యానికి, మరి హైదరాబాద్‌లో?

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Vande Bharat Sleeper Train: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

IRCTC Train Booking: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Big Stories

×