EPAPER

Bigg Boss 8 Day 55 Promo 1: నాగ్ దెబ్బకు గజ గజ వణికిపోయిన కంటెస్టెంట్స్.. ప్రోమో వైరల్..!

Bigg Boss 8 Day 55 Promo 1: నాగ్ దెబ్బకు గజ గజ వణికిపోయిన కంటెస్టెంట్స్.. ప్రోమో వైరల్..!

Bigg Boss 8 Day 55 Promo 1 : వీకెండ్స్ అనగానే వారం మొత్తంలో జరిగిన విషయాన్ని రెండు రోజుల్లో రివ్యూ వేస్తూ నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పులను, ఒప్పులను చూపించడమే కాకుండా వారు చేసిన తప్పులకు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తారు. ఇక ఈ వారం హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, మిస్ అండర్స్టాండింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ బయటికి తీస్తూ కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపించారు నాగార్జున. ఒకరకంగా చెప్పాలి అంటే నాగ్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక కంటెస్టెంట్స్ అందరూ వణికిపోయారు అనడంలో సందేహం లేదు.


వీకెండ్స్ లో భాగంగా శనివారం ఈ రోజు జరిగే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. మరి ఈ ప్రోమోలో ఏముంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.. ప్రోమోలో స్టేజ్ పైన ఒక్కొక్క కంటెస్టెంట్ కి సంబంధించిన ఫోటోతో సహా కుండలు పెట్టడం జరిగింది. ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ స్టేజ్ పైకి వచ్చే నాగార్జున ఈసారి కోపంగా స్టిక్ తీసుకొని స్టేజ్ పైకి రావడంతో కంటెస్టెంట్స్ అప్పుడే ఈ రోజు ఏదో జరగబోతోందని ఊహించారో ఏమో మొహాలన్నీ మాడిపోయి కూర్చున్నారు.

స్టేజ్ పైకి రాగానే నాగార్జున పృథ్విని పైనుండి కింద వరకు చూశారు. నిన్ను పైనుండి కింది వరకు చూడగానే నీకు ఆ ఇంటెన్షన్ వచ్చిందా అని నాగార్జున ప్రశ్నించగా.. నాకు ఆ ఇంటెన్షన్ రాలేదు అంటూ తెలిపారు పృథ్వీ. ఆ తర్వాత నాగార్జున పృథ్వి గురించి ప్రస్తావన రాగానే నిఖిల్ గురించి ప్రస్తావన వస్తుంది అంటూ తెలిపారు. వెంటనే నిఖిల్ లేచి నిలబడ్డారు. నాగార్జున మాట్లాడుతూ.. సంచాలక్ గా నీ నిర్ణయాలు కరెక్టో కాదో నాకు, రాయల్ క్లాన్స్ కి అర్థం కావట్లేదు అంటూ తెలిపాడు. తేజ సంచాలక్ గా నిఖిల్ క్విజ్లో కరెక్టా అని ప్రశ్నించగా.. తేజ కాదు అని చెప్పాడు. ప్రశ్న పూర్తవకుండానే బజర్ మోగించారు అంటూ తెలుపగా రాయల్ క్లాన్ అందరూ కూడా ప్రశ్న పూర్తయిన తర్వాతే బజర్ మోగించారా అంటూ కామెంట్లు చేశారు. ఆ తర్వాత నిఖిల్ తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేయగా.. దీంతో నాగార్జున తేజ నీ కుట్ర నువ్వు పన్నావన్నమాట అంటూ కామెంట్ చేశారు.


ఆ తర్వాత యష్మీ ను ప్రశ్నిస్తూ విష్ణు ప్రియ ను ఎందుకు నామినేట్ చేశావు అని అడగగా.. యష్మి నీళ్లు నములుతూ.. ఇన్డ్యూస్వల్ గా గేమ్ ఆడినట్లు కనిపించలేదు నాకు అని చెప్పింది. మరి నీ గేమ్ కనిపించిందా అంటూ ఎదురు ప్రశ్నించారు నాగార్జునఆ తర్వాత హరితేజ తో నువ్వు నైనిక అసలు ఏ క్లాన్ అంటూ ప్రశ్నించాడు. అలా కంటెస్టెంట్స్ అందరికీ కూడా గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హోస్ట్ నాగార్జున ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కంటెస్టెంట్స్ కూడా దెబ్బకు వణికిపోయారు అంటూ ప్రోమో చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss 8 Telugu: గంగవ్వ సంచాలకురాలు ఏంటి బాసు.? టాస్కుల్లో కన్‌ఫ్యూజన్, అవకాశాన్ని వాడుకున్న హరితేజ

Bigg Boss 8 Telugu: సొంత టీమ్‌కు విష్ణుప్రియా వెన్నుపోటు.. పృథ్వి చెప్పిందే జరిగిందిగా!

Bigg Boss 8 Telugu Promo: ఓవరాక్షన్ చేయకు.. గౌతమ్, నిఖిల్ మధ్య గొడవ.. యష్మీ సపోర్ట్ ఎవరికి?

Bigg Boss 8 Telugu : ఇదేం కరువు రా బాబు.. పృథ్వికి విష్ణు ప్రియ స్ట్రాంగ్ వార్నింగ్..

BB Telugu 8 Diwali Special : దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఆకట్టుకున్న సమీరా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

BB Telugu 8 Promo: బీబీ ఇంటికి దారేది.. కొత్త టాస్క్ తో మరో ఛాలెంజ్..!

Bigg Boss 8 Telugu: ఇవెక్కడి నామినేషన్స్.. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా జరగడం మొదటిసారి!

×