EPAPER

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో మరో లవ్ ట్రాక్.. యష్మీ ఇంత మారపోయిందేంటి.. గౌతమ్ కు ఘోర అవమానం.. 

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో మరో లవ్ ట్రాక్.. యష్మీ ఇంత మారపోయిందేంటి.. గౌతమ్ కు ఘోర అవమానం.. 

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది అని ఆడియన్స్ జుట్లు పీకుంటున్నారు. బిగ్ బాస్ మొదట్లో ఎక్కువగా సోనియా, పృథ్వి, నిఖిల్ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత విష్ణు ప్రియా, పృథ్వి ల లవ్ ట్రాక్ గురించి వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడేమో యష్మీ లవ్ ట్రాక్ కొత్తగా బయటకు వచ్చింది. నిన్న ఎపిసోడ్ లో యష్మీ ఎలాంటి పెర్ఫామేన్స్ ఇచ్చారో అర్థం అవుతుంది. శుక్రవారం ఎపిసోడ్ హైలెట్ విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లో ప్రస్తుతం నిఖిల్-యష్మీ-గౌతమ్ మధ్య లవ్ ఎఫైర్ రోజుకో మలుపు తిరుగోతంది. ఒకరోజు నిఖిల్‌తో క్లోజ్‌గా ఉంటున్న యష్మీ మరోసారి గౌతమ్‌తో స్వీట్‌గా మాట్లాడతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా గౌతమ్ తో కటీఫ్ చెప్పేసింది. ఇక నిఖిల్ ప్రేమ కోసం పరితపిస్తుందని గత కొన్ని రోజులుగా అర్థం అవుతుంది. మొన్నటివరకు పృథ్వి, విష్ణు ప్రియా లవ్ ట్రాక్ బాగానే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది. కానీ కన్నడ బ్యాచ్ ఇచ్చిన క్లాస్ వల్ల పృథ్వి విష్ణు ప్రియకు బ్రేకప్ చెప్పేసాడు. దానికి విష్ణు ప్రియా మాత్రం ఎమోషనల్ అయ్యింది. ఇక యష్మీ మొన్న నిఖిల్ కు డైరెక్ట్ గా లవ్ ప్రపోజ్ చేసింది. ఇక నిఖిల్ కూడా ఓ కిస్ ఇచ్చి ఓకే చెప్పేశాడుగా అనుకున్నారు ఆడియన్స్. కానీ టుడే ఎపిసోడ్‌లో ఓవైపు యష్మీ ప్రేమగా మాట్లాడుతుంటే అస్సలు పట్టించుకోకుండా పోజులు కొట్టాడు నిఖిల్. దీంతో చిరాకు దొబ్బిన యష్మీ.. నిఖిల్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.

ఇక ఆ తర్వాత హౌస్ లో అన్నిటిని వినడానికి ప్రేరణ ఉంది కదా.. ప్రేరణకు తన గోడును చెప్పింది. మాములుగా యాక్ట్ చెయ్యలేదు. ఈమె చెప్పిన తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. దగ్గరికెళ్లి నిఖిల్‌ బాగోతం మొత్తం బయటటెట్టేసింది. ఇక అంతకుముందు గౌతమ్‌-యష్మీ మధ్య పెద్ద గొడవ జరిగింది. డాక్టర్ బాబు అయితే చల్ తన మీద మర్యాద మొత్తం పోయింది అంటూ దాదాపు యష్మీకి కటీఫ్ చెప్పేసినట్లే కనిపించాడు. మరి అసలు వీళ్లిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది.. యష్మీని నిఖిల్ ఎందుకు పట్టించుకోవట్లేదు. అసలు గౌతమ్ అంటే యశ్మీకి ఎందుకు అంత కోపం అని జనాలు మాట్లాడుకుంటున్నారు.


నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ పొడుపు కథల గురించి అడిగాడు. కొన్ని క్రేజీ కొశ్చన్స్ అడిగాడు. అయితే ఈ గేమ్‌లో ప్రేరణకి గౌతమ్‌కి మధ్యలో చిన్న డిస్కషన్ వచ్చింది. బజర్ ముందుగా గౌతమ్ నొక్కినా ఆన్సర్ మాత్రం ప్రేరణ చెప్పింది. దీంతో తప్పు ఆన్సర్ చెప్పిన గౌతమ్.. ప్రేరణ ఆన్సర్ వినేశాడు కాబట్టి మళ్లీ రెండోసారి ఆన్సర్ మార్చాడు.. దానికి ప్రేరణ గౌతమ్ పై సీరియస్ అవుతుంది. వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది.. ఇక గౌతమ్ అక్కడికి వచ్చి నయనికే సమాధానం చెప్పాడు. నయని.. డిఫరెన్స్ ఏంటంటే.. నేను అక్కడ రియలైజ్ అయి 2 మినిట్స్‌లో వెళ్లి ప్రేరణకి సారీ చెప్పి సాట్ ఔట్ చేసుకున్నా.. నా తప్పు తెలుసుకొని రియాక్ట్ అయ్యాను.. నిన్ను ఇక్కడ సారీ అడగలేదనా.. అంటూ యష్మీ అంది. ఏం అవసరం లేదులే మేడమ్.. అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి నువ్వు తప్పు చేశావని నా అభిప్రాయం..నేను మాత్రం అదే మాట మీద ఉంటాను.. నువ్వు సారీ వల్ల కామ్ డౌట్ అవుతావ్ అంటే ఐయామ్ సారీ అని యష్మీ అంటుంది. మొత్తానికి నిన్న ఎపిసోడ్ మొత్తం యష్మీ చుట్టే నడిచింది. ఇవాళ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

Related News

Bigg Boss 8 Telugu: గంగవ్వ సంచాలకురాలు ఏంటి బాసు.? టాస్కుల్లో కన్‌ఫ్యూజన్, అవకాశాన్ని వాడుకున్న హరితేజ

Bigg Boss 8 Telugu: సొంత టీమ్‌కు విష్ణుప్రియా వెన్నుపోటు.. పృథ్వి చెప్పిందే జరిగిందిగా!

Bigg Boss 8 Telugu Promo: ఓవరాక్షన్ చేయకు.. గౌతమ్, నిఖిల్ మధ్య గొడవ.. యష్మీ సపోర్ట్ ఎవరికి?

Bigg Boss 8 Telugu : ఇదేం కరువు రా బాబు.. పృథ్వికి విష్ణు ప్రియ స్ట్రాంగ్ వార్నింగ్..

BB Telugu 8 Diwali Special : దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఆకట్టుకున్న సమీరా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

BB Telugu 8 Promo: బీబీ ఇంటికి దారేది.. కొత్త టాస్క్ తో మరో ఛాలెంజ్..!

Bigg Boss 8 Telugu: ఇవెక్కడి నామినేషన్స్.. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా జరగడం మొదటిసారి!

×