EPAPER

Bigg Boss mehaboob : మెహబూబ్ రేంజే వేరయా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Bigg Boss mehaboob : మెహబూబ్ రేంజే వేరయా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Bigg Boss mehaboob : బిగ్‌బాస్‌త తెలుగు 8వ సీజన్‌లో అన్ లిమిటెడ్.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నట్టుగానే ఇస్తున్నారు. ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఆసక్తి కరంగా మారుతుంది. గత ఆదివారం ఎపిసోడ్ లో 8 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్ లోకి వచ్చి రాగానే పాత కంటెస్టెంట్స్ కు దిమ్మ తిరిగేలా చేస్తున్నారు. ఇక రోజు రోజుకి బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లకు ఆడియన్స్ మతి పోతోంది. మొదట్లో హౌస్ మేట్ల గిల్లికజ్జాలు, అలకలు చూసి ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్‌గా అసహనం వచ్చింది. ఇక కాస్త మూడో వారం నుంచి ఈ గేమ్ లో కొత్తదనంతో పాటు, ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తున్నారు. ఈక్రమంలోనే ఆడియన్స్​ను ఎంటర్​టైన్​ చేసేందుకు బిగ్‌బాస్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలను భారీ ఎత్తున దింపారు. ఎప్పుడు లేని విధంగా ఎనిమిదిమందికి పైగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లో దిగారు. అది కూడా గతంలో హౌస్ లోకి వచ్చిన వాళ్లనే ను రంగంలోకి దింపుతున్నారు. అందులో మెహబూబ్ ఒకరు.


లిమిట్ లెస్ ట్విస్ట్ లతో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేస్తున్నాడు బిగ్ బాస్. ఈక్రమంలోనే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు దిల్ సే మెహబూబ్.. ఈయన సీజన్ 4 లో హౌస్లోకి కంటెస్టెంట్ గా వచ్చాడు.. దాదాపు చివరి వారం వరకు తన ఆట, పాటతో ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నాడు. అంతకు ముందు ఆ తర్వాత అన్నట్లు కేరీర్ మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత అతని జాతకం పూర్తిగా మారిపోయింది.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన మెహబూబ్ ఏం చేసేవాడో ఇప్పుడు తెలుసుకుందాం..

యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన మెహబూబ్.. దిల్ సె తో ఫేమస్ అయ్యాడు. జీవితంలో ఒక్కొమెట్టు ఎక్కుతూ.. బిగ్ బాస్ వరకూ వెళ్ళాడు ఇక బిగ్ బాస్ హౌస్ లో అగ్రెసీవ్ తన ఆటతీరుతో అందరిని భయపెట్టడంతో పాటు.. కొన్ని సందర్భాల్లో మంచి మనసు చాటుకుని ప్రేక్షకుల అభిమానాన్ని చూరగోన్నాడు. ఈక్రమంలో బిగ్ బాస్ టీమ్ మెహబూబ్ కు మరో అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చాడు మెహబూబ్. హౌస్ లోకి వచ్చీ రావడంతోనే నేను వారియర్ ను అంటున్నాడు. అంతే కాదు ఫ్రంట్ రోల్ లో నిలబడి ఫైట్ చేసే నబిల్ లాంటివారు తనకు ఇష్టం అన్నాడు మెహబూబు.. ఆ తరువాత మరిన్ని అవకాశాలు అందుకున్న ఈ కుర్రాడు.. కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఆల్భం సాంగ్స్ చేస్తున్నాడు సొంతంగా.. దాని కోసం భారీగా ఖర్చపెడుతున్నాడు కూడా. తాను అనుకున్నట్టుగా సొంత ఇల్లు కూడా కట్టుకుని జీవితంలో బాగా స్థిరపడ్డాడు మెహబూబ్.


ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో దిల్ సే మెహబూబ్ ఆటకు హౌస్ అదిరిపోబోతోంది. మరీ ముఖ్యంగా హౌస్ లో ఉన్న పృధ్వికి.. మెహబూబ్ కు ఎలాంటి బాండింగ్ ఏర్పడుతుందో చూడాలి. ఇద్దరి మధ్య వార్ ఉంటుందా.. లేక ఫ్రెండ్స్ అవుతారా అనేది చూడాలి. ఇక వైల్డ్ కార్డ్స్ వచ్చిన తరువాత హౌస్ లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయనేది ముందు ముందు ఎపిసోడ్ లలో చూడాలి.. ఏది ఏమైనా మెహబూబ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్.. హౌస్ లో ఎలా కొనసాగుతాడో చూడాలి మరి…

Related News

Bigg Boss 18 : బిగ్ బాస్ పై జాతీయ సంస్థ ఫైర్… ఆ కంటెస్టెంట్ ను బయటకు పంపాలంటూ డిమాండ్

Bigg Boss 8 Day 38 Promo 1: మైక్ విసిరేసిన గౌతమ్ కృష్ణ.. షాక్ లో కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Telugu : ఛీ.. ఛీ.. యష్మీ కొంచెం కూడా బుద్ది లేదా?

Bigg Boss 8 : హౌస్ లో ఎలిమినేషన్ స్కాం… నిజాన్ని బట్ట బయలు చేసిన సోనియా..

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు వరుడు కావలెను.. ప్రైజ్ మనీ విషయంలో బిగ్ బాస్ దిమ్మదిరిగే ట్విస్ట్

Shilpa Shirodkar: మహేశ్‌, నమ్రతతో విభేదాలు… అందుకే మహేష్ మరదలు నుంచి ఆ కామెంట్స్

Big Stories

×