Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో బీబీ ఇంటికి దారేది అని టాస్కులు మొదలయ్యాయి. ఈ టాస్కుల కోసం పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసి నాలుగు టీమ్స్ అయ్యారు. బ్లూ, గ్రీన్, యెల్లో, రెడ్ టీమ్స్‌గా విడిపోయి పోటీ మొదలుపెట్టారు. బ్లూ టీమ్‌లో ఉన్న నిఖిల్.. మిగతా కంటెస్టెంట్స్, ఫ్రెండ్‌షిప్స్ అన్నీ పక్కన పెట్టి ఆటపైనే దృష్టిపెట్టాడు. మెగా చీఫ్ రేసులో బ్లూ టీమ్ నిలిచేలా చేశాడు. ఫైనల్‌గా మెగా చీఫ్ అయ్యేది ఎవరు అనే విషయంలో అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యింది.
గౌతమ్‌కు అన్యాయం
మామూలుగా బిగ్ బాస్ 8 ప్రారంభం అయినప్పటి నుండి నిఖిల్, పృథ్వి ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్ గెలుస్తుంది అనే నమ్మకం కంటెస్టెంట్స్‌లో ఉండేది. కానీ ఈవారం జరిగిన బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో పృథ్వి జీరో అయిపోయాడు. నిఖిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క టాస్క్ కూడా ఓడిపోకూడదని పట్టుదలతో ఆడాడు. అయినా ఒక టాస్క్‌లో బ్లూ టీమ్ ఓడిపోయింది. అప్పటి నుండి వారు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తానికి చివరి టాస్క్‌లో గెలిచి బ్లూ టీమ్ గెలిచింది. అందరూ మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు. ఇదే సమయంలో యెల్లో, గ్రీన్ టీమ్స్‌కు అన్యాయం జరిగింది. ముఖ్యంగా గౌతమ్‌కు అన్యాయం జరిగింది.
Also Read: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే.. ఊహించని ఎలిమినేషన్..!
యష్మీ ప్లాన్
బీబీ ఇంటికి దారేది మొదలయినప్పటి నుండే రెడ్ టీమ్ ఆటతీరు ఎవరికీ నచ్చలేదు. పృథ్వి మాత్రమే రెడ్ టీమ్‌కు సపోర్ట్ చేసి వారిని ఒక ఛాలెంజ్‌లో గెలిపించాడు. అయితే బ్లూ టీమ్ గెలవడంతో రెడ్ టీమ్ నుండి ఒక కంటెస్టెంట్‌ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుండి తప్పించాల్సి వచ్చింది. యష్మీ, ప్రేరణ, గౌతమ్ కలిసి తమ టీమ్ నుండి ఎవరు తప్పుకోవాలని డిస్కషన్ మొదలుపెట్టారు. యష్మీ, ప్రేరణ మాత్రం ఈ రేసు నుండి తప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ గౌతమ్ మాత్రం త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. దానివల్ల రెడ్ టీమ్‌కే నష్టం జరిగిందని అప్పుడు ఎవరూ గుర్తించలేదు. గౌతమ్ మాత్రమే తన పావును ముందుకు కదిలించాడు. యష్మీ మాత్రం అక్కడే ఆగపోయి ఉంది. దానివల్ల ఇద్దరూ మెగా చీఫ్ కంటెండర్ రేసు నుండి తొలగిపోయేలా ప్లాన్ చేసింది యష్మీ.
ఆరుగురి మధ్య పోటీ
డైస్ వేసి పావును ముందుకు కదిలించిన కంటెస్టెంట్స్ మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ రేసుకు ఎంపికయ్యారు. అలా బ్లూ టీమ్ నుండి అవినాష్, నిఖిల్, హరితేజ.. ముగ్గురూ మెగా చీఫ్ రేసులో ఉన్నారు. రెడ్ టీమ్ నుండి ప్రేరణ, గ్రీన్ టీమ్ నుండి నబీల్, టేస్టీ తేజ ఎంపికయ్యారు. యెల్లో టీమ్ ఒక్క టాస్క్‌లో కూడా గెలవకపోవడంతో ఆ ముగ్గురికి అసలు మెగా చీఫ్ అయ్యే ఛాన్సే లేదు. అలా ఆరుగురి మధ్య పోటీ మొదలయ్యింది. మొదటి రౌండ్‌కే హరితేజ తప్పుకుంది. రెండో రౌండ్‌లో మిగతా వారి దాటిని తట్టుకోలేక టేస్టీ తేజ తప్పుకున్నాడు. కానీ తనకు మరికాస్త బలం ఉంటే బాగుండేదని ఏడ్చేశాడు తేజ. ఇక మెగా చీఫ్ ఎవరు అవుతారు అనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.