EPAPER

Bigg Boss: టైటిల్ ఫేవరెట్ గా నిలిచేది ఆ ముగ్గురే.. ఆడియన్స్ మాటేంటంటే..?

Bigg Boss: టైటిల్ ఫేవరెట్ గా నిలిచేది ఆ ముగ్గురే.. ఆడియన్స్ మాటేంటంటే..?

Bigg Boss.. బిగ్ బాస్ (Bigg Boss)తెలుగు సీజన్ 8 ప్రారంభమై నేటితో ఐదు వారాలు పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆడియన్స్ లో కంటెస్టెంట్ల పట్ల అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా టైటిల్ రేస్ లో ముగ్గురు కంటెస్టెంట్లు ఉన్నారని, ఆడియన్స్ వారు ముగ్గురే టాప్ 3 వస్తారని బల్లగుద్ది మరీ చెబుతూ అభిమానులకు ఆనందాన్ని కలుగజేస్తున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఫేవర్ గా నిలిచేది ఎవరు? టాప్ 3 లో ఉండేది ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


వైల్డ్ కార్డ్ ద్వారా 8 మంది ఎంట్రీ..

బిగ్ బాస్ సీజన్ 8.. 5 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అయింది. అందులో 6 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో బెజవాడ బేబక్క, రెండవ వారం శేఖర్ బాషా మూడోవారం అభయ్ నవీన్, నాలుగో వారం సోనియా, ఐదవ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం, ఐదవ వారం నైనిక ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 6 మంది సభ్యులు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ఇక ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఈవెంట్ 2.0 లో ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న మిగతా ఎనిమిది మంది కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవర్ గా నిలిచిన ముగ్గురు పేర్లు వైరల్ గా మారుతున్నాయి.


టైటిల్ ఫేవర్ గా నిలిచేది వారే..

ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నప్పటికీ వారిలో టైటిల్ కొట్టే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఐదు వారాల గేమ్ చూసి వచ్చారు. కాబట్టి ప్రేక్షకుల నుండి కూడా వీరికి పూర్తిగా మద్దతు లభించదు. ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ కి టైటిల్ దక్కడం ఇంతవరకు జరగలేదు. కాబట్టి మొదటి రోజు నుండి హౌస్ లో కష్టపడుతున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఐదు వారాలు ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ ను మెప్పించిన ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయానికొస్తే.. ఈ లిస్టులో మొదట నిఖిల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. సీరియల్ నటుడిగా అడుగుపెట్టిన నిఖిల్.. ఫస్ట్ నుండి తన గేమ్ బాగా ఆడుతూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పైగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా. అయితే సోనియా కారణంగా రెండు వారాలు ఆయన గేమ్ దెబ్బతిన్నా.. మళ్లీ తనను తాను మెరుగు పరుచుకునే ప్రయత్నాలు చేస్తూ టైటిల్ కొట్టే సత్తాను పొందే ప్రయత్నం చేస్తున్నారు.

టాప్ 3 లో విష్ణుప్రియ కూడా..

ఇక టాప్ 3 లో విష్ణుప్రియ ఉంటుంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బుల్లితెర ఆడియన్స్ లో భారీ ఫేమ్ ఉంది. అందులోనూ తెలుగమ్మాయి. మరోవైపు ప్రేరణతో గొడవలు ఈమెకు నెగిటివ్ ఇమేజ్ తీసుకొచ్చాయి. అలాగే గేమ్ పరంగా కూడా యావరేజ్ గానే ఉంది. పృథ్వీ రాజ్ శెట్టి తో లవ్ ట్రాక్ నడుపుతోంది. అయితే ఈ విషయంపై ఓపెన్ కాకపోయినా అతడి మీద విష్ణు ప్రియకు గురి ఉంది. అందుకే నామినేట్ అయిన ప్రతిసారి ఓటింగ్ లో టాప్ 3 లో ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. కాబట్టి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నబీల్ టైటిల్ కొట్టేనా..

ఇక మరొక పేరు నబీల్ సోషల్ మీడియా తో స్టార్ అయి అనూహ్యంగా దూసుకొస్తున్నాడు. అతడి గేమ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఓట్లు కూడా పెద్ద మొత్తంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఓటింగ్ లో నిఖిల్, విష్ణుప్రియ తో పోటీపడుతూ ఆకట్టుకుంటున్నాడు. చెప్పాలంటే ఒక సామాన్యుడైన ఈయన ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలతో పోటీ పడుతూ ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు నబీల్ టైటిల్ గెలిచినా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ముగ్గురిలో టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.

Related News

Bigg Boss 8 Day 35 Promo 1: వైల్డ్ కార్డు ఎంట్రీస్ తోనే కాదు సెలబ్రిటీస్ తో కూడా సందడి చేయనున్న నాగ్..!

Bigg Boss 8 Nainika: బిగ్ బాస్ నుంచి నైనిక అవుట్.. 5 వారాలకు అన్ని లక్షలు తీసుకుందా?

Aditya Om: మణికంఠ అసలు నువ్వు మనిషివేనా? ఆదిత్య ఓం ఆగ్రహం.. అదేంటి ఆమెను అంత మాట అనేశాడు?

Bigg Boss 8 Telugu: ఏడుపు ఆపవయ్యా.. మణికంఠకు నాగార్జున క్లాస్, అరె ఏంట్రా ఈ గోల!

Bigg Boss 8 Day 33 Promo 3: హగ్ అండ్ పంచ్.. కొత్త ఛాలెంజ్ తో గేమ్ షురూ..!

Bigg Boss 8 Telugu : అరె ఏంట్రా ఇది.. రియాలిటీ షోనా లేక లవర్స్ అడ్డానా.. మరో లవ్ స్టోరీ రీవిల్..

×