EPAPER

Barrelakka: బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న బర్రెలక్క

Barrelakka: బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న బర్రెలక్క

Telangana popular political leader Barrelakka will wildcard entry at Big boss 8 : తెలంగాణ రాజకీయాల చరిత్రలో ఆమె ఒక సంచలనం. సామాన్యురాలిగా వచ్చి రాజకీయ నాయకుల వెన్నులో వణుకుపుట్టించింది. ఆమే బర్రెలక్క..అసలు పేరు కర్నె శిరీష. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు గెలిచినంత పనిచేసింది. ఇంటిల్లిపాదీ కూలి పనులు చేసుకుంటే గానీ పూట గడవని పరిస్థితి. అలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ ఒక పక్క బర్రెలు కాచుకుంటూ మరో పక్క ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసింది. చదువుకున్నా ఉద్యోగాలు రాలేని ఆమె సోషల్ మీడియాలో ఒక రీల్ చేసింది. చదువుకున్నా ఉద్యోగాలు రాలేదని బాధపడకుండా తనలాగా బర్రెలు మేపుకొంటూ వాటి పాలు అమ్ముకుంటే రోజుకు రెండు నుంచి మూడొందలు సంపాదించుకోవచ్చని పోస్టు పెట్టింది. ఆ వీడియో పెను సంచలనంగా మారింది. చాలా మంది ఆమెను తమ యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా పాపులర్ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా శిరీషను తమ పార్టీలో చేరవలసిందిగా కోరారు. అయినా ఏ పార్టీ లోనూ చేరకుండా కొంత మంది మిత్రుల,మీడియా సహకారంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయింది. దీనితో తెలంగాణలో బర్రెలక్క పేరు కొంతకాలం పాటు మార్మోగిపోయింది.


బిగ్ బాస్ లో కీలక మార్పులు

రీసెంట్ గా బర్రెలక్క బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే సెప్టెంబర్ 1న ప్రారంభమైనా బిగ్ బాస్ కార్యక్రమంలో బర్రెలక్క పేరు ఎక్కడా వినబడలేదు. 14 మంది కంటెస్టెంట్లను మాత్రమే తీసుకున్నారు. ఇద్దరేసి జంటలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. కార్యక్రమానికి ప్రత్యేక గెస్టులుగా నాని, రాణా, నివేదా థామస్ వంటి నటులు వచ్చారు. తమ సినిమాలను ప్రొమోట్ చేసుకోవడంతో సహా కంటెస్టెంట్లను తమ గేమ్ తో ఆడించారు. మొత్తం ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలతో జంటలుగా ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈ బిగ్ బాస్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ కి లీడర్ అంటూ ఎవరూ ఉండరని నాగార్జున బాంబు పేల్చారు. అలాగే రేషన్ విషయంలో ఎవరు కష్టపడితేనే వారికి మాత్రమే రేషన్ లబించేలా మార్పులు చేశారు. అక్కడిదాకా బాగానే ఉంది.


వైల్డ్ కార్డ్ ఎంట్రీ

మొత్తం 20 మందిని తీసుకుంటారని అనుకుంటే కేవలం 14 మంది కంటెస్టెంట్లను మాత్రమే తీసుకున్నారు. అయితే మిగిలిన ఆరుగురుని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకుంటారని తెలుస్తోంది. ఇందులో తప్పకుండా బర్రెలక్క పేరు ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే రాజకీయ రంగం పుణ్యమా అంటూ బర్రెలక్క పేరు తెలంగాణ రాష్ట్రంలో మార్మోగిపోయింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చి బర్రెలక్క మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో బర్రెలక్కకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో బర్రెలక్కకు బెదిరింపులు కూడా వచ్చాయి. ఆమెపై భౌతిక దాడులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 8 తో బర్రెలక్కకు సరైన ప్లాట్ ఫాం దొరికినట్లే అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఈ దెబ్బతో రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశంలోనే బర్రెలక్కకు మరింత పేరు వస్తుందని అభిమానులు అంటున్నారు.

Tags

Related News

Bigg Boss Sonia : సోనియా లవర్ గురించి బయట పడ్డ నిజం.. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా?

Bigg Boss 8 Telugu Promo: మనిషి పుట్టుక పుట్టారా లేదా.. వారిపై అభయ్ సీరియస్, హౌస్‌మేట్స్ మధ్య మరోసారి గుడ్ల లొల్లి

Bigg Boss 8 Telugu: సిగ్గు.. సిగ్గు.. ఆ ముద్దులేంటీ? ఆ హగ్గులేంటీ? బిగ్ బాస్.. ఫ్యామిలీస్ చూస్తున్నారు

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియాతో ప్రేరణ ‘దోశ’ గొడవ.. మణికంఠ తలకు గాయం

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Bigg Boss 11 : కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కు ఫ్యూజులు ఔట్ అయ్యే రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లంటే?

Big Stories

×