EPAPER
Kirrak Couples Episode 1

Bigg Boss 8 Telugu : ఏంటి నిజమా.. బిగ్ బాస్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

Bigg Boss 8 Telugu : ఏంటి నిజమా.. బిగ్ బాస్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్.. ఈ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. మొదట బాలీవుడ్ లో ఈ షో మొదలైంది. ఆ షో ప్రజాదరణ పొందింది. ఇప్పటికి 17 సీజన్లను పూర్తి చేసుకుంది. 18 వ సీజన్ ప్రసారం అవుతుంది.. ఆ తర్వాత పాపులారిని సొంతం చేసుకున్న షో తెలుగు బిగ్ బాస్.. అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చింది మన తెలుగు బిగ్ బాస్ కి మాత్రమే. ఈ కాన్సెప్ట్ మనకి కొత్త కాబట్టి మొదటి సీజన్ సమయం లో ఆడియన్స్ కి పెద్దగా అర్థం కాలేదు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో హోస్ట్ గా చెయ్యడంతో ఆ షోను ఇంట్రెస్ట్ గా చూసారు. ఆ తర్వాత ఏదో అన్నట్లు జరుగుతుంది. ప్రస్తుతం 8 వ సీజన్ జరుగుతుంది. ఈ షోకు హోస్ట్ గా నాగార్జున వ్యవహారిస్తున్నారు.. అయితే ఈ షో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. అది ఈ షోకు పెట్టిన బడ్జెట్..


విషయానికొస్తే.. ప్రతీ సీజన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు బడ్జెట్ విషయం లో అసలు వెనకడుగు వేసేవారు కాదు. కానీ ఈ సీజన్ లో మాత్రం బడ్జెట్ విషయం లో చాలా లిమిటెడ్ గా పోతున్నారు. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి కంటెస్టెంట్స్ కు ఇస్తున్న రెమ్యూనరేషన్.. నిజానికి ఈ 8 వ సీజన్ కు మొత్తం బడ్జెట్ రూ. 75 కోట్లు అని ముందుగా అనుకున్నారట. ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. గత సీజన్ కోసం 125 కోట్ల రూపాయిల బడ్జెట్ ని కేటాయించారు. ఈ రియాలిటీ షో నడపడానికి వందల మంది పని చేస్తూ ఉంటారు. అందులోనూ ఒక పీసీఆర్ టీమ్ కు దాదాపు 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇక మిగితా టెక్నీషియన్స్ కు మరో 20 కోట్లవరకు ఉంటుంది.

ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున కు రూ. 15 నుండి 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తారట. ఇక హౌస్ లోపల కంటెస్టెంట్స్ కి అవసరమయ్యే ఆహారం, వాళ్ళ కోసం డిజైన్ చేసే టాస్కులు, వాటిని ఎడిటింగ్ చేసే టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కలిపి ఈ సీజన్ రూ. 75 కోట్లు అనుకున్నారని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు.. సీజన్ ముగిసే సమయానికి 400 కోట్ల రూపాయిలు టీవీ + డిజిటల్ టెలికాస్ట్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక నాలుగు వారాలకు గాను రూ. 120 కోట్లు రాబట్టిందని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 కంటే లాభాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి రాబోయే రోజుల్లో టాస్కులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ కు మాత్రం లాభాలు ఎక్కువగానే వస్తున్నాయి.. ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారో.. ఎంత గెలుచుకుంటారో చూడాలి..


Related News

Bigg Boss 8 Telugu : ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం అతడే ఎలిమినేట్ ..?

Bigg Boss 8 Telugu Promo: ఫ్రెండ్‌షిప్‌ను పక్కన పెట్టేసిన హౌస్‌మేట్స్, అంతా పక్కా కమర్షియల్

Bigg Boss 8 Day 31 Promo 2: చీఫ్ కోసం గొడవ.. కొట్టుకు చచ్చేలా ఉన్నారే..?

Big Tv Exclusive : బిగ్ బాస్ రీ లాంచ్ ఎపిసోడ్ కమింగ్… ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా…

Bigg Boss 8 Day 31 Promo1: కలర్ కలర్ విచ్ కలర్.. చిన్నపిల్లల ఆటలాడిస్తున్నారే..?

Bigg Boss 8 Telugu : ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Big Stories

×