Bigg Boss 8Teugu : బిగ్ బాస్ సీజన్ 8 ఎనిమిదోవ వారం ఎలిమినేషన్ పై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. హౌస్ నుంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగాయి. అయితే ఈ వారం నయని పావని ఎలిమినేట్ అయిపోయిందటూ లీక్ వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు అందరూ నయని ఎలిమినేట్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు. కానీ చివరి నిమిషంలో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది నయని కాదు మెహబూబ్.. అసలు ఆ ట్విస్ట్ ఏంటో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బిగ్ బాస్ ఎనిమిదోవ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఓటింగ్ విషయంలో లీస్ట్ 2 మధ్య చాలా మైనర్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. దీంతో అందరూ నయని పావని ఎలిమినేట్ అయిపోయిందని ఫిక్స్ అయ్యారు. బయటికి వచ్చిన లీక్ కూడా ఇదే. కానీ బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. చివరి క్షణంలో నయనిని కాదని మెహబూబ్‌ను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇకపోతే ఈసారి ఓటింగ్‌లో ఉన్న వాళ్లలో టాప్ కంటెస్టెంట్లే ఎక్కువ ఉన్నారు. టాప్ అంటే ఓటింగ్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్లు. నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ ముగ్గురూ ఓటింగ్‌లో టాప్ లో కొనసాగుతున్నారు. నాగార్జున భరోసాతో పృథ్వి సేవ్ అవుతాడు. ఇక చివరగా మెహబూబ్, నయని కంటే కాస్త హెడ్జ్‌లో ఉన్నాడు. దాంతో సేవ్ అయిపోయాడు. కానీ మెహబూబ్-నయని ఇద్దరికీ దాదాపు ఇద్దరికీ సేమ్ ఓటింగ్ ఉండటం తో బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఈవారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడనే క్లారిటీ వచ్చింది. నిజానికి టాస్కుల విషయంలో మెహబూబ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఓటింగ్ పరంగా కూడా మంచి బేస్ ఉంది. కానీ మిగిలిన కంటెస్టెంట్లకి అంతకుమించి ఓటింగ్ రావడంతో అతను బయట రావాల్సి వచ్చింది. దీని పై నాగార్జున ఈ రోజు అనౌన్స్ చేయబోతున్నాడు. ఇక మొహబూబ్ హౌస్ లో ఉన్నంతవరకు బాగానే ఆడాడు. తన సత్తాను నిరూపించుకున్నాడు. అందుకే రెండు వారాలకు పైగా హౌస్ లో కొనసాగాడు. ఇక వైల్జ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ సీజన్‌లో అడుగుపెట్టిన మెహబూబ్ వచ్చిన వెంటనే మెగా చీఫ్ అయ్యాడు. టాస్కుల్లో కూడా తన బెస్ట్ ఇచ్చాడు. కానీ ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఇక మెహబూబ్‌ని ఈ వారం సొంత క్లాన్ మెంబర్స్ అయిన నయని, హరితేజ నామినేట్ చేయడం అతని మైనస్ అవ్వడంతో ఎలిమినేట్ అయ్యాడు.. ఇక ఈ వారం హౌస్ లో దీపావళి సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. దాంతో ఈరోజు సెలెబ్రేటీల సందడి ఎక్కువగా ఉంది. మరి ఎవరు హౌస్ లోకి వచ్చి సందడి చెయ్యనున్నారో ఈరోజు చూడాలి..