Big Stories

2000 NOTE: 2వేల నోట్లు-పాట్లు.. బ్యాంకులో వద్దు.. షాపులో ముద్దు!

2000 notes

2000 NOTE: క్యూ ఎందుకు దండగా.. ఖర్చు పెట్టేయి హాయిగా.. అన్నట్టుగా ఉంది ఇప్పుడు కొందరి పరిస్థితి. 2 వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకొని వెనక్కి ఇచ్చేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. దీంతో ప్రజలంతా బ్యాంకుల వద్దకు క్యూ కడుతారనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. బ్యాంకుల వద్ద పడిగాపులు లేవు. కానీ దానికి భిన్నంగా తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను ఖర్చు పెట్టేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కార్డులు వాడేవారు.. ఇతర నోట్లను వాడేవారంతా.. ఇప్పుడు 2 వేల రూపాయల నోటును జేబులో నుంచి తీసి ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు వ్యాపారులు.

- Advertisement -

ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద 2 వేల రూపాయల నోట్లను ఉపయోగిస్తున్నారు ప్రజలు. మాములు కంటే 15 రేట్లు అధికంగా ఇప్పుడు పెట్రోల్ పంపుల వద్ద కరెన్సీని ఉపయోగిస్తున్నారుప్రజలు. ఇక కొందరు వస్త్ర వ్యాపారులు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. తమ షాపుల్లో 2 వేల నోట్లను ఉపయోగించుకొని షాపింగ్ చేయండంటూ ఆఫర్లు ఇస్తున్నారు.

- Advertisement -

ఇక రెస్టారెంట్లలో కూడా 2 వేల నోట్ల వినియోగం అధికంగా కనిపిస్తోంది. మాములుగా రెస్టారెంట్లలో కేవలం 10 శాతం మాత్రమే నగదు లావాదేవీలు జరిగేవని.. ప్రస్తుతం 20 శాతానికి పైగా నగదు లావాదేవీలు జరుగుతున్నాయని.. అది కూడా ఎక్కువగా 2 వేల రూపాయల నోట్లే వస్తున్నాయని ముంబైకి చెందిన పలువురు రెస్టారెంట్ ఓనర్లు చెబుతున్నారు. ఆఖరికి మామిడిపండ్లను కొనడానికి కూడా ప్రజలు 2 వేల రూపాయలను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే అందరు వ్యాపారులు 2 వేల రూపాయల నోటును తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ నోట్లను మార్చుకోవడం తమకు ఇబ్బందవుతుందంటూ కొందరు వ్యాపారులు ఈ నోట్లను తీసుకునేందుకు తటపటాయిస్తున్నారు.

మొత్తానికి గతంలో బ్యాంకుల ముందు పడిగాపులు కాయకుండా.. తెలివిగా నోట్లను తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు ప్రజలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News