EPAPER

Bigg Boss 8 telugu : హమ్మయ్య.. మణికంఠ కోరికను తీర్చేసిన బిగ్ బాస్..

Bigg Boss 8 telugu : హమ్మయ్య.. మణికంఠ కోరికను తీర్చేసిన బిగ్ బాస్..

Bigg Boss 8 తెలుగు promo :బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షోలో బిగ్ బాస్ రోజుకో కన్ఫ్యుజన్ పెడుతున్నాడు.. గత వారం కొంత క్లారిటీ అనేది ఉండేది. కానీ ఈ వారం మాత్రం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నాడు. టాప్ 5లో ఉన్న వాళ్లకి ఇచ్చే సర్‌ప్రైజ్‌లన్నీ ఇప్పుడే ఇస్తున్నాడు బిగ్‌బాస్. నిజానికి కంటెస్టెంట్లకి ఇంటి దగ్గరి నుంచి వచ్చే స్పెషల్ వంటలు అలాంటివి సీజన్ చివరిలో ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఈ వారం ఇంటి ఫుడ్ ను మిస్ అవుతున్నారు అంటూ ఇంటిఫుడ్ ను హౌస్ లోకి తీసుకోని వచ్చాడు బిగ్ బాస్.. మణికంఠ భార్య నుంచి గిఫ్ట్ వచ్చింది. మొత్తానికి అతని కోరికను బిగ్ బాస్ తీర్చేశాడు. ఇక యష్మీ చేసిన పనికి అందరు షాక్ అయ్యారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఏముందో ఒకసారి చూసేద్దాం రండి..


హౌస్ లో అందరు రిలాక్స్ అవుతుంటే బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ తో అలెర్ట్ అవుతారు. అందరిని బాగా నిద్రొస్తుంది కదూ.. లాలి పాట ఏమైనా పాడమంటారా అంటూ బిగ్‌బాస్ సెటైర్లు వేశాడు. ఆ వెంటనే యష్మీని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మని పిలిచాడు బిగ్‌బాస్. ఇంట్లో మీకు నచ్చిన హౌస్ మెట్ ఎవరూ అని బిగ్‌బాస్ అడిగితే ప్రేరణ పేరు చెప్పకుండా నిఖిల్, పృథ్వి పేర్లు చెబుతుంది.. అది విన్న ప్రేరణ కాస్త ఫీల్ అవుతుంది. మనసులో తిట్టుకుంటుంది. అయితే బిగ్ బాస్ మీ ముందు ఉన్న క్లాత్ తియ్యండి అంటూ యష్మీ కి చెబుతాడు.. అది ఓపెన్ చేయగానే నిఖిల్‌కి వాళ్ల అమ్మ చేసి పంపిన చేతి వంట.. మణికంఠకి వాళ్ల వైఫ్ నుంచి ఇంటి వంట వచ్చాయంటూ బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు..

ఆ వార్త విన్న మణికంఠ ప్రియా ఇండియాకు వచ్చిందా అంటూ సంతోషంతో ముఖం వెలిగి పోతుంది.. ఈ ఫుడ్ ను ఒకరికి మాత్రమే ఇవ్వాలి అని అంటాడు బిగ్ బాస్ దానికి యష్మీ నిఖిల్ ఫుడ్ ను సెలెక్ట్ చేసుకుంటుంది. మణికంఠ ఎమోషనల్ అవుతాడు. యష్మీకి మణికంఠ అంటే ఇష్టం లేదు అన్న విషయం తెలిసే బిగ్ బాస్ ఇలా చేశాడా అని ఆడియన్స్ మణికంఠ పై సింపతీ చూపిస్తున్నారు. ప్లీజ్ యష్మీ.. అంటూ బుర్ర పట్టుకొని కూర్చున్నాడు మణి. అయినా కానీ నేను నిఖిల్‌కే ఇస్తా బిగ్‌బాస్ అంటూ యష్మీ అంది. దీంతో నాకు మెసేజ్ చాలా అవసరం యష్మీ అంటూ అరిచాడు మణికంఠ.. మణికంఠ గురించి ఏమి ఆలోచించవా అని అడిగితే అయినా కానీ యష్మీ.. నిఖిల్‌కి వచ్చిన ఫుడ్, మెసేజ్ తీసుకొని బయటికొచ్చింది.


ఇక మణి ప్రియా షో చూసి ఏమైనా అనుకుందా.. నాకోసం ఇండియకు వచ్చేసిందా.. అని మళ్లీ ఎమోషనల్ అవుతాడు. తర్వాత కాసేపటికి గార్డెన్ ఏరియాలోకి వచ్చి ప్రియా.. ఐ లవ్ యూ అంటూ అరిచాడు మణికంఠ.. అలా ఒక్కొక్కరికి ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ను అందిస్తాడు బిగ్ బాస్.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మణికంఠ ప్రియా గురించి ఎమోషనల్ అవ్వడం తో అందరు ఏడుస్తారని తెలుస్తుంది. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్ ను తీసుకొని హౌస్ మెట్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Bigg Boss 8 Day 33 Promo 2: కన్ఫెషన్ రూమ్.. ట్విస్ట్ తో చెమటలు పట్టించిన యష్మీ..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో 8 వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు.. మళ్లీ వీళ్లేనా?

Bigg Boss 8 Telugu : మెగా చీఫ్‌గా నబీల్ ..ప్రేరణ యష్మీ మధ్య ఫైట్.. అదే ట్విస్ట్..

Bigg Boss Sonia : నాగార్జున నన్ను మోసం చేశాడు .. బయటకొచ్చిన సోనియా రియాక్షన్..

Big TV Exclusive : బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదిత్య ఓం ఎలిమినేట్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే?

Bigg Boss 8 Telugu Promo: మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్ఫర్మ్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు

Big Stories

×