EPAPER
Kirrak Couples Episode 1

Bigg Boss 8 Day 28 Promo 1: మీకే అంకితం.. నిఖిల్ లో ఇరికించేసిన నాగ్..!

Bigg Boss 8 Day 28 Promo 1: మీకే అంకితం.. నిఖిల్ లో ఇరికించేసిన నాగ్..!

Bigg Boss 8 Day 28 Promo 1.. బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వీకెండ్స్ లో భాగంగా నాగార్జున మళ్ళీ వచ్చేశారు. 28వ రోజుకు సంబంధించి తాజా ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. అందులో భాగంగానే మీకే అంకితం అంటూ ఒక ఛాలెంజ్ ను తీసుకొచ్చారు. మరి ఆ ఛాలెంజ్ ఏంటి..? ఆ ఛాలెంజ్ ను కంటెస్టెంట్స్ ఏ విధంగా నెగ్గారు..? అసలు ప్రోమోలో ఏముంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.


సండే ఫన్డే..

ప్రోమో విషయానికొస్తే.. నాగార్జున స్టేజ్ పైన మాట్లాడుతూ సండే ఫన్డే.. ఛాలెంజ్ పేరు.. మీకే అంకితం. అక్కడ ఉన్న ఒక్కొక్కరు ఒక్కో చీటీని తీసుకొని హౌస్ లో ఉన్న ఇంకో కంటెస్టెంట్ కి ఇచ్చి వారికి డెడికేట్ చేయాలి అని చెబుతారు. అక్కడున్న హ్యాండ్ గుర్తుని చూపిస్తూ.. చెంప దెబ్బ కొట్టాలి అని చెబుతాడు నాగార్జున. వెంటనే ప్రేరణ కలగజేసుకొని అది చెంప దెబ్బ కాదు సార్, బాడీ దెబ్బ అంటూ నవ్వించింది. ఛాలెంజ్ లో భాగంగా నైనిక ముందుకు వచ్చింది. అక్కడున్న ఒక చీటీని తీసి అందులో ఉన్న పదాన్ని చదివింది. అక్కడ లౌడ్ స్పీకర్ అని వచ్చింది. దీంతో చెప్పక్కర్లేదని విష్ణుప్రియను కొట్టేసింది నైనిక. దీంతో విష్ణు ప్రియ చిన్నప్పుడు నత్తి వస్తుందేమో అని, అమ్మ వజ ఎక్కువ పోసింది సార్ అంటూ కామెంట్ చేసింది.


నీకే అంకితం అంటూ కొత్త ఛాలెంజ్..

ఆ తర్వాత సీత చీటీ తీసుకోగా.. అక్కడ ప్లేస్ విక్టిమ్కార్డు వచ్చింది. వెంటనే ఆమె మణికంఠను చెంప దెబ్బ కొట్టింది. ఆ తర్వాత నబీల్ చీటీ తీయగా అక్కడ సేఫ్ ప్లేయర్ వచ్చింది. ఆ తర్వాత నబీల్ వెనుక చేతితో తలపై గోక్కోవడం చూసి నాగార్జున ఆదిత్యను బాగా ఇమిటేట్ చేస్తున్నవు కదా అని అడగ్గా.. చేశానా సార్ ఇప్పుడు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు నబీల్. దీంతో ఆదిత్య లేచి వచ్చి నబిల్ ఫోర్ హెడ్ పై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత నబిల్ సేఫ్ ప్లేయర్ గా నిఖిల్ పై చంప దెబ్బ కొట్టాడు.ఆ తర్వాత అటెన్షన్ సీకర్ అంటూ యష్మీకి రాగా ఆమె పృథ్వీ ను ఏకంగా మూడుసార్లు కొట్టింది. గట్టిగా కొడుతోంది సార్ అంటే కొట్టడానికే కదా ఇచ్చింది అంటూ యష్మి కామెంట్ చేసింది.

నిఖిల్ ఇరికించిన నాగ్..

ఆ తర్వాత నిఖిల్ కి ఎయిమ్ లెస్ వచ్చింది. దీంతో అందరికీ వుండేదే అని చెప్పగా.. నిన్ను అందుకే సేఫ్ ప్లేయర్ అన్నారు అంటూ నాగార్జున కామెంట్ చేశారు. ఆ తర్వాత ఇంకో చీటీ తీస్తానని అడిగాడు. అయితే అక్కడ కూడా ఇంకొకటి వచ్చేసరికి ఎయిమ్ లెస్ కి వెళ్తాను సార్ అంటూ ప్లేట్ మార్చారు నిఖిల్. దీంతో నాగార్జున ఒప్పుకోలేదు. ఆ చీటీలో ఏముందంటే..? రివిల్ చేయకుండా వెంటనే నాగార్జున నీ మనసులో ఏం లేదంటే చెప్పు అంటూ కామెంట్ లు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Related News

Bigg Boss Telugu 8: సోనియా ఆకుల నాలుగు వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే..?

Bigg Boss 8 Telugu : డబుల్ ఎలిమినేషన్ ఉందా?.. హౌస్ లోకి యంగ్ హీరో ఎంట్రీ?

Bigg Boss 8 Telugu: సోనియా అడల్డ్ రేటెడ్ కామెడీ, నిఖిల్‌ను అవమానించిన విష్ణుప్రియా.. ఇచ్చిపడేసిన నాగార్జున

Bigg Boss 8 Telugu: నబీల్ హీరో, నిఖిల్ జీరో.. డైరెక్ట్ డేంజర్‌లో పడిన మణికంఠ

Bigg Boss 8 Day 27 Promo 3: వారు ముగ్గురే టార్గెట్.. ఇచ్చిపడేసిన నాగ్..!

Big TV Exclusive: బిగ్ బాస్ నుండి సోనియా ఔట్.. కారణాలు ఇవే అంటున్న ప్రేక్షకులు

Big Stories

×