EPAPER

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

రాయలసీమలో వైసీపీకి అంతో ఇంతో మర్యాద నిలిపిన జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అని చెప్పవచ్చు.  గత ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు రెండు ఎంపీ స్థానాలు గెలిచిన జిల్లా చిత్తూరు ఒక్కటే.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిస్తే అందులో ఇద్దరు ఈ జిల్లా నుంచే గెలిచారు. ఇక జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఫ్యామిలీ వారే.. పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు మెజార్టీలు గణనీయంగా తగ్గినా గట్టెక్క గలిగారు. రాజంపేట ఎంపీగా గెలిచిన మిధున్‌రెడ్డి కూడా పెద్దిరెడ్డి వారసుడే.

జగన్ అధికారంలో ఉన్న అయిదేళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఒక రేంజ్లో నడిచింది. రాయలసీమ జిల్లాల్లో అనధికార సీఎంగా ఆయన చెలామణి అయ్యారు. అలు ప్రభుత్వంలో నెంబర్ టూగా ఫోకస్ అయ్యారు. అలాంటాయనికి జగన్ జిల్లాలో ఊహించని షాక్ ఇచ్చారు. నిజంగా పార్టీ పునర్మిణాంపై దృష్టి సారించారో? లేకపోతే ఇంకే లెక్కలు వేసుకున్నారో కాని జిల్లాలో పరాజయం పాలైన నేతలకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టారు. తన నమ్మిన బంటు అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఇప్పటికే రాష్ట పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.


తాజాగా ఉండవల్లి ప్యాలెస్‌లో చిత్తూరు జిల్లా నాయకులతో భేటీ అయిన జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండమని అదేశాలు ఇచ్చారంట. జిల్లా వైసీపీ శ్రేణులతో పెద్దాయనగా పిలిపించుకునే పెద్దిరెడ్డికి అది మింగుడుపడటం లేదంటున్నారు. జగన్ లెక్కల వెనుక కారణమేంటని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. పెద్దిరెడ్డి అనుచరులను టార్గెట్ చేసుకుని వారి వల్ల ఓటమి పాలయ్యామని జగన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారంట జిల్లా నేతలు.

జిల్లాలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి సొంత కేడర్ ఉంది. సొంత పార్టీలో తనకు నచ్చని నేతలను ఓడించడానికి పెద్దిరెడ్డి తన సైనాన్ని ఉపయోగించారన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంటో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి అనుచరుడు అయిన ఎర్రవారిపాల్యం మండలానికి చెందిన ఎమ్మార్సీ రెడ్డి అనే నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఆయన ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసాడని అరోపించారు. అయితే ఆ నాయకుడు పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ పెద్దిరెడ్డితో కనిపిస్తుండటం విశేషం.

తాజాగా నగరి నియోజకవర్గంలో రోజా కంటే ముందు నుంచి పార్టీలో ఉంటు పార్టీ కోసము పనిచేసిన కేజే కూమార్ ,అయన భార్య నగరి మాజీ మున్పిపల్ చైర్మన్ శాంతిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు. 2014 నుంచి 19 మధ్యకాలంలో కేజే కుమార్ భార్య నగరి మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశారు. అదే సమయంలో పలుసార్లు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో వారు అరెస్టయ్యారు. అయితే 2019 తర్వాత రోజా వారిని పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. కుటుంబ పెత్తనము జరుగుతుందని అసమ్మతి నాయకులు విమర్శించారు.

Also Read: సీతారాం ఏచూరి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు.. సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి

రోజాకు టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేసిన వారిలో కేజే కుమార్ దంపతులు కూడా ఉన్నారు. అయితే రోజా వ్యతిరేక నేతల్లో అందరూ వైసీపీని వీడినా ఆ దంపతులు మాత్రం జగన్‌పై అభిమానంతో పార్టీలోనే కనసాగుతూ వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కెజె కూమార్ భార్య శాంతి ఏకంగా నగరికి శని వదిలి పోయిందని సెల్పీ వీడియో పెట్టడం కూడా అప్పట్లో సంచలనం రేపింది. ఆ క్రమంలో పార్టీ సమావేశంలో రోజాకు మద్దతుగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి కూడా మాట్లాడటంతో ఇప్పుడు కుమార్ దంపతులను సస్పెండ్ చేశారంట.

అలాగే చిత్తూరులో కూడా తనకు వ్యతిరేకంగా పనిచేసాడని పెద్దిరెడ్డి అనుచరుడు మొదలియార్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ అయిన బుల్లెట్ సురేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారంట.. వారితో పాటు మరికొంత మంది పెద్దిరెడ్డి అనుచరుల పేర్ల లిస్టును కూడా పార్టీ ఆఫీసులో సమర్పించారంట. వారి విషయంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

మరో వైపు పలమనేరు మాజీ ఎమెల్యే వెంకటేగౌడ కూడా తనకు కో అపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రెడ్డెమ్మ తో పాటు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఎన్నికలలో సహాకరించలేదని జగన్‌ ఫిర్యాదు చేశారంట. అయితే వీరిలో రెడ్డెమ్మది పెద్దిరెడ్డి వర్గం కాగా శ్రీనివాసులు మాత్రం భారతి సిఫార్సుతో పదవి తెచ్చుకున్న వ్యక్తి .. కుప్పంతో పాటు రాష్ట వ్యాప్తంగా చంద్రబాబుకు సింపతీ ఇమేజ్ పెరగడానికి సెంథిల్ లాంటి వ్యక్తులు వ్యవహారించిన తీరు కారణమని పార్టీ సమావేశంలో చర్చించుకున్నారంట.

అయితే జిల్లాలో ఒవర్ యాక్షన్ చేసి పార్టీ ఇమేజ్ దెబ్బతీసిన వారిలో ఎక్కువ మంది పెద్దిరెడ్డి అనుచరులు ఉన్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారంట. తిరుపతిలో టీటీడీ మాజీ సభ్యుడు ,పెద్దిరెడ్డి అనుచరుడు అయిన పోకల అశోక్ కూమార్ వర్గానికి చెందిన వారు జనసేనకు అనుకూలంగా పనిచేశారని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. అందుకే పార్టీ సలహాదారులు ,సీనియర్లు అంతా కలిసి జిల్లాలో పార్టీ పునర్నిర్మాణ బాధ్యతను పెద్దిరెడ్డి మీదాపెట్టాలని నిర్ణయించారంట.

ఎవరి వల్ల పార్టీ నష్ట పోయిందే వారే పార్టీని సెట్ చేయాలని జగన్ పేర్కొన్నట్లు తెలిసింది. అందుకే పెద్దిరెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారంట .. అదే సమయంలో జూనియర్ అయిన చెవిరెడ్డికి కీలకమైన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం కూడా ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది .. కేవలం పెద్దిరెడ్డి స్థాయిని తగ్గించడానికి ఈ విధంగా చేస్తున్నారని అంటున్నార ..మొత్తం మీదా ఓటమి పాలైనా పార్టీలో తమదే పైచేయి అని రోజా, చెవిరెడ్డిలు నిరూపించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే మాట్లాడకుండా ఉండలేని రోజాకు పార్టీ అధికార ప్రతినిధి పదవి ఇవ్వక పోవడం కూడా అమెను గీత దాటవద్దని హెచ్చరించడానికే అంటున్నారు… ఇటీవల వరద ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడ సహాయక చర్యల గురించి మాట్లాడిన రోజా.. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే వారిపై రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీకి మైనస్‌గా మారాయని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఆ నోటి దూకుడు కారణంగానే రోజాకు అధికారప్రతినిధి పదవి దూరమైందంటున్నారు. మరోవైపు చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేసిన శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యుడు బియ్యం మధుసూదన్‌రెడ్డితో పాటు మిగతా నాయకులను సైలెంట్ గా ఉండమని పార్టీ పెద్దలు హెచ్చరించారంట. మొత్తం మీదా పెద్దిరెడ్డిని జిల్లా పార్టీ బాధ్యతలకు పరిమితం చేయడంపై అయన అనుచరులు సీరియస్ గా ఉన్నారంట. మొత్తానికి అలా సాగిపోతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయం.

Related News

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Big Stories

×