EPAPER
Kirrak Couples Episode 1

Bigg Boss 8 Telugu : ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం అతడే ఎలిమినేట్ ..?

Bigg Boss 8 Telugu : ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం అతడే ఎలిమినేట్ ..?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇక ఈ వారం హౌస్ ను ఎవరు వీడనున్నారు అనేది హాట్ టాపిక్ అవుతుంది. బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం సాధారణ ఎలిమినేషన్‌తోపాటు మిడ్ వీక్‌లో కూడా ఎవిక్షన్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో చెప్పారు. ఈ వారం నామినేషన్స్లో నైనిక, నాగ మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, ఆదిత్య ఓం, నిఖిల్ ఆరుగురు ఉన్నారు. వీరిలో ఈ వారం మిడ్ వీక్‌లో ఒకరు, వీకెండ్‌లో మరొకరు ఎలిమినేట్ కానున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.


ఇక ఈ వారం హౌస్ మెట్స్ కు సంబందించిన ఓటింగ్ ప్రకారం చూస్తే.. నైనిక, ఆదిత్య ఓం తక్కువ ఓటింగ్ తో కొనసాగుతున్నారు. వీరిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు మిడ్ వీక్‌లో, మరొకరు వీకెండ్ ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అవుతారని టాక్ ఆల్రడీ నడుస్తుంది. ముందుగా నైనిక హౌస్ నుంచి బయటకు వెళ్తుంది. ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది మారినట్లు కనిపిస్తుంది. ముందుగా ఆదిత్య వెళ్లగా, ఆ తర్వాత శుక్రవారం నైనిక వెళ్ళబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఐదోవారం ఎలిమినేషన్ పై సస్పెన్స్ వీడిపోయింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని క్లారిటీ వచ్చింది. ఇక మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొందరు హౌస్ లోకి రాబోతున్నారని నాగార్జున కూడా చెప్పారు. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎప్పుడు దిగుతారో చూడాలి. ఆల్రెడీ ఈ సీజన్ లో అసలు గుర్తింపు లేని కంటెస్టెంట్స్ ని తీసుకువచ్చారనే విమర్శ ఉంది. మొత్తం సీరియల్ బ్యాచ్. అందులో అందరు కన్నడ బ్యాచ్ ఉన్నారు.. రీ లాంచ్ ఎపిసోడ్ కోసం జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ఆ ఎపిసోడ్ విషయంలో బిగ్ బాస్ ఏదైన ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి. ఇక ఓటింగ్ లో నబీల్, నిఖిల్ దూసుకుపోతున్నారు. నబీల్ ఆట తీరు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అతను ఇదే స్పీడులో ఆడితే విన్నర్ అతనే అవుతాడని జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఏమౌతుందో చూడాలి.. యష్మీ, సీత పోటి పడుతున్నారు. గత ఏడు సీజన్లలో ఒక్క లేడి కూడా విన్నర్ అవ్వలేదు. చివరికి బిగ్ బాస్ ఓటింగ్ మారి వీరిద్దరిలో ఒకరు విన్నర్ అవ్వొచ్చు అనే టాక్ నడుస్తుంది.. ఏదేమైనా బిగ్ బాస్ ఐదో వారం నుంచి రసవత్తరంగా మారింది.


Related News

Bigg Boss 8 Day 32 Promo 1: చీఫ్ కోసం మళ్ళీ ఫైట్.. ఆమె కల నెరవేరిందా..?

Bigg Boss 8 Telugu : ఏంటి నిజమా.. బిగ్ బాస్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

Bigg Boss 8 Telugu Promo: ఫ్రెండ్‌షిప్‌ను పక్కన పెట్టేసిన హౌస్‌మేట్స్, అంతా పక్కా కమర్షియల్

Bigg Boss 8 Day 31 Promo 2: చీఫ్ కోసం గొడవ.. కొట్టుకు చచ్చేలా ఉన్నారే..?

Big Tv Exclusive : బిగ్ బాస్ రీ లాంచ్ ఎపిసోడ్ కమింగ్… ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా…

Bigg Boss 8 Day 31 Promo1: కలర్ కలర్ విచ్ కలర్.. చిన్నపిల్లల ఆటలాడిస్తున్నారే..?

Big Stories

×