EPAPER

Youtuber Harsha: రీల్స్ పేరుతో వెర్రివేషాలు.. ఇదా ఇన్ స్పైర్ చేసే విధానం ?

Youtuber Harsha: రీల్స్ పేరుతో వెర్రివేషాలు.. ఇదా ఇన్ స్పైర్ చేసే విధానం ?

Youtuber Harsha Viral Video: ఈ మధ్య రీల్స్ పిచ్ పీక్స్ స్టేజ్ కు వెళ్తున్నాయి. దానికంటూ ఓ హద్దు, అదుపు ఉండటం లేదు. ఎక్కడి బడితే అక్కడ .. ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తున్నారు. జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే హైదరాబాద్ లో ఓ యూట్యూబర్ చేసిన పనికి నెటిజన్లు తగినబుద్ధి చెప్పారు. అసలు అతను ఏం చేశాడో చూస్తే.. మీరే షాకవుతారు.


ఇతని పేరు పవర్ హర్ష. యూట్యూబ్ లో, ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు, రీల్స్ చేస్తాడు. ఏ వీడియోలు పెడతాడో, ఎలాంటి కంటెంట్ ఇస్తాడోగానీ.. కాస్తోకూస్తో అకౌంట్‌లోకి డబ్బు వచ్చిపడుతోంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి మళ్లీ వీడియోలు చేస్తున్నాడు.పెట్టుబడి అంటే.. పద్ధతిగా కాదు.. విచ్చలవిడిగా విసిరేస్తున్నాడు.

రోడ్డుపై డబ్బుల కట్టలు చల్లుతూ చేస్తున్న రీల్స్.. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే కూకట్ పల్లిలో జరిగింది. బైకుపై వచ్చి రోడ్డుపై నోట్ల కట్టలు చల్లాడు. ఆ డబ్బులను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. ఆపై ఏదో గొప్ప పని చేసినట్టు .. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఫస్ట్‌ టైమ్ కాదు. కరెన్సీ కట్టలను తీసుకొచ్చి ఇలా గాల్లోకి ఎగరేసి రీల్స్ చేయడం ఇతనికి అలవాటు. ఆ డబ్బును పట్టుకోడానికి జనం ఎగబడతారు. అందులో ట్రాఫిక్ మధ్యలోకి వచ్చి రోడ్డుపై ఇలా స్టంట్స్ చేస్తాడు. దీంతో అక్కడనున్న వారంతా డబ్బుల ఏరుకోవడానికి ఎగబడ్డారు. దీని వల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయ్యింది. గంటల సేపు జనం ట్రాఫితో ఇబ్బందులు పడ్డారు.


ఇలా ఎక్కడపడితే అక్కడ జనాల రద్దీ ఉన్న చోటుకు వచ్చి.. కెమెరాను చూస్తూ డబ్బులు విసరడం. దానిని సోషల్ మీడియాలో పెట్టడం పనిగా పెట్టుకున్నాడు. ఇంకేముంది వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతటితో ఆగకుంటా అతగాడు మాట్లాడిన మాటలు.. నెటిజన్ల కోపానికి మరింత కారణమయ్యాయి.

Also Read:పెళ్లి కూతురిని ఇంప్రెస్ చేద్ధామని చూసి అతిథుల ముందు నవ్వుల పాలైన వరుడు

గాల్లోకి విసిరిన 50 వేలు కేవలం రెండు గంటల్లో సంపాదించాడంట. మీరు కూడా నాతో పాటు జాయిన్ కండి. కేవలం రోజుకు రెండు వేలు పెట్టండి. మీకు 5 నుంచి 20 వేలు వరకు సంపాదన చూపిస్తానంటూ పిచ్చి కూతలు కూశాడు. అంటే డబ్బులు సంపాదించడం అంత ఈజీ అన్నట్టుగా ఉంది. సరే సంపాదిస్తే మంచిదే. దానిని ఓ మంచి పనికోసం ఉపయోగిస్తే ఇంకా మంచిది. దానికి కూడా లైకులు వస్తాయ్. కానీ అదేమీ చేయకుండా.. డబ్బులంటే విలువ లేనట్టు.. రోడ్లపై పిచ్చి పేపర్లు విసిరినట్టు విసిరాడు. మరి ఇలా చేయడం ద్వారా ఏం మేసేజ్ ఇస్తున్నట్టు అంటే.. ఏం లేదు.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి సంపాదిస్తాడు.

ఇక వీడియోలు చూస్తున్న జనం ఊరుకుంటారా.. ఫైర్ అయ్యారు. కంటెంట్ క్రియేషన్ రూపంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. రోడ్డుపై నాన్సెస్ క్రియేట్ చేసిన పవర్ హర్ష అలియాస్ మహదేవ్ ను జైలుకు పంపాలని.. అలాగే జరిమానా విధించాలని తెలంగాణ డీజీపీ, రాచకొండ పోలీసులను ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు. ఇకేముంది ఇంతమంది కంప్లెంట్ ఇస్తే ఖాకీలు ఊరుకుంటారా.? రెండు కేసులు ఫైల్ చేశారు. దెబ్బకి బాబు రియాక్ట్ అయ్యాడు.

రోడ్లపైకి వచ్చి డబ్బులు విసిరేయడం హెల్ప్ అంటా. లక్షలు పెట్టి హెల్ప్ చేశాడంట. దీనిని సహాయం చేయడం అని ఇతనిని చూసే నేర్చుకోవాలి మరి. నిజానికి ఇతనిలా డబ్బు ఎక్కువైతే పదిమందికి సహాయం చెయ్యాలి. కానీ నడిరోడ్డుపై విసిరేస్తి పదిమందినీ కంగారెత్తిస్తే దాన్నేమంటాం. డబ్బు మదం అనే కదా అనాలి. గతంలో ఇలాగే బెట్టింగ్ యాప్స్ పేరుతో పెద్ద దందానే నడిచింది. దానిని కూడా నెటిజన్లు, దాని బారిన పడిన బాధితులు బయటకొచ్చారు. ఇలాంటి పనులు చేసే వారికి బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఇలాంటివి చూసి మరింతమంది పెడదారి పట్టే అవకాశం ఉందని.. ఇలాంటి బ్యాచ్ సమాజానికే హానికరమంటున్నారు నెటిజన్లు. ఇది ఒక్క బెట్టింగ్ యాప్స్, రోడ్లపై న్యూసెన్స్ చేసేవారికే లెసన్ కాదు. లైకులు, షేర్ల, సంపాదన కోసంవెర్రి వేషాలు వేసే ప్రతి ఒక్కరికి వార్నింగ్. ఇకనైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ మానకపోతే.. కటకటాలు తప్పవు మరి.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×