EPAPER
Kirrak Couples Episode 1

Big Tv Exclusive : బిగ్ బాస్ రీ లాంచ్ ఎపిసోడ్ కమింగ్… ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా…

Big Tv Exclusive : బిగ్ బాస్ రీ లాంచ్ ఎపిసోడ్ కమింగ్… ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా…

Big Tv Exclusive : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నాలుగు వారాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ హిస్టరీలో కనీవినీ ఎరుగని రీతలో సోనియా ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటి వరకు హోస్ట్ నాగార్జున చెప్పిన దాని ప్రకారం.. ఆడియన్స్ ఓటింగ్‌ని బట్టే ఎలిమినేషన్ అనేది జరుగుతుంటుంది.. ఇక ఐదో వారం నామినేషన్స్‌లో ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లనున్నారు. అయితే, ఎప్పుడు అయ్యే ఎలిమినేషన్ సండే రోజు కాకుండా కాస్తా ముందుగానే చేయనున్నారు. ఈ వారం శుక్రవారం ఇంటి నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వగా, మరోకరు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం రీ లాంచ్ ఎపిసోడ్..

గత సీజన్లతో పోలిస్తే ఎనిమిదోవ సీజన్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. ఇక ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఇక ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ యాజమాన్యం ఆడియన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది.. అదేంటంటే.. బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం రీ లాంచ్ ఎపిసోడ్ ను చేయబోతున్నారట. మొదటి నుంచి ఈ సీజన్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగానే ఉంది. సీజన్ 8 అంటే ఇన్‌ఫినిటీ ట్విస్ట్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు రీ లాంచ్ అంటూ స్పెషల్ గా ఓ ఎపిసోడ్ నే తీసుకొస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు.. మరోకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది.


గంగవ్వ కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రాబోతుందని టాక్.. గంగవ్వ సీజన్ 4లో ఎంట్రీ ఇవ్వగా.. ఆమె వల్ల మిగిలిన కంటెస్టెంట్స్ పూర్తిగా గేమ్ ఆడలేకపోయారు.. ఆమెకోసం త్యాగాలు చేస్తూ పరిగెత్తారు. ఇక ఆమెనే ఆ హౌస్ లో ఉండలేక కొన్ని వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అలాంటి గంగవ్వను సీజన్ 8 2.O లోకి తీసుకురానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టేస్టీ తేజా, లేదా హరితేజ, నయని పావని, ముక్కు అవినాష్, రోహిణిలు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సారి మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి రాబోతున్నారని గత ఎపిసోడ్ లో చెప్పారు బిగ్ బాస్.. దానికోసం క్లాన్ మధ్య గొడవలు పెట్టారు బిగ్ బాస్. ఇక ఇప్పుడు ఈ రీ లాంచ్ ఎపిసోడ్ లో ఇంకా ట్విస్ట్ లు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ గురించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రీ లాంచ్ ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ఈ 2.0 లాంచ్ అక్టోబర్ 5నే జరగనుందని టాక్ వచ్చింది. కానీ, తాజాగా వచ్చిన బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం గ్రాండ్ లాంచ్ 2.0 అక్టోబర్ 6న నిర్వహించనున్నారు. ఇలా ఎవిక్షన్ తేదీల్లో మార్పులు చేశారు. ఇక ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో అందరికంటే తక్కువ ఓటింగ్ తెచ్చుకుంటోన్న నైనిక ఎలిమినేట్ అవనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

బిగ్ బాస్ ట్విస్ట్..

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏదోకటి ట్విస్ట్ ఉండనే ఉంటుంది. అలాగే ఈ స్పెషల్ ఎపిసోడ్ లో కూడా ట్విస్ట్ ఉందని తెలుస్తుంది. ఎప్పుడూ జరిగే వీకెండ్ ఎలిమినేషన్‌లో నైనిక కంటే ఎక్కువగా మిగతా కంటెస్టెంట్స్‌ కంటే తక్కువ ఓటింగ్‌లో ఉన్న ఆదిత్య ఓం ఎలిమినేట్ కానున్నారని సమాచారం. అయితే, ఎవిక్షన్ తేది వరకు ఎవరు ఎలిమినేట్ కానున్నరనే సస్పెన్స్ ఉత్కంఠత పెంచుతోంది. ఈ ఇద్దరే ఎలిమినేట్ కావచ్చు. లేదా బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇచ్చి ఎలిమినేషన్ మార్చే అవకాశం కూడా ఉంది.. మరి బిగ్ బాస్ ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే ట్విస్ట్ ఏమి ఇస్తాడో చూడాలి.. ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Related News

Bigg Boss 8 Day 31 Promo 2: చీఫ్ కోసం గొడవ.. కొట్టుకు చచ్చేలా ఉన్నారే..?

Bigg Boss 8 Day 31 Promo1: కలర్ కలర్ విచ్ కలర్.. చిన్నపిల్లల ఆటలాడిస్తున్నారే..?

Bigg Boss 8 Telugu : ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss 8 Telugu: తాను తవ్వుకున్న గోతిలో తానే పడిన సీత.. నబీల్‌ను ఆయుధంగా వాడుకున్నందుకు ఇదే గుణపాఠం

Bigg Boss 8 Telugu: మరోసారి మణికంఠకు అన్యాయం.. ఎక్కడ ఉన్నా తనకు ఈ కష్టాలు తప్పవా?

Bigg Boss 8 Telugu Promo: సీత అనర్హురాలు.. వెన్నుపోటు పొడిచిన ఫ్రెండ్స్, బలైపోయిన చీఫ్

Big Stories

×