EPAPER

Bigg Boss 8 Telugu: యష్మీ చీప్ గేమ్, ఫ్రెండ్‌షిప్‌ను అడ్డం పెట్టుకొని మరీ అలా చేయాలా?

Bigg Boss 8 Telugu: యష్మీ చీప్ గేమ్, ఫ్రెండ్‌షిప్‌ను అడ్డం పెట్టుకొని మరీ అలా చేయాలా?

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంటర్ అయిన తర్వాత ఇది రెండో నామినేషన్స్. మొదటి నామినేషన్స్ అంతా మామూలుగా సాగిపోయినా రెండో నామినేషన్స్‌తో మాత్రం ప్రేక్షకులకు మంచి మజా వచ్చింది. రాయల్స్ వర్సెస్ ఓజీ టీమ్స్ నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అంతే కాకుండా ఈవారం మరొక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఎప్పుడూ ప్రేరణను తన ఫ్రెండ్ అంటూ సపోర్ట్ చేసే యష్మీ.. తనకు వ్యతిరేకంగా మారింది. అంతే కాకుండా ప్రేరణను నామినేట్ చేస్తాను అని అందరి ముందు ఛాలెంజ్ చేస్తాను. దీంతో యష్మీ చేసిన తప్పేంటో రాయల్స్ టీమ్ క్లియర్‌గా చెప్పింది.


ఆట మార్చింది

ముందుగా ప్రేరణను నామినేట్ చేస్తానని యష్మీ చెప్పిన తర్వాత మళ్లీ తనే ప్రేరణకు సపోర్ట్ చేస్తూ హ్యాట్ ఇవ్వడానికి ఫైట్ చేసింది. అందులో తన కాలికి గాయం కూడా అయ్యింది. గాయమయినా కూడా నిజం కోసం ఫైట్ చేస్తాను అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. అది టేస్టీ తేజకు నచ్చలేదు. నబీల్, టేస్టీ తేజ.. ఇద్దరికీ నామినేషన్స్ పాయింట్స్ వినిపించే అవకాశం వచ్చినప్పుడు నబీల్.. తేజ పేరు చెప్పగా తేజ మాత్రం యష్మీ పేరు చెప్పాడు. ఫ్రెండ్ అంటూ ప్రేరణను నామినేట్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు. అంతే కాకుండా ముందు నామినేట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చిన తనే.. ఇప్పుడు మళ్లీ మాట మార్చి సపోర్ట్ చేయడం తేడాగా ఉందని వ్యాఖ్యలు చేశాడు.


Also Read: బిగ్ బాస్ లోకి సోనియా రీ ఎంట్రీ.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు..

ఫ్రెండ్ కాదు

టేస్టీ తేజ మాత్రమే కాదు.. నయని పావని కూడా అలాగే ఫీల్ అయ్యింది. యష్మీనే తప్పు చేసిందని అందరికీ అర్థమయినా కూడా తను మాత్రం అందరిపై అరుస్తూ తన పాయింట్ నిజమని నిరూపించుకోవాలని అనుకుంది. కానీ హరితేజ మాత్రం చివరికి తన గాలి తీసేసింది. ఒక ఫ్రెండ్‌గా యష్మీ చేసింది తప్పు అని, బయట కూడా అలా ఎవరైనా ఉంటే తనకు అస్సలు నచ్చదని మొహం మీద చెప్పేసింది. అందరూ కలిసి కార్నర్ చేయడంతో అసలు ప్రేరణ నా బెస్ట్ ఫ్రెండే కాదని స్టేట్‌మెంట్ ఇచ్చింది యష్మీ. అయినా కూడా తేజ చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించడంతో యష్మీనే నామినేట్ చేసింది హరితేజ. ఆ తర్వాత ప్రేరణ వచ్చి యష్మీకి సపోర్ట్‌గా మాట్లాడింది. అప్పుడు తాను చేసింది తప్పు అని ఫీల్ అయిన హరితేజ.. యష్మీకి సారీ చెప్పింది.

తప్పించుకోలేకపోయిన తేజ

నామినేషన్స్ గురించి ప్రసారమయిన మొదటి ఎపిసోడ్‌లో టేస్టీ తేజను అందరూ కాపాడే ప్రయత్నం చేశారు. అది ఓజీ టీమ్‌కు అస్సలు నచ్చలేదు. అందుకే నిఖిల్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఓజీ టీమ్ నుండి ఎవరు వెళ్లినా తేజనే నామినేట్ అయ్యేలా స్కెచ్ వేశాడు. అది తేజకు కూడా అర్థమయ్యింది. కానీ తప్పించుకోలేకపోయాడు. విష్ణుప్రియా వచ్చి నయని పావని పేరు చెప్పగా నిఖిల్ వచ్చి తేజ పేరు చెప్పాడు. విష్ణుప్రియా చెప్పిన నామినేషన్స్ పాయింట్ కరెక్ట్ కాదని బిగ్ బాస్ సైతం హెచ్చరించాడు. దీంతో వేరే దారిలేక తేజనే నామినేట్ చేసింది హరితేజ. చివర్లో నయని పావనికంటే తేజనే తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనడంతో తేజ హర్ట్ అయ్యాడు.

Related News

Bigg Boss 8 Telugu Promo: మళ్లీ అదే గేమ్, అదే స్ట్రాటజీ.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నిఖిల్?

Bigg Boss 8: ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కాస్త కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా..!

Bigg Boss 8 Day 45 Promo 1: లేడీ కంటెస్టెంట్స్ కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన మణికంఠ.. ఏడిపించిన విష్ణు.. నవ్వించిన రోహిణి..!

Bigg Boss: మెగా చీఫ్ గా బిగ్ బాస్ మహారాణి.. నిఖిల్ వర్సెస్ గౌతమ్ టఫ్ ఫైట్ షురూ.!

Bigg Boss 8 Telugu: కంగారులో నిజం చెప్పేసిన అవినాష్, తిరిగి హరితేజకే వెన్నుపోటు.. కష్టమంతా వేస్ట్ అయిపోయిందే!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లోకి సోనియా రీ ఎంట్రీ.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు..

Big Stories

×