EPAPER

Vishnu Priya: విష్ణు ప్రియాను తప్పుగా అనుకున్నామే .. బిగ్ బాస్ విన్నర్ అవ్వడం పక్కా..

Vishnu Priya: విష్ణు ప్రియాను తప్పుగా అనుకున్నామే .. బిగ్ బాస్ విన్నర్ అవ్వడం పక్కా..

Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియా పేరు అందరికి తెలిసే ఉంటుంది. పోవే పోరా షో ద్వారా పరిచయం అయ్యింది . యాంకర్ గా పలు షోలలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ రావడంతో హీరోయిన్ గా సీరియల్ హీరో మానస్ తో కలిసి ఓ సినిమా చేసింది . ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అయితే అందుకోలేదు కానీ పాపకు మాత్రం మంచి క్రేజ్ అయితే వచ్చేసింది. అయితే ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. హౌస్ లో రచ్చ చేస్తుంది. సీరియల్ హీరో పృథ్వీ తో కలిసి లవ్ ట్రాక్ ను నడిపిస్తుంది. వీరిద్దరి ప్రేమాయణం హౌస్ లో హైలెట్ అవుతుంది.. ఇక విష్ణు ప్రియా గురించి ఓ వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఆమె చేసిన ఓ మంచి పనికి ఫ్యాన్స్ అవుతున్నారు. ఈ దెబ్బతో బిగ్ బాస్ విన్నర్ అవ్వడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు . అసలు విషయానికొస్తే..


ఇక ఈ సీజన్‌లో హౌస్ లోకి అడుగు పెట్టిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో స్టార్ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. ఇంకా నిజం చెప్పాలంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాక ముందు బిగ్ బాస్ హౌస్ లో బాగా తెలిసిన ఫేస్ ఎవరిదైనా ఉందంటే అది విష్ణు ప్రియనే. దీంతో సీజన్ ప్రారంభం నుంచే ఈ స్టార్ యాంకర్ కు బిగ్ బాస్ ఆడియెన్స్ మద్దతు బాగా లభిస్తోంది. అదుకు తగ్గట్టుగానే హౌస్ లో అదరగొడుతోంది విష్ణు ప్రియ. తన ఆట, మాట తీరు తో బుల్లితెర ఆడియెన్స్ను తనవైపు తిప్పుకుంది. తన అల్లరి తో నాగార్జునను కూడా ఇంప్రెస్ చేసింది.. ఇక బిగ్ బాస్ ఓటింగ్ లోనూ విష్ణు ప్రియ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. నామినేట్ అయిన ప్రతివారం విష్ణుప్రియనే ఓటింగ్ లో టాప్ గా నిలుస్తోంది. అంటే ఆమెకు బయట నుంచి కూడా బాగానే మద్దతు లభిస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా విష్ణు ప్రియకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరలవుతోంది. ఇందులో ఆమె స్కూల్ పిల్లలకు విద్య సామగ్రా పంపిణి చేస్తున్న వీడియో అది.. చిన్న పిల్లల తో సరదాగా ఆటలాడుకుంటూ, ముచ్చట్లు చెప్పింది.. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో ను చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు . పృథ్వీ వెనుక అల్లరి చేస్తూ ప్రేమ అని తిరుగుతుంటే అందరు తప్పుగా అనుకున్నారు. విష్ణు మనసు చాలా మంచిది అని ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఏడో వారం కొనసాగుతుంది. ఈ వారం తొమ్మిది మంది హౌస్ లో కొనసాగుతున్నారు. ఇక ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో చూడాలి..


Tags

Related News

Bigg Boss Today Promo 2: ‘బొచ్చు’తో ఛాలెంజ్ ఏంట్రా బాబు .. మెంటలెక్కిపోతున్న ఆడియన్స్..

Bigg Boss 8 Day 47 Promo 1: కుషన్ ఛాలెంజ్.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం..!

Puneet Superstar: ముఖానికి పేడ, నోట్లో మూత్రం.. ఇదేం పైత్యం గురూ, ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ వేషాలు చూశారా?

Bigg Boss 8 Telugu : బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ సోనియా పెళ్లి ఫిక్స్ .. ఎప్పుడంటే ?

Bigg Boss 8 Telugu: సీజన్‌లో మరో రెడ్ కార్డ్.. నాగ్ నుంచి మరో సంచలన నిర్ణయం.?

Bigg Boss 8 Telugu Promo: వేస్ట్ కంటెస్టెంట్స్.. పృథ్వి vs మణికంఠ

Big Stories

×