EPAPER

Bigg BossSonia : రీ ఎంట్రీకి నో చెప్పిన సోనియా .. అదే కారణమా ?

Bigg BossSonia : రీ ఎంట్రీకి నో చెప్పిన సోనియా .. అదే కారణమా ?

Bigg BossSonia : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది. కొత్త వాళ్ళు వర్సెస్ పాతవాళ్ళు అని టాస్క్ ల పేరుతో కొట్టుకొని చేస్తున్నారు. ఏడో వారం టాస్క్ లు మరి దారుణంగా మారాయి . ఫిజికల్ టాస్క్ లలో ఇరు టీమ్ సభ్యులు కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. అయితే పాత వాళ్ళకు సపోర్ట్ తగ్గుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ ఒక రీ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది. అయితే హౌస్ లో స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల రీ ఎంట్రీ ఇవ్వబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కానీ ఇప్పుడు సోనియా పాప ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా కూడా అందుకు నో అని చెప్పిందట. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆ కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


బిగ్‌బాస్ హౌస్‌లోకి సోనియా రీఎంట్రీ పై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. మొన్నటివరకూ సోనియా రాక కన్ఫార్మ్ అంటూ చాలా వార్తలు వచ్చాయి. నిజానికి బిగ్‌బాస్ టీమ్ ఈ విషయంలో సోనియా సంప్రదించారు కూడా. అయితే సోనియా ఆలోచించడానికి కాస్త టైమ్ అడిగిందట. చివరికి రీఎంట్రీకి మాత్రం నో చెప్పినట్లు సమాచారం. దీంతో సోనియా ప్లేస్‌లో మరో కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో మొన్నటివరకు స్ట్రాంగ్ గా ఉన్న సీత లేదా అభినవ్ నవీన్ ను దింపబోతున్నట్లు తెలుస్తుంది. కానీ వీరిద్దరిని కాదని మరో పేరు వినిపిస్తుంది. గత సీజన్లో సీనియర్ గా శివాజీ ఎలా లీడ్ చేసాడో ఈ సీజన్ లో కూడా ఆదిత్య ఓం బాగానే ఆడారు .

సోనియా రీ ఎంట్రీకి నో అనడం తో ఆదిత్య ఓంను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి జరిగిన ఈ ఎలిమినేషన్‌లో మూడు రోజుల ఓటింగ్‌ను బేస్ చేసుకొన ఆదిత్యను పంపించేశాడు బిగ్‌బాస్. దీంతో ఈసారి ఆదిత్యకి మరో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకే సోనియా నో చెప్పడంతో వెంటనే ఆదిత్యను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఈ వారం క్లారిటీ రావాల్సి ఉంది. మెగా చీఫీ కంటెండర్‌షిప్ గెలుచుకునేందుకు ఇటు రాయల్ క్లాన్ అటు ఓజీ క్లాన్ చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైతే ఛార్జింగ్ టాస్కు ముగిసేసరికి బతికి ఉంటారో వాళ్లే మెగా చీఫ్ కంటెండర్లు అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఈ టాస్కులో ఇప్పటికే ముగిసిపోయింది. ఇందులో రాయల్ క్లాన్ గెలిచింది. అంటే ఓవర్ స్మార్ట్ ఫోన్స్ గెలిచారనన్నమాట. దీంతో వారి క్లాన్ నుంచే కొంతమంది మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా 9 మంది ఉన్నారు. అందులో నిఖిల్ , నబీల్ డేంజర్ జోన్లో ఉన్నారు ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాలి ..


Related News

Vishnu Priya: విష్ణు ప్రియాను తప్పుగా అనుకున్నామే .. బిగ్ బాస్ విన్నర్ అవ్వడం పక్కా..

Bigg Boss Today Promo 2: ‘బొచ్చు’తో ఛాలెంజ్ ఏంట్రా బాబు .. మెంటలెక్కిపోతున్న ఆడియన్స్..

Bigg Boss 8 Day 47 Promo 1: కుషన్ ఛాలెంజ్.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం..!

Puneet Superstar: ముఖానికి పేడ, నోట్లో మూత్రం.. ఇదేం పైత్యం గురూ, ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ వేషాలు చూశారా?

Bigg Boss 8 Telugu : బాయ్ ఫ్రెండ్ తో బిగ్ బాస్ సోనియా పెళ్లి ఫిక్స్ .. ఎప్పుడంటే ?

Bigg Boss 8 Telugu: సీజన్‌లో మరో రెడ్ కార్డ్.. నాగ్ నుంచి మరో సంచలన నిర్ణయం.?

Big Stories

×