EPAPER

Bigg Boss 8 Testy Teja : ఏంటి నిజమా.. టేస్టీ తేజాకు రెస్టారెంట్లు ఉన్నాయా? ఇదేం ట్విస్ట్ మామా..

Bigg Boss 8 Testy Teja : ఏంటి నిజమా.. టేస్టీ తేజాకు రెస్టారెంట్లు ఉన్నాయా? ఇదేం ట్విస్ట్ మామా..

Bigg Boss 8 Testy Teja : బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ఇప్పుడు రసవత్తరం మారుతుంది.. ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఆరోవారం కొత్త వాళ్ళతో హౌస్ మొత్తం కలర్ ఫుల్ గా మారింది. ముందుగా నాగార్జున చెప్పినట్లే వైల్డ్ కార్డు ద్వారా కొత్త వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా 8 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం ఎపిసోడ్ లో ‘రీ లోడ్’ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో టేస్టీ తేజా కూడా ఒకడు.. ఇతను సీజన్ 7 లో అందించిన ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. అదే అతనికి ప్లస్ అయ్యింది. టాస్కులు పెద్దగా ఆడకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే షో లో దాదాపు 8 వారాలు కొనసాగాడు.. కానీ అతని దురదృష్టం కారణంగా ఫ్యామిలీ వీక్ కి ముందు వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. టేస్టీ తేజా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయ్యాడని తెలుస్తుంది. ఇతను ఒకప్పుడు ఫుడ్ వీడియోలు చేసేవాడు. కానీ ఇప్పుడు రెస్టారెంట్లకు ఓనర్ అయ్యాడని టాక్. అతని ఆస్తుల గురించి అలాగే, అతను ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ షో టేస్టీ తేజా జీవితాన్ని మార్చేసింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక యూట్యూబర్ గా కేవలం సోషల్ మీడియా ఆడియన్స్ కి మాత్రమే పరిచయం ఉన్న టేస్టీ తేజా, ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో షో నుండి బయటకి వెళ్లిన తర్వాత బాబుకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి ఆశ్చర్యపోయాడు. అతని యూట్యూబ్ ఛానల్ కి రీచ్ పదింతలు పెరిగింది. పెద్ద హీరోలు సైతం తమ సినిమాలకు ప్రొమోషన్స్ కోసం టేస్టీ తేజా ని ఉపయోగించుకునేవారు. అలా బయటకి వచ్చిన తర్వాత లక్షలు సంపాదించాడు. ఒక్కసారిగా సెటిల్ అయిపోయాడు.. అతని జాతకాన్ని బిగ్ బాస్ పూర్తిగా మార్చివేశాడని ఇక్కడే తెలుస్తుంది..

బిగ్ బాస్ కు రాకముందు రెస్టారెంట్స్ కి వెళ్లి ఫుడ్ వీడియోలు చేసుకునే ఇతను , 15 కొత్త రెస్టారెంట్స్ ని ఓపెనింగ్స్ కి ముఖ్య అతిథిగా వెళ్లి రిబ్బన్స్ కత్తిరించే స్థాయికి వెళ్ళాడు. అంతే కాదు తన సొంత కష్టంతో సంపాదించిన డబ్బులతో తేజా ఒక టీ షాప్ ని ప్రారంభించాడు. అది గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఏకంగా 20 బ్రాంచులను ప్రారంభించి బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. స్టార్ మా, ఈటీవీ వంటి చానెల్స్ లో ఈయన పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా పాల్గొంటు సందడి చేసేవాడు.. ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయ్యే ముందు ఆయన స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ షో ‘కిరాక్ బాయ్స్.. కిలాడి లేడీస్’ లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అలా మంచి క్రేజ్ ని సంపాదించిన టేస్టీ తేజా ఇప్పుడు సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు, గేమ్స్ కూడా అదరగొడుతాను అని చెప్పి లోపలకు ఎంట్రీ ఇచ్చాడు.. ఈ సీజన్ లో పాల్గొనేందుకు టేస్టీ తేజకు ఒక వారానికి 4 లక్షల 50 వేల రూపాయిలు తీసుకొనున్నాడని సమాచారం.. ఇక హౌస్ లో తన ఆట తో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో… ఎన్ని రోజులు హౌస్ లో కొనసాగుతాడో చూడాలి..


Related News

Bigg Boss 8 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా? నామినేషన్స్ లో మరో రచ్చ..

Bigg Boss 18: ఆత్మహత్య చేసుకున్న తండ్రి, మరో పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన తల్లి.. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కథ చాలా ఎమోషనల్

Bigg Boss 8 Day 35 Promo 2: నామినేషన్ రచ్చ మొదలు.. హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్..!

Bigg Boss: బిగ్ బాస్ పై పిచ్చితో కెరీర్ ను ఇరకాటంలో పెట్టిన రోహిణి..!

Bigg Boss 8 Day 35 Promo 1: ఎంటర్టైన్మెంట్ కి లిమిటే లేదు.. హౌస్ లో రచ్చ మొదలెట్టిన వైల్డ్ కార్డ్స్..!

Bigg Boss: నామినేషన్ లోకి టాప్ కంటెస్టెంట్.. వైల్డ్ కార్డ్స్ పగబట్టారా..?

×