EPAPER

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో రివర్స్ అయిన ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో రివర్స్ అయిన ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?

Bigg Boss 8 Telugu : తెలుగు బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్ షో గురించి ఎంత చెప్పిన తక్కువే. ఐదు వారాల ముందు ఈ షోలో ఏదో మిస్ అయ్యింది అని అందరు అనుకున్నారు. ఆదివారం ఎపిసోడ్ నుంచి హౌస్ లో రచ్చ మాములుగా లేదనే చెప్పాలి.. ఇది కదా ఆడియన్స్ కోరుకొనేది అని ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇచ్చిన హౌస్ మెట్స్ అందరు కూడా రచ్చ చేస్తున్నారు. పాత కంటెస్టెంట్స్ ఆట చూసి వచ్చారు కాబట్టి వారి దగ్గర పాయింట్స్ ఉన్నాయి. సో అలా వారికి కనిపించిన, అనిపించిన పాయింట్స్ తో నామినేషన్స్ వేశారు. ఈ క్రమంలో యష్మి, సీత, పృధ్వి, విష్ణు ప్రియలను నామినేట్ చేశారు. ఐతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చిన రాయల్ క్లాన్ కంటెస్టెంట్స్ నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చెయ్యాలని బిగ్ బాస్ కోరగా ఇద్దరినీ నామినేట్ చేశారు. ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న ఆ ఇద్దరు వీరే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా వారిలో ఇద్దరికి లీస్ట్ ఓటింగ్ ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఓటింగ్ లో లాస్ట్ ఉన్న ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు సీత మరొకరు పృధ్వి అని తెలుస్తుంది. పృధ్వి టాస్కులు బాగా ఆడుతున్నా ఎందుకో టాప్ రేంజ్ కి వెళ్లలేకపోతున్నాడు. ఆడియన్స్ ను కనెక్ట్ అవ్వడంలో అతను వెనకపడుతున్నాడు. ఇక కిరాక్ సీత కూడా డేంజర్ జోన్ లో ఉందని తెలుస్తుంది. చీఫ్ అయ్యాక ఆమె పెద్దగా ఆట ఆడింది లేదు. దాంతో ఈమెకు ఆడియన్స్ తక్కువ ఓటింగ్ వేసినట్లు తెలుస్తుంది. ఇక పోతే ఆరో వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే సీత, పృధ్విలలో పృధ్వి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి పృధ్వి ఎలిమినేట్ అయితే మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్లినట్టే అవుతుంది.. అటు మెహబూబ్, గంగవ్వ లు కూడా సేఫ్ జోన్ లో ఉంటుంది.

ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది. ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారన్నది చూడాలి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో బీబీ హోటల్ టాస్క్ కొనసాగుతుంది. రెండు టీమ్ ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ గొడవలే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. వైల్డ్ కార్డు ద్వారా ఇచ్చిన వారంతా బాగా రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారు. అందులో ముక్కు అవినాష్ కు ఎక్కువ.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వారానికి ఐదు లక్షలు తీసుకుంటున్నారు. అతను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంటర్టైన్మెంట్ చెయ్యడంలో అవినాష్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..


Related News

Bigg Boss: దొంగగా మారిన స్ట్రాంగ్ కంటెస్టెంట్.. కంటెస్టెంట్స్ మదిలో గుబులు..!

Bigg Boss 8 Telugu: రూటు మార్చిన పృథ్వి.. విష్ణుప్రియా వద్దు, ఆ పిల్లే ముద్దు!

Bigg Boss 8 Telugu: సీత దొంగతనం.. ఇంత సైలెంట్‌గా ఎలా చేసింది భయ్యా? మరి మెగా చీఫ్ ఏం చేస్తున్నాడో!

Bigg Boss Nayani Pavani : బిగ్ బాస్ నయని అసలు పేరు ఇదా.. ఎందుకు మార్చుకుందంటే?

Bigg Boss 8 Telugu Promo: వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా..? పాపం టెస్టీ తేజా..

Bigg Boss 8: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మిస్ ఫైర్.. ఇక ఎవరూ కాపాడలేరు..

Big Stories

×