నిజం చెప్పాలంటే ఆదివారం కన్నా.. శనివారం వచ్చే నాగ్ కోసమే అందరు ఈగర్ గా వెయిట్ చేస్తారు. కంటెస్టెంట్ తప్పు చేస్తే.. ఆరోజు రణరంగమే. ఈరోజు కూడా నాగ్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో కంటెస్టెంట్ దుమ్ము దులిపేశాడు. శనివారం, ఆదివారం వచ్చే ప్రోమోలు చాలా లేట్ గా వస్తాయని తెల్సిందే. ఇప్పటికే మొదటి ప్రోమోలో పృథ్వీని, నిఖిల్ ని, టేస్టీ తేజను ఆడేసుకున్నాడు. ఇక రెండో ప్రోమోలో మాత్రం ఒక షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
Kanguva Movie: ‘కంగువ’ కోసం దిశా పటాని రెమ్యూనరేషన్ అన్ని కొట్లా?
బిగ్ బాస్ స్టేజిపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మెరిశాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం కంగువ. నంబర్ 14 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. పాన్ ఇండియా సినిమా కావడంతో సూర్య.. అన్ని భాషలను కవర్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న బాలయ్య అన్ స్టాపబుల్ షోకు వెళ్లిన సూర్య.. ఈసారి నాగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ లో మెరిశాడు. సూర్యను సాదరంగా ఆహ్వానించిన నాగ్.. ఎందుకు సినిమాలు లేట్ అవుతున్నాయని ప్రశ్నించాడు. ఇప్పుడు ఒక పెద్ద చిత్రంతో వస్తున్నట్లు సూర్య తెలిపాడు.
ఇక సూర్యను చూసి కంటెస్టెంట్స్ ఆనందంతో ఎగిరి గంతేశారు. ఒక్కొక్కరిని నాగ్.. సూర్యకు పరిచయం చేస్తూ.. వారి గేమ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక విష్ణుప్రియను చూసి.. సూర్య శృతిహాసన్ లా ఉందని పొగిడినట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సూర్యను స్టేజిమీద కలవడానికి నయని పావని హౌస్ వదిలి వచ్చేస్తావా అని అడగ్గా.. ఆమె వచ్చేస్తాను అని చెప్పి షాక్ ఇచ్చింది. మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ లేదు అని చెప్పినా కూడా ఆమె సూర్యను కలవడమే ఇష్టమని చెప్పుకొచ్చింది.
Kiran Abbavaram: అది నిజమని నిరూపిస్తే.. సినిమాలు మానేస్తా.. కిరణ్ ఓపెన్ ఛాలెంజ్
ఈ లెక్కన నయనికి సూర్య అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. తన అభిమాన హీరోను కలవడానికి హౌస్ ను, డబ్బును వదిలేసి వస్తాను అని చెప్పడంతో సూర్య ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి నాగ్.. సూర్యను హౌస్ లోకి పంపిస్తాడా.. ? నయని కోరిక తీర్చడానికి.. ఆమెను స్టేజిమీదకు రప్పిస్తాడా.. ? అనేది చూడాలి.