EPAPER

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

YS Jagan Mohan Reddy Master Sketch in YSRCP Party: జగన్ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు ఎవరికీ అంతుపట్టవు. అసలు ఆయన ఎవర్ని నమ్ముతారో ఆ పార్టీలోనే ఎవరికీ తెలియదంటారు. పేరుకి చుట్టూ పదులు సంఖ్యంలో సలహాదారులున్నా.. ఆయన ఎవరి సలహా స్వీకరించరని.. తాను అనుకుందే చేస్తారంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీతయ్య లాంటి వారని వైసీపీలో చెప్పుకుంటారు. ఎవరి మాటా వినని ఆయనకు అంత మంది సలహాదారులు ఎందుకో అని పార్టీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాయి. సీఎంగా పాలన, పార్టీ వ్యవహారాల్లో అదే రూటు ఫాలో అయిన జగన్.. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.


ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ మరణానంతరం తనను ముఖ్యమంత్రిని చేయలేదని కాంగ్రెస్‌ని వీడిన జగన్ .. తండ్రి పేరుతోనే సొంత పార్టీతోనే పార్టీ పెట్టుకున్నారు. వైసీపీ స్థాపన సమయంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన 18 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. ఆ ఎఫెక్ట్‌తో 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో 18కి 15 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. సరిగ్గా ఆ బైపోల్స్ ప్రచార సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవ్వడం పార్టీకి ప్లస్ అయింది.

బైపోల్స్ ఫలితాలు ఇచ్చిన జోష్‌తో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో తన సెల్ఫ్‌ఇమేజ్‌తో గెలుస్తానన్న నమ్మకంతో తెగ హడావుడి చేశారు. అయితే అప్పట్లో రాజధాని లేకుండా విడిపోయిన ఏపీ వాసులు చంద్రబాబు అనుభవానికి పట్టం కట్టారు. 2019 ఎన్నికల నాటికి జగన్ స్ట్రాటజీ మార్చేశారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ను ఏపీకి పరిచయం చేశారు. పీకే సలహాల మేరకు సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ.. జనంపై నవరత్నాల హామీలు గుప్పించారు.


పీకే స్ట్రాటజీ వర్కౌట్ అయి జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. పవన్‌లోకి రాగానే జగన్ కొత్త సంప్రదాయానిక తెర లేపారు. ప్రజల సొమ్ముతో పదులు సంఖ్యలో సలహాదారులను నియమించుకుని మంత్రుల కంటే వారికే ఎక్కువ పెత్తనం ఇచ్చారు. ఆ క్రమంలో ఎక్కడ లెక్కలు తేడా వచ్చాయో కాని ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరమయ్యారు. ఆయన స్థానంలో ఐపాక్ టీంని తెచ్చుకున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక దగ్గర నుంచి ప్రతిదీ ఐపాక్ టీం సూచనలే పాటించిన జగన్ బలం  ఒక్కసారిగా 151 నుంచి 11కి పడిపోయింది.

అసలు ఎన్నికలకు నెలల ముందే ప్రశాంత్ కిషోర్ వైసీపీ భవితవ్యంపై జోస్యం చెప్పేశారు. అభివ‌ృద్ధిని అటకెక్కించి నవరత్నాల్నే నమ్ముకున్న జగన్ ఘోర పరాజయం పాలవ్వడం ఖాయమని తేల్చేశారు  అయితే ఐపాక్ టీమ్ సలహలనే నమ్ముకున్న జగన్.. వాటినే ఫాలో అయి తన గొయ్యి తానే తవ్వుకున్నారు.

Also Read: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

ఎన్నికల ఫలితాలు రాకముందే విజయవాడ నుంచి ఐపాక్ టీమ్ దుకాణం సర్దేసింది. ఇప్పుడు వైసీపీకి కొత్తగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు జగన్ .. ఆ పీఏసీ మెంబర్‌గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని నియమిస్తున్నట్లు వైసీపీ కార్యాలయం చేసిన ప్రకటనతో ఆ కమిటీ నియామకం వెలుగు చూసింది. మామూలుగానే ఎవరి సలహాలు వినరని పేరున్న జగన్‌కి ఆ కమిటీ ఏం అడ్వైజ్‌లో ఇస్తుందో కాని … ఆయన న్యాయస్థానాల ఉత్తర్వులు కూడా ఖాతరు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ మాజీ అవ్వగానే ఆయనకు డిప్లమేటిక్ పాస్ పోర్టు రద్దైపోయింది. గతంలో అక్రమాస్తుల కేసులో బెయిల్ లభించినప్పుడు తన సాధారణ పాస్‌పోర్ట్ జగన్ కోర్టులో సరెండర్ చేశారు. ఇప్పుడు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్ రద్దవ్వడంతో పాసుపోర్ట్ రెన్యువల్ కోసం ఆయన అప్లై చేసుకుంటే ఆ కార్యాలయం ఎన్ఓసీ అడగడంతో ఆయన కోర్టుని ఆశ్రయించారు. దానిపై ప్రజాప్రతినిధులు కోర్టు విచారణ జరిపి ఒక ఏడాది పాస్ పోర్టు రెన్యువల్ కు అనుమతించింది. దాంతో అయిదేళ్ల పరిమితితో పాస్‌పోర్ట్ కావాలని జగన్ హైకోర్టులో పిటీషన్ వేశారు.

జగన్ కోరిన విధంగా ఐదేళ్ల రెన్యువల్ కు హైకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో కుమార్తె పుట్టినరోజు కోసం లండన్ వెళ్లడానికి కోర్టుల అనుమతి తీసుకున్న జగన్ ప్రయాణానికి అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు. అయితే జగన్ కు ఐదేళ్ల పాస్ పోర్టు కు అనుమతించిన హైకోర్టు.. కింది కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అదీ నిబంధనల ప్రకారం ఆయన స్వయంగా కోర్టుకు వెళ్లి మరీ పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది. అయితే జగన్ ఇంత వరకు ఆ పని చేయలేదు.

అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి వచ్చిన జగన్‌ 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసు వాయిదాలకు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చాక తనపై కేసుల విచారణకే కాదు.. కోడికత్తి కేసులో బాధితుడిగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన కోర్టు మెట్లక్కడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించేందుకు కోర్టుకు వెళ్లేందుకు ఆయన సుతరామూ ఇష్టపడటం లేదంట. అందుకే ఆయన పాస్ పోర్టు ఇప్పటికీ రెన్యువల్ కాలేదు.

కోర్టు తీర్పు వచ్చి రోజులు గడుస్తున్నా.. ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించలేదు. ఆయన లండన్ పర్యటనకు కారణంగా చెప్పిన కుమార్తె పుట్టిన రోజు ఇప్పటికే అయిపోయింది. దీంతో ఆయన లండన్ యాత్ర టూర్ రద్దైనట్లే అంటున్నారు. ఇప్పుడు ఆయన లండన్ వెళ్లాలన్నా మరో కారణం చూపించి.. మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవాలి.. అప్పుడు కచ్చితంగా ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కోర్టులో కౌంటర్ అఫడివిట్ దాఖలు చేస్తుంది. మళ్లీ వాదనలు షరామామూలే.. అప్పుడైనా ఆయన పాస్ పోర్టు రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. మరప్పుడేం చేస్తారో కాని.. తన మోనోపోలిజంతో జగన్ మాత్రం.. రియల్ లైఫ్ సీతయ్య .. అన్న టాగ్‌లైన్ సొంతం చేసుకుంటున్నారు.

Tags

Related News

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Big Stories

×