EPAPER

Bigg Boss 8 Telugu: సొంత టీమ్‌కు విష్ణుప్రియా వెన్నుపోటు.. పృథ్వి చెప్పిందే జరిగిందిగా!

Bigg Boss 8 Telugu: సొంత టీమ్‌కు విష్ణుప్రియా వెన్నుపోటు.. పృథ్వి చెప్పిందే జరిగిందిగా!

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 మొదలయినప్పటి నుండి చీఫ్ అయ్యే విషయంలో అంతగా సీరియస్‌గా లేని కంటెస్టెంట్ ఎవరు అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు విష్ణుప్రియా. తనకు మొదట్లోనే చీఫ్ అయ్యే అవకాశం వచ్చినా తాను ఇప్పుడే ఆ పదివికి సిద్ధంగా లేనని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. కానీ గత కొన్ని వారాలుగా తాను కూడా చీఫ్ అయితే బాగుంటుందని ఆట మొదలుపెట్టింది. పలు కారణాల వల్ల అవ్వలేకపోయింది. తాజాగా జరిగిన మెగా చీఫ్ టాస్కులో తన టీమ్ మాత్రమే కాకుండా పక్కన టీమ్ సపోర్ట్‌తో కూడా మెగా చీఫ్ అయ్యింది విష్ణుప్రియా. కానీ చీఫ్ అయిన తర్వాత సొంత టీమ్‌కే వెన్నుపోటు పొడిచింది.


హర్ట్ అయ్యింది

తాజాగా జరిగిన నామినేషన్స్ అధికారాన్ని పూర్తిగా మెగా చీఫ్ విష్ణుప్రియా చేతిలో పెట్టారు బిగ్ బాస్. అదే సమయంలో తన టీమ్‌లో ఉన్నవారు ఎవ్వరినీ నామినేట్ చేయొద్దని విష్ణుకు గట్టిగా చెప్పాడు పృథ్వి. అయినా వినకుండా తను నబీల్‌ను నామినేట్ చేసింది. అది కూడా తన ఆట సరిగా లేదని నామినేట్ చేసింది. అసలు విష్ణుప్రియా మెగా చీఫ్ అవ్వడానికి కారణమే నబీల్, తనతో పాటు తన టీమ్. అది మర్చిపోయి నామినేట్ చేయడంతో పాటు టీమ్‌ను ఎదిరించి మాట్లాడింది. దీంతో అందరికీ తనపై కోపమొచ్చింది. పృథ్వి కూడా తనపై సీరియస్ అయ్యాడు. తను మెగా చీఫ్ అయ్యిందే టీమ్ వల్ల అని పదేపదే చెప్పారు. దానివల్ల హర్ట్ అయ్యి పక్కన టీమ్‌తో సావాసం మొదలుపెట్టింది విష్ణు.


Also Read: ఇదేం కరువు రా బాబు.. పృథ్వికి విష్ణు ప్రియ స్ట్రాంగ్ వార్నింగ్..

ఆపని విష్ణుప్రియా

మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు నబీల్‌ను ప్రేరణ ఇష్టం వచ్చినట్టు తిట్టిందని అయినా తనను అక్కగా చూస్తున్నాడని, ఒక్కసారి నామినేట్ చేయగానే తను తొక్క అయిపోయిందని వాపోయింది విష్ణుప్రియా. ఇక సందర్భాన్ని బట్టి మారే నబీల్ లాంటి మనస్తత్వం ఉన్న మనుషులకు దూరంగా ఉండడమే బెటర్ అని విష్ణుకు సలహా ఇచ్చింది హరితేజ. పృథ్వి కూడా తనకు వార్నింగ్ ఇచ్చాడని రాయల్స్‌తో చెప్పింది విష్ణు. తన టీమ్ నుండి ఎవ్వరు నామినేట్ అయినా ఇకపై చీఫ్‌గా తనకు సపోర్ట్ చేయనని స్టేట్‌మెంట్ ఇచ్చాడని వారితో షేర్ చేసుకుంది. ఇక విష్ణుప్రియాను నవ్వించడం కోసం ఓజీపై జోకులు వేశారు రాయల్స్. అవన్నీ నవ్వుతూ ఎంజాయ్ చేసింది విష్ణుప్రియా.

డేంజర్ జోన్

ఇప్పటివరకు బిగ్ బాస్ 8లో ఆట విషయంలో విష్ణుప్రియా, పృథ్విలకు పెద్దగా గొడవలు జరగలేదు. పృథ్వి మాటను విష్ణు ఎప్పుడూ కాదనలేదు. అలాంటిది తాజాగా జరిగిన నామినేషన్స్ వల్ల వారి మధ్య దూరం పెరిగింది. అంతే కాకుండా టీమ్‌కు, విష్ణుకు కూడా చాలా దూరం పెరిగింది. అందరూ నబీల్‌ను సపోర్ట్ చేయడంతో విష్ణుప్రియా వెళ్లి రాయల్స్ టీమ్ సరసన చేరింది. వాళ్లు వచ్చి మాట్లాడేవరకు నువ్వు కూడా మాట్లాడకు అంటూ విష్ణుకు రెచ్చగొట్టింది రోహిణి. ఓజీ టీమ్ ఏదైతే చెప్పిందో.. విష్ణుప్రియా సరిగ్గా అలాగే చేస్తుంది. అందుకే తను మెగా చీఫ్‌గా కరెక్ట్ కాదని ప్రేక్షకులు సైతం ఫీలవుతున్నారు.

Related News

Bigg Boss 8 Telugu: గంగవ్వ సంచాలకురాలు ఏంటి బాసు.? టాస్కుల్లో కన్‌ఫ్యూజన్, అవకాశాన్ని వాడుకున్న హరితేజ

Bigg Boss 8 Telugu Promo: ఓవరాక్షన్ చేయకు.. గౌతమ్, నిఖిల్ మధ్య గొడవ.. యష్మీ సపోర్ట్ ఎవరికి?

Bigg Boss 8 Telugu : ఇదేం కరువు రా బాబు.. పృథ్వికి విష్ణు ప్రియ స్ట్రాంగ్ వార్నింగ్..

BB Telugu 8 Diwali Special : దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఆకట్టుకున్న సమీరా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

BB Telugu 8 Promo: బీబీ ఇంటికి దారేది.. కొత్త టాస్క్ తో మరో ఛాలెంజ్..!

Bigg Boss 8 Telugu: ఇవెక్కడి నామినేషన్స్.. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా జరగడం మొదటిసారి!

×