EPAPER

Bigg Boss 8 Telugu: చీఫ్స్ స్థానాలను కాపాడుకోలేకపోయిన యష్మీ, నైనికా.. నిఖిల్‌తో పాటు అతడే కొత్త చీఫ్

Bigg Boss 8 Telugu: చీఫ్స్ స్థానాలను కాపాడుకోలేకపోయిన యష్మీ, నైనికా.. నిఖిల్‌తో పాటు అతడే కొత్త చీఫ్

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో కెప్టెన్స్ అనేవారు ఉండరు అని నాగార్జున ముందుగానే క్లారిటీ ఇచ్చారు. అందుకే హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ అంతా ఎంటర్ అయిన వెంటనే చీఫ్స్ అవ్వడం కోసం పోటీ మొదలయ్యింది. అలా ముందుగా నిఖిల్ చీఫ్ అయ్యాడు. ఆ తర్వాత నైనికా, యష్మీలు కూడా చీఫ్స్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత చీఫ్స్‌కు నచ్చిన కంటెస్టెంట్స్‌ను సెలక్ట్ చేసుకొని టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని వారిని ఆదేశించారు బిగ్ బాస్. అలా యష్మీ టీమ్‌లోకి నలుగురు, నైనికా టీమ్‌లోకి నలుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. కానీ అత్యధిక మంది టీమ్ సభ్యులను సంపాదించుకున్న నైనికా, యష్మీ.. తమ చీఫ్స్ స్థానాలను కాపాడుకోలేకపోయారు.


టాస్కుల్లో ఓడిపోయారు

యష్మీ.. చాలా తెలివిగా ఆలోచించి తన టీమ్‌లోని సభ్యులను ఎంపిక చేసుకొని బ్యాక్ టు బ్యాక్ టాస్కుల్లో విన్ అయ్యింది. దీంతో నిఖిల్ టీమ్‌లో ఉన్న సోనియాను కూడా తన టీమ్‌లోకి లాగేసుకుంది. నిఖిల్ టీమ్‌లోని బేబక్క కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడంతో నాగమణికంఠ మాత్రమే మిగిలాడు. నిఖిల్, మణికంఠ మాత్రమే కలిసి ప్రతీ టాస్కులో తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎంత ఆడినా కూడా వారమంతా తినకుండా ఉండాలని వారికి శిక్ష విధించారు బిగ్ బాస్. రేషన్ టాస్కులో ఓడిపోయినా కూడా ప్రైజ్ మనీ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆడి వారికి సాధ్యమైనంత ప్రైజ్ మనీని సంపాదించుకున్నారు. దీని ఎఫెక్ట్.. నైనికా, యష్మీలపై పడింది.


Also Read: యష్మీకి బుల్లితెర ప్రేక్షకుల శిక్ష.. ఇక సీరియల్స్ మానుకొని ఇంటికి వెళ్లక తప్పదా?

ప్రేక్షకులు హ్యాపీ

నైనికా, యష్మీలు చీఫ్‌లుగా ఉండడానికి అర్హులు కారని నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత హౌజ్‌కు కావాల్సిన చీఫ్ ఎవరో ఎంచుకునే అవకాశాన్ని మిగతా హౌజ్‌మేట్స్‌కు ఇచ్చారు. తరువాతి చీఫ్ ఎవరు అవుతారు అనే విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా యష్మీ చీఫ్ స్థానం నుండి తప్పుకోవడంతో చాలామంది ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. యష్మీ అండ్ టీమ్ కలిసి ఇతర చీఫ్స్‌ను, వారి హౌజ్‌మేట్స్‌ను పెట్టిన హింస చూసి ఆడియన్స్‌కు సైతం విసుగొచ్చింది. దీంతో యష్మీ చీఫ్ స్థానం నుండి తప్పుకోవడం మంచిదే అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఆపై హౌజ్‌లో తరువాతి చీఫ్ ఎవరు అవుతారు అనే ఉత్కంఠ మొదలయ్యింది.

తనకే ఎక్కువ సపోర్ట్

నిఖిల్‌తో పాటు హౌజ్‌ను చీఫ్‌గా శాసించడానికి మరొకరికి అవకాశం ఉందని, ఆ మరొకరిని ఎంచుకోమని హౌజ్‌మేట్స్‌కే అవకాశం ఇచ్చారు నాగార్జున. దీంతో ఎవరికి వారు ఎవరు చీఫ్ అయితే బాగుంటుందని చెప్పడం మొదలుపెట్టారు. నాగ మణికంఠ చీఫ్ అయితే బాగుంటుందని విష్ణుప్రియాతో పాటు నబీల్ కూడా అన్నాడు. కానీ మణికంఠ చీఫ్ కాకూడదని అభయ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇక అభయ్ చీఫ్ అయితే బాగుంటుందని సోనియా, పృథ్విరాజ్, ప్రేరణ సపోర్ట్ చేయడంతో నిఖిల్‌తో పాటు తను కూడా చీఫ్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు హౌజ్‌మేట్స్ బాధ్యత అంతా నిఖిల్‌తో పాటు అభయ్ చేతిలోకి వెళ్లిపోయింది.

Related News

Bigg Boss 11 : కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కు ఫ్యూజులు ఔట్ అయ్యే రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లంటే?

Shekar Basha: మా ఆవిడ అలా తిట్టింది, వచ్చేవారం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది తనే.. శేఖర్ భాషా వ్యాఖ్యలు

Bigg Boss 8 Telugu Promo: ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి ప్రభావతి.. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు, ఆదిత్య ఓం మెడ విరిచేసిన పృథ్వి

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఓటింగ్ లో విష్ణు ప్రియా టాప్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే?

Bigg Boss Telugu 8 : అరె ఏంట్రా ఇది.. ఎవరిని వదలవా.. నిన్న హాగ్, నేడు కిస్..

Bigg Boss 8 Telugu: మణికంఠను టార్గెట్ చేస్తున్న హౌజ్‌మేట్స్.. అప్పుడు యష్మీ, ఇప్పుడు ప్రేరణ.. ప్రశాంతంగా ఆడనివ్వరా?

Big Stories

×