Big Stories

Sharmila: 43 స్థానాల్లో ప్రభావం.. మిస్డ్ కాల్స్ కూడా.. అయితే, షర్మిలనే సీఎంయా?

YS Sharmila Latest News(Telangana News Today): వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ సంస్థ తెలంగాణలో సర్వే చేసిందని.. అందులో తమ పార్టీ 43 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తుందని రిపోర్టు ఇచ్చిందని చెప్పారు షర్మిల. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.

- Advertisement -

ఏంటేంటి.. షర్మిల పార్టీ 43 స్థానాల్లో ప్రభావం చూపుతుందా? వినడానికి కాస్త కామెడీగానే ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్‌లోనూ పోటీ చేయలేదు.. ఆ పార్టీలో ఒక్క ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయకుడూ లేడు.. షర్మిల వెనుక పట్టుమని 10మంది కూడా కార్యకర్తలు కనిపించరు.. అలాంటిది ఏకంగా 43 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించడమంటే మామూలు విషయమా? కనీసం ఆ పార్టీ 43 స్థానాల్లో పోటీ అయినా చేస్తుందా? అంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు అయినా ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి.

- Advertisement -

షర్మిల పోటీ చేసేందుకే ఓ స్థానం దొరకడం చాలాకష్టమై పోయింది. బాగా ఆలోచించి పాలేరును ఎంచుకున్నారు. గెలుస్తారా? లేదా? అనేది పక్కనపెడితే.. పాలేరు నుంచి ఆమె పోటీ చేయడం మాత్రం ప్రస్తుతానికి ఫిక్స్. షర్మిల కాకుండా మరో అభ్యర్థి పేరే వినిపించటం లేదు. అలాంటిది ఏకంగా 43 స్థానాల్లో వైఎస్సార్‌టీపీ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడం నమ్మశక్యమేనా? అంటున్నారు.

సర్వే చేసింది ఓ జాతీయ సంస్థ అట. మరి, ఆ సంస్థ పేరు కూడా చెప్పొచ్చుగా? ఆ రిపోర్టేదో చూపించొచ్చుగా? షర్మిల పార్టీకే అంత ప్రభావం ఉంటే.. మరి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల బలం ఇంకెంత? ఈసారి ఏ పార్టీకైనా 30-50 సీట్లు రావడం చాలాకష్టమని అంటున్నారు. మరి, షర్మిల చెప్పినట్టు ఆమె పార్టీ 43 స్థానాల్లో ప్రభావం చూపి.. ఆ ప్రభావంతో గెలిస్తే.. షర్మిలనే కింగ్ కానీ, కింగ్ మేకర్ కానీ.. అవుతారుగా?

ఇక, షర్మిలకు పలు పార్టీల నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయట. ఇది మరింత ఆసక్తికర విషయం. పొత్తుల కోసమో, విలీనం కోసమో.. వైఎస్సార్‌టీపీని పలు పార్టీలు సంప్రదిస్తున్నాయనేది ఆమె మాటల సారాంశం. సందట్లో సడేమియాలా.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోందట. ఆ విషయం షర్మిల దృష్టికి కూడా వచ్చిందట. వెంటనే ఆమె ప్రెస్‌మీట్లో ఆ ఆరోపణలను ఖండించారు. విలీనం చేసేందుకు.. పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని.. ఎప్పటికీ పార్టీ విలీనం జరగదని తేల్చిచెప్పారు. తమ పార్టీ 43 చోట్ల ప్రభావం చూపుతుందని జాతీయ సర్వే చెప్పాక.. అలాంటప్పుడు కేవలం కొన్ని సీట్ల కోసం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనేది షర్మిల ప్రశ్న.

షర్మిల కామెంట్లు కాస్త కామెడీగా ఉన్నాయంటున్నా.. ఆ మాటల వెనుక వ్యూహం లేకపోలేదని అంటున్నారు. తమకు తాము బలమైన పార్టీగా ప్రజెంట్ చేసుకునేందుకే ఇలా.. సర్వే రిపోర్టులు, 43 స్థానాలంటూ.. వాపును ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. పొంగులేటి కోసం కాంగ్రెస్, బీజేపీలు వెంటబడుతుంటే.. తమకు డిమాండ్ లేదని ప్రజలు ఎక్కడ అనుకుంటారోనని.. తమకు కూడా పొత్తుల కోసం ఇతర పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయని.. కానీ, తాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటూ.. తనను తాను ప్రచారంలో పెట్టుకుంటున్నారు షర్మిల. ఇదోరకం పొలిటికల్ స్ట్రాటజీ అంటున్నారు ఎనలిస్ట్స్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News