EPAPER

Bigg Boss 8 Telugu: కంగారులో నిజం చెప్పేసిన అవినాష్, తిరిగి హరితేజకే వెన్నుపోటు.. కష్టమంతా వేస్ట్ అయిపోయిందే!

Bigg Boss 8 Telugu: కంగారులో నిజం చెప్పేసిన అవినాష్, తిరిగి హరితేజకే వెన్నుపోటు.. కష్టమంతా వేస్ట్ అయిపోయిందే!

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8 మొదలయినప్పటి నుండి అందరి కంటెస్టెంట్స్ కంటే పృథ్వికే కోపం ఎక్కువ అని చాలామంది చెప్పారు. రెండు వారాల పాటు అదే కోపాన్ని మెయింటేయిన్ చేసిన పృథ్వి.. తర్వాత తన తప్పు తాను తెలుసుకున్నాడు. మారడానికి ప్రయత్నించాడు. కానీ తాజాగా జరిగిన నామినేషన్స్‌లో పాత పృథ్వి బయటపడ్డాడు. అవినాష్ గురించి నోటికొచ్చింది మాట్లాడాడు. ఇక ఈ విషయంలో అవినాష్ సైడ్ కూడా తప్పు ఉందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. చివరికి అవినాష్ నామినేట్ అయ్యాడు కానీ తన దగ్గర ఉన్న అస్త్రాన్ని ఉపయోగించి తన టీమ్‌మేట్‌ అయిన హరితేజకే వెన్నుపోటు పొడిచాడు. దీంతో హరితేజ కష్టమంతా వేస్ట్ అయిపోయింది.


పాయింట్ లేదు

ముందుగా నామినేషన్స్‌లో గౌతమ్, నబీల్‌కు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. గౌతమ్ వచ్చి నబీల్‌ను నామినేట్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. కానీ దానికి తగిన కారణం తన దగ్గర లేదు. దీంతో గతవారం జరిగిన బాల్స్ టాస్క్‌లో గౌతమ్ ఆడలేదని నబీల్ ఎత్తిచూపించాడని కారణం చెప్పాడు. అది కరెక్ట్ కాదని ఓజీ టీమ్ అంతా ఫీల్ అయ్యింది. మరోవైపు నయని పావని.. విష్ణుప్రియా పేరు చెప్పింది. బీబీ హోటల్ టాస్క్ సరిగా ఆడలేదని ఆరోపించింది. దానికి విష్ణుప్రియా ఒప్పుకోలేదు. మొత్తానికి గౌతమ్, నయని పావని.. ఇద్దరు చెప్పిన పాయింట్స్‌లో గౌతమ్ చెప్పిన పాయింట్ బెటర్ అనుకొని నబీల్‌ను నామినేట్ చేసింది ప్రేరణ. దానికి నబీల్ చాలా ఫీల్ అయ్యాడు.


Also Read: బిగ్ బాస్ లోకి సోనియా రీ ఎంట్రీ.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు..

రా అనొద్దు

అప్పుడే పృథ్వి, అవినాష్ మధ్య నామినేషన్స్ రచ్చ మొదలయ్యింది. అవినాష్ మొత్తం ఎపిసోడ్స్ చూడకుండా కేవలం ప్రోమోలు మాత్రమే చూసి తనను నామినేట్ చేశాడని స్టేట్‌మెంట్ ఇచ్చాడు పృథ్వి. అయితే తను వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉన్నానని, అందుకే తన భార్యను చూసి తనకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి వివరించమన్నానని నోరుజారాడు అవినాష్. అయితే తన భార్య చూసి బిగ్ బాస్ గురించి తనకు చెప్పడం కరెక్ట్ కాదని పృథ్వి అన్నాడు. అలా వారి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. అప్పుడే పృథ్వి నోరుజారి అవినాష్‌ను ‘రా’ అన్నాడు. దానికి అవినాష్‌కు కోపమొచ్చింది. ఇద్దరికి మాట మాట పెరగడంతో మిగతా కంటెస్టెంట్స్ వచ్చి వారిని ఆపారు. తన భార్య బిగ్ బాస్ చూసి తనకు చెప్పింది అనే పాయింట్ కరెక్ట్ కాదని అవినాష్‌ను నామినేట్ చేసింది హరితేజ.

అబద్ధం చెప్పావు

నామినేషన్స్‌లో తను ఉన్నాడని తెలియగానే తన దగ్గర ఉన్న షీల్డ్‌ను ఉపయోగించుకున్నాడు అవినాష్. దాంతో తను సేవ్ అయ్యి హరితేజను నామినేట్ చేశాడు. ‘‘వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన ఎవరూ బిగ్ బాస్ ఎపిసోడ్స్ మొత్తం చూడలేదు. నువ్వు కూడా అక్కడక్కడా మాత్రమే చూశానని చెప్పావు. కానీ ఇప్పుడు మొత్తం చూశానని అబద్ధం చెప్తున్నావు. నామినేషన్స్ సమయంలో కూడా నయని పావని సాయంతోనే హ్యాట్ తీసుకున్నావు. సొంతంగా ఆడలేదు’’ అంటూ హరితేజపై తనకు ఉన్న కోపాన్ని బయటపెట్టేశాడు అవినాష్. మొత్తానికి ఏడో వారం నామినేషన్స్‌లో గౌతమ్, పృథ్వి, నిఖిల్, మణికంఠ, యష్మీ, తేజ, నబీల్, హరితేజ, ప్రేరణ ఉన్నారు.

Related News

Bigg Boss 8 Telugu Promo: మళ్లీ అదే గేమ్, అదే స్ట్రాటజీ.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నిఖిల్?

Bigg Boss 8: ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కాస్త కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా..!

Bigg Boss 8 Day 45 Promo 1: లేడీ కంటెస్టెంట్స్ కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన మణికంఠ.. ఏడిపించిన విష్ణు.. నవ్వించిన రోహిణి..!

Bigg Boss: మెగా చీఫ్ గా బిగ్ బాస్ మహారాణి.. నిఖిల్ వర్సెస్ గౌతమ్ టఫ్ ఫైట్ షురూ.!

Bigg Boss 8 Telugu: యష్మీ చీప్ గేమ్, ఫ్రెండ్‌షిప్‌ను అడ్డం పెట్టుకొని మరీ అలా చేయాలా?

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లోకి సోనియా రీ ఎంట్రీ.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు..

Big Stories

×