EPAPER

YS Jagan Mohan Reddy: ఆ ఒక్క పేరు.. జగన్‌కి వెన్నులో వణుకు పుట్టిస్తోందా?

YS Jagan Mohan Reddy: ఆ ఒక్క పేరు.. జగన్‌కి వెన్నులో వణుకు పుట్టిస్తోందా?

YS Jagan Mohan Reddy Fear Over Nara Lokesh Red Book: వైసీపీ నేతల్లో రెడ్ బుక్ భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు కేసుల భయంతో కనిపించకుండా పోయారు. నాయకులతో పాటు వైసీపీతో అంటకాగిన జగన్ భక్త అధికారులు కూడా అదే భయంతో వణికి పోతున్నారంట. సాక్షాత్తు వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం పదేపదే రెడ్‌బుక్ జపం చేస్తున్నారు. తాజాగా తిరుమలలో రోజా రాష్ట్రంలో రెడ్ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వాపోయారు. అంటే లోకేష్ వార్నింగ్ ఎఫెక్ట్ వైసీపీపై ఏ రేంజ్లో పనిచేస్తుందో ఇట్టే అర్థమవుతుంది.


వైసీపీ హ‌యాంలో తెలుగుదేశం నేత‌ నారా లోకేశ్ పై వైసీపీ నేత‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్స్ చేశారు. మీడియా స‌మావేశాల్లో, స‌భ‌ల్లో చంద్ర‌బాబు స‌హా నారా లోకేశ్‌ను టార్గెట్‌గా చేసుకొని ఇష్టారీతిలో మాట్లాడారు. ఇక కొడాలి నాని, వల్ల‌భ‌నేని వంశీ, జోగి ర‌మేశ్‌, ఆర్కే రోజా, పేర్ని నాని వంటి నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్లు లోకేశ్ ను తిట్ట‌ని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ప‌ప్పు.. ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేడు.. అసెంబ్లీ గేట్లు కూడా తాక‌ లేడు అంటూ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల చేశారు. లోకేశ్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ, ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల అండ‌దండ‌ల‌తో లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేశారు.

పాద‌యాత్ర స‌మ‌యంలో తెలుగుదేశం శ్రేణులు, ప్ర‌జ‌ల ప‌ట్ల వైసీపీ నేత‌లు, కొందరు అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో చ‌లించిపోయిన లోకేశ్‌.. రెడ్ బుక్‌ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని హద్దులుదాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లు, అధికారుల పేర్ల‌ను ఆ రెడ్ బుక్‌లో ఎంటర్ చేస్తూ వ‌చ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చివ‌రి స‌భ వ‌ర‌కు రెడ్ బుక్‌ను లోకేశ్ మెయింటెన్ చేశారు. అప్ప‌ట్లో రెడ్ బుక్‌పై వైసీపీ నేత‌లు సెటైర్లు కూడా వేశారు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీ శ్రేణుల్లో రెడ్‌బుక్ టెర్రర్ స్పష్టంగా కనిపిస్తుంది.


లోకేశ్ రెడ్‌బుక్‌ పేరువింటేనే జ‌గ‌న్ సైతం భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు . కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల‌కే ఏపీలో అరాచ‌క పాల‌న జ‌రుగుతుందంటూ జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి వచ్చారు. ఆ ధర్నా సమయంలో లోకేశ్ రెడ్‌బుక్‌ను జగన్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఆ త‌రువాత‌ కూడా వైసీపీ నేత‌ల స‌మావేశాల్లోనూ, మీడియాతో మాట్లాడిన స‌మాయాల్లోనూ పలుసార్లు జగన్ రెడ్‌బుక్ జపం చేశారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జ‌రిగిన స‌మావేశంలోనూ రెడ్‌బుక్ గురించే ప్ర‌ధానంగా జ‌గ‌న్ చ‌ర్చించారు. రెడ్ బుక్‌తో వైసీపీ నేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వారికి అండ‌గా వైసీపీ లీగ‌ల్ సెల్ ప్ర‌తినిధులు ఉండాల‌ని జ‌గ‌న్ సూచించిన‌ట్లు తెలిసింది. అలా రెడ్‌బుక్.. రెడ్‌బుక్ అంటూ జగన్ ప‌దేప‌దే జపం చేస్తుండటంపై వైసీపీ నేత‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారంట.

Also Read: తిరుమల కొండపై.. ఇవేం పనులు రోజా?

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు రెడ్‌బుక్ అంటే ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు మాట్లాడితే రెడ్‌బుక్ అంటూ వ‌ణికిపోతున్నారని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాలు, భూక‌ బ్జాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టికే మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు అరెస్టు అయ్యారు. జోగి ర‌మేశ్ సైతం నేడో రేపో అరెస్టు అవ్వడం ఖాయమం టున్నారు. ఆ క్రమంలో రెడ్‌బుక్‌పై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. రెడ్‌బుక్‌లో నోట్ అయిన ఎవర్నీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి భూక‌బ్జాల ఆరోప‌ణ‌లపైనా విచార‌ణ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో పెద్దిరెడ్డీ జైలుకెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలా ఇలా వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రిపై వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో తొంద‌ర‌లోనే త‌న‌ వంతు కూడా వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

జగన్ నిత్యం ఏపీలో అరాచ‌క పాల‌న సాగుతున్నద‌ని ప్ర‌చారం చేయ‌డం, పదేపదే రెడ్ బుక్ గురించి తలచుకుని వణికిపోవడం చూస్తున్న వైసీపీ నేత‌లు జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తీ సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ రెడ్‌బుక్ గురించి ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై జరుగుతున్న విచారణ, నేతల అరెస్టులకు కారణం రెడ్ బుక్ అని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ భయం చూస్తూ ఆయనకు రెడ్ బుక్ జ్వరం పట్టుకుందని ఆ పార్టీ నేతలే సెటైర్లు విసురుతున్నారు.

 

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×