EPAPER

BB Telugu 8 Promo: కిడ్స్ గా మారిపోయిన కంటెస్టెంట్స్.. సూపర్ పర్ఫామెన్స్..!

BB Telugu 8 Promo: కిడ్స్ గా మారిపోయిన కంటెస్టెంట్స్.. సూపర్ పర్ఫామెన్స్..!

BB Telugu 8 Promo:తాజాగా 60వ రోజుకి సంబంధించి బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అందరూ నవ్వులలో మునిగి తేలిపోయారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ను విపరీతంగా అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా ఇప్పటికే దాదాపు 7 వారాలకు గానూ.. ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. అలాగే వైల్డ్ కార్డు ద్వారా మొత్తం ఎనిమిది మంది హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇలా వీరంతా కూడా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుండగా.. అందులో భాగంగానే తాజాగా 60వ రోజుకు సంబంధించి ఒక ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. ఆ ప్రోమో లో ఏముందో ఇప్పుడు చూద్దాం.


ప్రోమోలో.. మీ కిచెన్ టైమర్ ని పొందడానికి బిగ్ బాస్ మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. అవినాష్ మరియు రోహిణి చిన్నపిల్లలుగా మారబోతున్నారు అంటూ హరితేజ బిగ్ బాస్ చెప్పిన విషయాన్ని కంటెస్టెంట్స్ తో తెలియజేస్తుంది. ఇక టాస్క్ మొదలవ్వగానే బిగ్ బాస్ మరియు రోహిణి చిన్నపిల్లల గెటప్లతో అందరిని ఆకట్టుకున్నారు. చిన్నపిల్లలుగా మారిన రోహిణి, ముక్కు అవినాష్ లను సంతోషంగా ఉంచగలిగితే, మీ కిచెన్ టైమర్ ని మీరు పొందవచ్చు అంటూ బిగ్ బాస్ తెలిపారు. ఇక రోహిణి ను గౌతమ్ వీపున వేసుకొని మరీ మోసాడు. ఆ తర్వాత యష్మీ రోహిణి ను ఎత్తుకుంటుంది. గౌతమ్ వీపు మీద ఎక్కడానికి రోహిణి, అవినాష్ ఇద్దరు కూడా గొడవపడ్డారు ఆ తర్వాత రోహిణికి నయని పావని ముద్దు పెట్టగా.. అవినాష్ కి కూడా ముద్దు పెట్టమని చెబుతుంది రోహిణి.

ఇక తర్వాత హరితేజ టీచర్ గా మారి , రోహిణి దగ్గరకు రాగానే అవినాష్ టీచర్ టీచర్ దూరం జరగండి.. ఉచ్చపోస్తుంది.. అంటూ కామెంట్ చేశారు. వెంటనే హరితేజ డైపర్ వేసుకోలేదా అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత పృథ్వీ కూడా అవినాష్ ను వీపు మీద కూర్చోబెట్టుకొని ఏనుగు ఆట ఆడించారు. ఆ తర్వాత రోహిణి గౌతమ్ తో పప్పీ కావాలి అని అడుగుతుంది అతడు చెంప పై ముద్దు పెట్టబోతే లిప్ కిస్ ఇవ్వమని కోరుతుంది. ఇవన్నీ కూడా సరదా సరదాగా సాగాయి . ఆ తర్వాత యష్మితో ఆంటీని ఎత్తుకోమని చెప్పండి అంటూ ముక్కు అవినాష్ కోరాడు. దీంతో యష్మి పారిపోయే ప్రయత్నం చేసింది. ముక్కు అవినాష్ నువ్వే ఎత్తుకోవాలి అంటూ కింద పడి ఏడవగా, నా నడుము విరిగిపోతుంది అంటూ యష్మి పారిపోయింది. ఆ తర్వాత హరితేజ ముక్కు అవినాష్ , రోహిణికి పాటాలు చెబుతూ అక్షరాలు నేర్పించింది. ఇక చివర్లో నిఖిల్ అటు రోహిణి ఇటు అవినాష్ ను ఇద్దరినీ చంకలో ఎత్తుకున్నాడు. మొత్తానికైతే ఈ ప్రోమో కాస్త చాలా సరదాగా సాగింది.


Related News

Bigg Boss 8 Telugu: సంచాలకుడిగా పృథ్వి ఫెయిల్.. గంగవ్వపై భారీ ఎఫెక్ట్, సపోర్ట్ కోల్పోయిన యష్మీ టీమ్

Bigg Boss 8 Telugu: గౌతమ్, నిఖిల్ మధ్య నలిగిపోతున్న యష్మీ.. టీమ్స్‌లో విభేదాలు, చిన్న మాటలకే మనస్పర్థలు

BB Telugu 8 Hariteja : హరితేజ పై నెగిటివ్ మార్క్.. బయటకొస్తే పాప పరిస్థితి ఏంటో..?

Bigg Boss Telugu 8 Promo: స్లీపింగ్ రేస్ ఛాలెంజ్.. ఏడ్చేసిన నయని పావని..

Bigg Boss 8 Telugu: గంగవ్వ సంచాలకురాలు ఏంటి బాసు.? టాస్కుల్లో కన్‌ఫ్యూజన్, అవకాశాన్ని వాడుకున్న హరితేజ

Bigg Boss 8 Telugu: సొంత టీమ్‌కు విష్ణుప్రియా వెన్నుపోటు.. పృథ్వి చెప్పిందే జరిగిందిగా!

×